కన్న తండ్రిపై కొడుకుల దాడి... తండ్రి మృతి

Publish Date:Apr 5, 2026

Advertisement

 

పచ్చని సంసారం… చక్కటి పిల్లలు… సాఫీగా సాగుతున్న జీవితం… కానీ అక్రమ సంబంధాల కారణంగా కుటుంబాల్లో కలహాలు పెరిగి విషాదాంతాలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అలాంటి దుర్ఘటన ఒకటి భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన కుర్రె చేరాలు, సులోచన దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రామ్, లక్ష్మణ్ అనే ఇద్దరు కుమారులతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు ఇప్పటికే వివాహాలు కాగా, కుమారులు హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా సులోచన హైదరాబాద్‌లో కుమారుల వద్దే ఉంటుండగా, చేరాలు గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్నాడు.

ఈ క్రమంలో శనివారం రాత్రి తండ్రిని చూసేందుకు ఇద్దరు కుమారులు గ్రామానికి వచ్చారు. అయితే అక్కడ తండ్రి మరో మహిళతో కలిసి ఉండడం గమనించి వారు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తల్లి స్థానంలో మరో మహిళ కనిపించడంతో ఆవేశానికి గురైన కుమారులు తండ్రిపై, ఆ మహిళపై విచక్షణారహితంగా దాడికి దిగారు.

ఈ దాడిలో చేరాలు, ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. చేరాలను ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడిన మహిళ ప్రస్తుతం పరకాల ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

By
en-us Political News

  
మహిళా హక్కుల పరిరక్షణ, సమాజంలో లింగ సమానత్వాన్ని పెంపొందించే దిశగా అస్సాం
ఖమ్మం జిల్లా చింతకానిలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కోరుతూ టీడీపీ నేతలు విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు
తెలంగాణలో ఓటరు జాబితాలో ఉన్న డబుల్, డూప్లికేట్ ఓట్లను తొలగించి ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.
గగనతలంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య విమానంలో ఊహించని సాంకేతిక లోపం తలెత్తి తీవ్ర కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా చేపడుతున్న కూల్చివేతల వ్యవహారం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది.
1000 కి.మీ. ప్రయాణించి.. గూగుల్ మ్యాప్స్‌తో వెతికి.. అప్పు తీర్చిన కేరళ స్నేహితుడు..!
పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం మధ్యాహ్నం చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి ఆయన విడుదలయ్యారు.
తెలంగాణలోని జనగామ జిల్లా కేంద్రంలో ఊహించని రీతిలో ఒక వింత ఘోరం జరిగింది.
ఓ యువకుడిని హీరోగా సినీ పరిశ్రమకు పరిచయం చేస్తానని నమ్మించి, అతని కుటుంబం నుంచి 3.5 కోట్లకు పైగా డబ్బులు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలతో దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై కేసు నమోదైంది.
తమిళనాడు రాజకీయాల్లో కరూర్ తొక్కిసలాట ఉదంతం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నాటి తొక్కిసలాట సంఘటన తన జీవితంలో ఎన్నడూ మరచిపోలేని విషాద ఘటనగా అభివర్ణించారు. నాటి సంఘటనను తలచుకుంటూ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. తనను నమ్మి ఆ సభకు వచ్చిన వారిని కాపాడుకోలేకపోయానన్నారు. తనను నమ్మినందుకే వారు బలయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఛాంపియన్‌గా అవతరించిన కొద్దిరోజుల్లోనే టీమిండియా ప్రదర్శన ఘోరంగా దిగజారడం క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.