మూడో ప్రపంచయుద్ధం.. వినాశనం తప్పదా?

Publish Date:Nov 20, 2024

Advertisement

అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల ఫలితం మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేపిందా?  అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ విజయాన్ని జీర్ణించుకోలేని బైడెన్.. ప్రపంచ యుద్ధానికి తెరలేపే నిర్ణయం తీసుకున్నారా? అంటే ప్రపంచ దేశాల మేధావులు అవుననే అంటున్నారు. బైడెన్ ఓటమి ఉక్రోషంతో తీసుకున్నా, వయస్సు రిత్యా వివేకం, వివేచనా కోల్పోయి తీసుకున్నా.. ఆయన నిర్ణయం ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం ముంగిట నిలిపింది. ఇంతకీ బైడెన్ ఏం చేశారంటే.. అమెరికా ఇచ్చిన క్షిపణులను ఉక్రెయిన్ రష్యాపై ప్రయోగించడానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పుతిన్... అణ్వాయుధాలను యుద్ధంలో ఉపయోగించడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వ్యులు ఇచ్చేశారు. దీంతో ప్రపంచం అంతటా యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేసే ఏ దేశంపైనైనా దాడులు చేస్తామని పుతిన్ గతంలోనే హెచ్చరించిన సంగతి తెలిసిదే. ఆ సమయంలోనే ఆయన  అణు దాడికి కూడా వెనుకాడబోమని విస్ఫష్టంగా చెప్పారు. 

ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ అధికారం నుంచి దిగిపోవడానికి సరిగ్గా రెండు నెలల ముందు తమ దేశం సరఫరా చేసిన క్షిపణులను రష్యాపై ప్రయోగించడానికి ఉక్రెయిన్ కు అనుమతి ఇచ్చేశారు. దీంతో మండిపడిన పుతిన్ అణ్వాయుధాల వినియోగానికి తమ సైన్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వాస్తవానికి ట్రంప్ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన కారణం తాను అధికారంలోకి వస్తే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ఇచ్చిన హామీయే అని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. పుతిన్, ట్రంప్ ల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో అమెరికన్లు ఆయన అధికార పగ్గాలు చేపడితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలరని నమ్మారు. అదే సమయంలో ట్రంప్ కు ప్రత్యర్థిగా అమెరికా ఎన్నికలలో పోటీ చేసిన  బైడెన్ విధానాల కారణంగానే ఓటమి పాలయ్యారు. బైడెన్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచారు. పరోక్షంగా పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ప్రోత్సహించారు.

ఈ నేపథ్యంలోనే ప్రపంచానికి పెద్దన్నగా తనకు తాను చెప్పుకునే అమెరికా ఉక్రెయిన్ కు తన క్షిపణుల వినియోగానికి అనుమతించడం ద్వారా  రష్యాను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టిందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టేంత వరకూ రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు, పరస్పర దాడులు పెచ్చరిల్లకుండా  ఇరు దేశాలు నియంత్రణ పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.  

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.