డ్రగ్స్ కేసులో ముంబై నటుడు సహా ఆరుగురు అరెస్ట్ : ఈగిల్ టీం
Publish Date:Apr 5, 2026
Advertisement
డ్రగ్స్ వినియోగంపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రముఖ తారామతి బారాదరి రిసార్ట్‌లో జరిగిన పార్టీపై ఈగిల్ ఫోర్స్ ఆకస్మిక దాడి నిర్వహించామని ఈగిల్ టీం అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో ముంబైకి చెందిన నటుడు సహా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని తెలి పారు.నిన్న అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్లోని తారామతి బారాదరి రిసార్ట్‌లో నిర్వహించిన ప్రత్యేక పార్టీపై ఈగిల్ ఫోర్స్ బృందం సోదాలు చేపట్టామని తెలిపారు “More Than Friends” పేరుతో ఒక ప్రైవేట్ సంస్థ ఈ పార్టీని నిర్వహించినట్లు గుర్తించామని ఈగిల్ టీం అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ తీసుకుని పార్టీకి హాజరైనట్లు గుర్తించిన వారిలో ముంబైకి చెందిన నటుడు& మోడల్ సర్వర్ ప్రధానంగా ఉన్నాడు. అతడితో పాటు ప్రముఖ డీజే జాన్సన్ తో పాటు వ్యాపారులు కూడా ఉన్నారు.. ఈ పార్టీకి ప్రముఖ ముంబై మరియు టాలీవుడ్ సినీ వర్గాలకు చెందిన పలువురు హాజరయ్యారు. ఈ పార్టీలో అనుమానం ఉన్న 35 మందికి డ్రగ్స్ టెస్టులు చేశాం... అందులో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయింది.. దీంతో నటుడు సర్వర్, స్పైసెస్ వ్యాపారి నీహార్, వ్యాపారవేత్త నీహర్ భార్య ఆశి, డీజే జాన్సన్, వ్యాపారవేత్త యోగేశ్వర్, ఫార్మాస్యూటికల్ అనలిస్ట్ అవినాష్ లను పోలీసులు అరెస్ట్ చేశారు... వీరంతా డ్రెస్ తీసుకున్నట్లుగా అంగీకరించారు..వారిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేశాము డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ఈగల్ టీం దర్యాప్తు కొనసాగుతుంది.డ్రగ్స్ వినియోగంపై మరింత సమాచారం సేకరిస్తున్నా మని... హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని అధికారులు హెచ్చరించారు.
http://www.teluguone.com/news/content/-taramati-resort-drug-raid-36-216727.html





