గాంధీ ఆసుపత్రిలో ఆగంతకుడు హల్‌చల్: గంటపాటు హైడ్రామా.!

Publish Date:Sep 28, 2026

Advertisement

సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి వద్ద ఉన్న రేకుల షెడ్‌పైకి ఎక్కిన అతడు.. చేతిలో పదునైన రాళ్లు పట్టుకుని కింద ఉన్న వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. తన దగ్గరకు ఎవరైనా వస్తే రాళ్లు విసిరేస్తానంటూ బెదిరించ డంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.షెడ్‌పై నుంచి కిందకు చూస్తూ రాళ్లు చేతిలో పట్టుకుని హల్‌ చల్‌ చేయడంతో ఆసుపత్రి కి వచ్చిన రోగులు, వారి సహాయకులు, సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అతడు ఎప్పుడు ఏం చేస్తాడోనన్న భయంతో సిబ్బంది అప్రమ త్తంగా వ్యవహరించారు. దాదాపు అరగంట పాటు షెడ్‌పైనే ఉంటూ కింద ఉన్నవారిపైకి రాళ్లు విసిరేస్తానంటూ బెదిరించ డంతో అక్కడ టెన్షన్‌ వాతావరణం నెలకొంది.


ఈ ఘటనతో గాంధీ ఆసుపత్రి వద్ద కొంతసేపు రాకపోకలు, సాధారణ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. అతడిని కిందకు దింపేందుకు సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్నించినప్పటికీ.. రాళ్లు విసిరేస్తానంటూ హెచ్చరించడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పరిస్థితి మరింత తీవ్రం కాకుండా సిబ్బంది దూరంగా ఉండి అతడిని గమనిస్తూ ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మానసిక రోగిని కిందకు దింపేందుకు పోలీసులు కూడా జాగ్రత్తగా వ్యవహరిం చారు. కొద్దిసేపటి పాటు కొనసాగిన ఈ హైడ్రామా అనంతరం ఎట్టకేలకు అతడిని పోలీసులకు అదుపులోకి తీసుకు న్నారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు, వారి బంధువులు ఊపిరి పీల్చు కున్నారు.దాదాపు గంటపాటు కొనసాగిన ఈ ఘటన గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో కలకలం రేపింది. రాళ్లతో హల్‌చల్‌ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం తో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది.

 

 

 

[ Gandhi Hospital, Secunderabad, Mental Health Patient, Hospital Incident, Stone Attack, Hospital Tension, Police Intervention, High Drama, Hospital Security, Telangana News, Hyderabad News, Patient Commotion, Gandhi Hospital Incident, Police Action, Security Alert ]
 

By
en-us Political News

  
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.