రామ్ గోపాల్ వర్మకు బిగ్‌ షాక్‌.. ఆ డ‌బ్బు చెల్లించ‌కుంటే జైలుకే!

Publish Date:Dec 21, 2024

Advertisement

వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో జ‌రిగిన అవినీతి అక్ర‌మాలు అన్నీఇన్నీకావు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత  వైసీపీ నేత‌ల అవినీతి భాగోతాలు గుట్టలు గుట్టలుగా వెలుగులోకి వ‌స్తున్నాయి. ముఖ్యంగా ప్రజ‌లు ప‌న్నుల రూపంలో ప్ర‌భుత్వానికి చెల్లించిన సొమ్మును జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అప్ప‌నంగా తన అనుచ‌ర గ‌ణానికి, సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను బూతులు తిట్టిన వారికి జీతాల రూపంలో ఇచ్చేశారు. ఏపీ విజిలెన్స్ విభాగం ఫైబ‌ర్ నెట్‌, డిజిట‌ల్ కార్పొరేష‌న్, స్కిల్ డ‌వ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ల‌లో వైసీపీ హ‌యాంలో జ‌రిగిన అవినీతిపై విచార‌ణలో ఈ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. సినీ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ డ‌బ్బు తీసుకొని వైసీపీకి అనుకూలంగా సినిమాలు తీశార‌న్న విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న‌కు ఇచ్చిన డ‌బ్బు ఎవ‌రో నిర్మాత‌లు ఇచ్చింది కాదు,  ప్ర‌భుత్వం సొమ్మేన‌ని తేటతెల్లమైంది. అంతే కాదు.. డిజిట‌ల్ కార్పొరేష‌న్ ద్వారా, ఫైబ‌ర్ నెట్ ద్వారా, స్కిల్ డ‌వ‌ల‌ప్ మెంట్ ద్వారా వైసీపీ కుటుంబ స‌భ్యుల‌కు, వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌కు భారీ మొత్తంలో జీతాలు చెల్లించేశారు. వీరంతా సోష‌ల్ మీడియా ద్వారా అప్పటి ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, వైసీపీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన వారిని, జ‌గ‌న్‌తో రాజ‌కీయంగా విభేదించిన ఆయ‌న‌ చెల్లిని, త‌ల్లిని విమ‌ర్శించ‌డంతోపాటు, అస‌భ్య‌  ప‌ద‌జాలంతో దూసించేవారు.  

వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో రాంగోపాల్ వ‌ర్మ వ్యూహం, శ‌పథం అనే రెండు సినిమాల‌ను తీశారు. రాంగోపాల్ వ‌ర్మ ఈ సినిమాలు తీసే స‌మ‌యంలోనే.. ఈ సినిమాలు తీసేది చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను విమ‌ర్శించ‌డానికి.. వైఎస్ఆర్‌, వైఎస్‌ జ‌గ‌న్ రెడ్డిని పొగ‌డ‌టానికి అని బొమ్మ‌ల ద్వారా త‌న‌ ట్విట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు. అయితే, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి, వైసీపీ మేలు చేసేలా తీసిన వ్యూహం సినిమాను ఏపీ ఫైబ‌ర్ నెట్‌లో విడుద‌ల చేశారు. ఇందుకుగాను పైబ‌ర్ నెట్ కార్పొరేష‌న్ ద్వారా రూ.2.10కోట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. రాంగోపాల్ వ‌ర్మ‌కు సంబంధించిన ఒక సంస్థ‌కు సుమారు 1.10 కోట్లు చెల్లించిన‌ట్లు ఏపీ విజిలెన్స్ విభాగం విచార‌ణ‌లో వెలుగులోకి వ‌చ్చింది. మ‌రో రూ.90ల‌క్ష‌లు పెండింగ్‌లో ఉండ‌గా..  పెండింగ్ సొమ్ము చెల్లించ‌వ‌ద్ద‌ని ఫైబ‌ర్ నెట్ కొత్త కార్య‌వ‌ర్గానికి విజిలెన్స్ నివేదిక సిఫార్సు చేసింది. అదేవిధంగా మ‌మ్ముట్టి  క‌థానాయ‌కుడిగా తీసిన యాత్ర‌-2 సినిమాకు కూడా రూ.2.10 కోట్లు ఏపీ డిజిట‌ల్ కార్పొరేష‌న్ ద్వారా కేటాయించారు. వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో ఏపీ డిజిట‌ల్ కార్పొరేష‌న్ కు ఎండీగా వాసుదేవ రెడ్డి ఉన్నారు. వీరి ఆధ్వ‌ర్యంలో వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌కు ప్ర‌భుత్వ సొమ్ముతో జీతాలు చెల్లించార‌ని తెలుస్తోంది. వీరంతా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌తిప‌క్ష నేత‌లు, వారి క‌టుంబ స‌భ్యుల‌పై అస‌భ్య‌  ప‌ద‌జాలంతో, మార్పింగ్ పొటోల‌తో పోస్టులు చేసేవారు. వీరిలో కొంద‌రు కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. 

