జగన్‌కు బిగ్ ఝలక్.. బద్వేల్‌లో ఊహించని షాక్..
Publish Date:Nov 2, 2021
Advertisement
సీఎం జగన్‌కు ఊహించని షాక్ తగిలింది. బద్వేల్‌లో అనూహ్య ఫలితం వచ్చింది. భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ గెలిచినా.. ఆ సంతోషం జగన్‌రెడ్డిలో ఎంతో సేపు నిలువలేదు. పూర్తి ఫలితాలు వచ్చాక.. అసలు విషయం తెలిసి ఆనందం ఆవిరైపోయిందని అంటున్నారు. ఇంతకీ.. గెలిచిన సీటుపై జగన్‌కు అంత దిగాలెందుకు? జగన్‌రెడ్డికి దిమ్మతిరిగేలా చేసిన ఆ విషయం ఏంటంటే... వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఇగో ఎక్కువని పార్టీ వర్గాల మాట. ఆయన ఆధిపత్యానికి ఏమాత్రం తేడా వచ్చినా సహించరని చెబుతారు. జగన్ సమక్షంలో ఏ పార్టీ నాయకుడైనా ఆయనకంటే అద్భుతంగా ప్రసంగిస్తే కుళ్లుకుంటారని కూడా అంటారు. ఓర్వలేని తనం.. అసూయ.. వైసీపీ అధినేతలో బాగా ఉంటుందని టాక్. జగన్ ముందు వేరే వారిని పొగిడినా అస్సలు సహించరట. అందుకే, పార్టీ శ్రేణులంతా జగన్ ముందు తామంతా తక్కువే అన్నట్టు తెగ నటిస్తుంటారు.. ఆయన్ను మీరే గొప్పంటూ ఎప్పటికప్పుడు పొగుడుతుంటారు. అలాంటి జగన్‌రెడ్డికి బద్వేల్ ఉప ఎన్నికలో ఊహించని షాక్ తగిలిందంటున్నారు. జగన్ ఇగోను సవాల్ చేసేలా ఫలితం రావడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారని చెబుతున్నారు. బద్వేల్‌లో వైసీపీ గెలిచినా.. అభ్యర్థి దాసరి సుధాకు తనకంటే ఎక్కువ మెజార్టీ రావడం.. తన రికార్డును బ్రేక్ చేయడంపై జగన్‌రెడ్డి అసహనంతో ఉన్నారని అంటున్నారు. ఆయన ఇగో దెబ్బతిందని పార్టీ వర్గాల మాట. 2019 ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసిన వైఎస్ జగన్.. టీడీపీ అభ్యర్థి సింగా సతీష్ కుమార్ రెడ్డిపై 90,110 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. కడప జిల్లాలోనే కాదు.. ఏపీ మొత్తం మీద జగన్‌దే భారీ మెజార్టీ. 2019 ఎన్నిల్లో రికార్డు మెజార్టీ. అయితే జగన్ పేరు మీద ఉన్న ఆ రికార్డ్‌ను బద్వేల్ వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ బ్రేక్ చేశారు. 90,550 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. అంటే జగన్ కంటే 440 ఓట్లు మెజార్టీ ఎక్కువ సాధించారు. దెబ్బకు జగన్ రికార్డు తుడుచుపెట్టుకుపోయింది. దాసరి సుధ పేరు మీదగా సరికొత్త రికార్డు నెలకొంది. ఇదే ఇప్పుడు ఆమెకు ఇబ్బందికరంగా మారనుంది అంటున్నారు. గెలిచామనే సంబరం లేకుండా చేసిందని చెబుతున్నారు. జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందోనని దాసరి సుధ ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/big-shock-to-cm-jagan-in-badwel-by-election-25-125703.html