తాజాగా  సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఝలక్ ఇచ్చింది. వ్యూహం సినిమాకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందటంపై ఏపీ ఫైబర్ నెట్ కార్పోరేషన్ నోటీసులు పంపింది. వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి రూ. 1.15 కోట్ల రూపాయలు అనుచితంగా లబ్ది పొందారని పేర్కొంటూ రామ్ గోపాల్ వర్మకు లీగల్ నోటీసులు పంపింది ఏపీ స‌ర్కార్‌. ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాల మేరకు నాటి ఫైబర్ నెట్ ఎండీతో పాటు మరో ఐదుగురికి నోటీసులు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజుల లోపు వడ్డీతో సహా ఆ మొత్తాన్ని కట్టాలని ఆదేశించారు.  ఈ విష‌యంపై జీవీ రెడ్డి మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ సార్వత్రిక ఎన్నికలకు ముందు తీసిన 'వ్యూహం' సినిమాకు రూ.2.15 కోట్లు ఫైబర్ నెట్ తో అగ్రిమెంట్ చేసుకొని 1.15 కోట్లు చెల్లించిందని తెలిపారు. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని వివరించారు. వ్యూహం సినిమాకు కేవలం 1863 వ్యూస్  ఉన్నాయని, ఈ లెక్కన ఒక్కో వ్యూస్ కు 11000 చొప్పున చెల్లించినట్లు అయ్యిందని, దీనిపై వివరణ కోరుతూ లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది అని చైర్మన్ జీవి రెడ్డి తెలిపారు.

పదిహేను రోజుల్లోపు తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇవ్వకపోతే కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రజాధనానికి సంబంధించిన మ్యాటర్ కావడంతో ముందుగా డబ్బుల రికవరీకి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆర్జీవీకి ఈ మొత్తమే వచ్చాయా..ఇతర మార్గాల్లో ఏమైనా ప్రభుత్వం చెల్లించిందా అన్నది బయటకు రావాల్సి ఉంది.

By
en-us Political News

  
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం (డిసెంబర్ 22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 14 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బంప‌ర్ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం ఏపీలో అభివృద్ధే ల‌క్ష్యంగా దూసుకెళ్తోంది. కేంద్రం స‌హ‌కారంతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు కృషి చేస్తున్నారు. ఇదే క్ర‌మంలో గ‌డిచిన ఐదేళ్ల కాలంలో అరాచ‌క పాల‌న సాగించిన వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి వ‌రుస‌గా షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. జ‌గ‌న్ వెంట ఉంటే త‌మ‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని భావించిన వైసీపీ కీల‌క నేత‌లు ఒక్కొక్క‌రుగా పార్టీని వీడుతున్నారు.
తెలుగు రాష్ట్రాలకు భూ కంపం భయం వెంటాడుతోంది. ఇటీవల  తెలంగాణ లోని ములుగు, హన్మకొండ, భూ పాలపల్లి, ఉమ్మడి ఖమ్మం , హైద్రాబాద్ లలో భూకంపం  వాటిల్లింది.
సినీ హీరో అల్లు అర్జున్ వల్లే సంధ్య థియేటర్ ఘటనలో  తల్లి రేవతి చనిపోయిందని, కొడుకు కొనఊపిరితో కొట్టు మిట్టాడుతున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
భారత పార్లమెంట్ లో హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేడ్కర్ పై చేసిన వ్యాఖ్యలు దేశంలో మంటలు రేపాయి. దేశ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ ను అవమానించేందుకు బీజేపీ సాహసించడమంటే.. భవిష్యత్ లో భారత రాజ్యాంగాన్ని పక్కనబెట్టి వారి సొంత రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు రెడీ అయిపోయిందనడానికి సంకేతమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ వాదులంతా బిజెపి ఆలోచనలు, విధానాలను తీవ్రంగా వ్యతిరేస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. శనివారం(డిసెంబర్ 21) ఉదయం శ్రీవారి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు.
మాజీ మంత్రి కేటీఆర్ కు ఈ ఫార్ములా కార్ రేసు కేసు విషయంలో న్యాయపరమైన చిక్కులు తప్పవన్న భావన పరిశీలకులలో వ్యక్తం అవుతోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండటం కోసం, పెట్టుబడుల ఆకర్షణ కోసమే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వాహకులకు సొమ్ము ఇవ్వాల్సి వచ్చిందన్న కేటీఆర్ వివరణ న్యాయ పరీక్షకు నిలబడే అవకాశాలు అంతంత మాత్రమేనని అంటున్నారు.
ఫార్ముల-ఈ కార్ రేసు విషయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఏసీబీ కేసు విషయంలో కోర్టు నుంచి వారం రోజుల ఉపశమనం లభించిందని ఊపిరి పీల్చుకునేలోగానే ఇదే విషయంపై ఈడీ కేసు నమోదు చేసి షాక్ ఇచ్చింది.
సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి నటుడు అల్లు అర్జున్ పై జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప-2 ప్రీమియర్స్‌కు నటీనటులను ఎవరినీ రావొద్దని చెప్పాలని తాము సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ముందుగానే సమాచారం ఇచ్చామని పోలీసులు తెలిపారు. ఘటన జరిగినప్పటి నుంచి స్పందించని సంధ్య థియేటర్ యాజమాన్యం.. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో.. బందోబస్తు చేయాలంటూ పోలీసులను కోరుతూ రాసిన లేఖను విడుదల చేసింది.
అధికారమే పరమావధిగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మ దినోత్సం డిసెంబర్ 21. ఆయనపై పలు కేసులు, అవినీతిపరుడంటూ ఆరోపణలు రావడంతో ప్రజలు ఇంటికి పంపించి వేశారు.  గెలిచిన ఎమ్మెల్యేలను  పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిన ధీశాలి వైఎస్ జగన్.   ప్రజా సంకల్ప యాత్రతో  అకారణంగా జనంతో మమేకమైన నేతగా పేరు మూటగట్టుకున్నారు.
మరి అల్లర్ల విషయంలో వినిపిస్తున్న హెచ్చరికలు ముందస్తు ప్రణాళికతో బీఆర్ ఎస్ పార్టీ చేస్తున్నవేనా.. ప్రజలు అప్పుడొకలా ఇప్పుడొకలా రియాక్ట్ అవడం అంటూ జరిగితే మాత్రం రేవంత్ సర్కార్ పాలనపై కొంత విముఖత మొదలైందని భావించవచ్చా..అదే జరిగితే ఇదంతా దేనికి సంకేతం అనుకోవచ్చు..చూద్దాం..
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూశారు. హర్యానా రాష్రానికి ఐదు సార్లు సీఎంగా సేవలందించిన నాయకుడు ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం (డిసెంబర్ 20) మధ్యాహ్నం కార్డియాక్ అరెస్ట్ తో తుదిశ్వాస విడిచారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కొత్త సంవత్సరంలో నవశకం ఆరంభం కానుంది. జగన్ ఐదేళ్ల హయాంలో అన్ని విధాలుగా భ్రష్ఠుపట్టించిన రాజధాని నిర్మాణ పనులు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జోరందుకున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.