కుమారుడి విజయం కోసం టీటీడీ నిధులు.. భూమన భారీ స్కెచ్!?

Publish Date:Oct 20, 2023

Advertisement

గతంలో రాజకీయ నాయకులు ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ జేబులోని నగదు తీసి ఖర్చు పెట్టే వారు. అంటే సొంత డబ్బును ప్రజల కోసం వినియోగించేవారు. అయితే రానురాను  ఆ పరిస్థితి మారింది. ఏపీ సీఎం జగన్ భాషలో చెప్పాలంటే రివర్సైంది. దాంతో  రాజకీయమే కాదు.. రాజకీయ నాయకులూ మారిపోయారు. దీంతో ఈ నయా రాజకీయ నాయకులు సొంత సొమ్మును తమ ఇళ్లలోని ఇనపెట్టిల్లో, లేకుంటే బ్యాంకు లాకర్లలో.. అదీ కాకుంటే తమ బ్యాంకు ఖాతాల్లో భద్రంగా దాచుకోని..  ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న నగదును వివిధ పథకాల రూపంలో అదే ప్రజల కోసం వినియోగిస్తూ.. తమ జేబులో నుంచి కోట్లకు కోట్ల రూపాయిలు తీసి..చెల్లిస్తున్నట్లుగా  బిల్డప్ ఇస్తున్నారు.   అయితే టీటీడీ  చైర్మన్ కం తిరుపతి ఎమ్మెల్యే అయిన భూమన కరుణాకరరెడ్డి మాత్రం ఒక అడుగు ముందుకు వేసి  దేవుడికి ముడుపులు రూపంలో భక్తులు చెల్లిస్తున్న నగదును   ప్రజావసరాల  పేరుతో సొంత లాభం కోసం వినియోగించేందుకు వీలుగా  నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ నిర్ణయమే తీవ్ర వివాదాస్పదంగా మారింది.  విషయమేమిటంటే..

 తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌,తిరుపతి ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షన తాజాగా  జరిగిన టీటీడీ  పాలక మండలి సమావేశంలో టీటీడీకి వార్షిక  బడ్జెట్‌ నిధుల్లో ఒక శాతాన్ని తిరుపతి అభివృద్ధి కోసం వినియోగించాలని  నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

శ్రీవారు కొలువు తీరిన తిరుమల కొండపై ఇప్పటికే ఆచార వ్యవహారాలు కొండెక్కాయని ఇప్పుడు దేవుడి నిధులను కూడా పక్కదారి పట్టించేయడానికి నిర్ణయం తీసుకున్నారని ఈ నిర్ణయంపై పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో  తన కుమారుడు  భూమన అభినయ్ రెడ్డికి టికెట్ ఇచ్చి గెలుపించుకొనేందుకే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ హోదాలు తిరుపతి అభివృద్ధికి  టీటీడీ బడ్జెట్ నుంచి నిధులు కేటాయించాలని నిర్ణయించారని అంటున్నారు.  అయినా టీటీడీ వార్షిక బడ్జెట్ వందల, వేల కోట్ల రూపాయిల్లో ఉంటుందని.. అందులో ఒక శాతం అంటే.. దేవుడి సొమ్ము కోట్లాది రూపాయిలు కైంకర్యం చేసేందుకు భూమన స్కెచ్ వేశారని అంటున్నారు.  

అయినా దేశంలో ఎక్కడా కూడా దేవాలయాలపై వచ్చే సొమ్మును ఇతర అవసరాల కోసం ఖర్చు చేయడం  లేదని  గుర్తు చేస్తున్నారు. అదీకాక జగన్ ప్రభుత్వ ఖజానాలో నిధులు నిండుకొన్నాయని.. దీంతో రాష్ట్రంలోని ఏ పట్టణం, ఏ నగరం అభివృద్ధికి నోచుకోలేదని.. దీంతో దేవుడి నిధులు తిరుపతి అభివృద్ధికి మళ్లీస్తే.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నగరాన్ని  అభివృద్ధి చేశానంటూ.. ప్రజలకు చెప్పుకుని, మా అబ్బాయిని గెలిపిస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తామని చెప్పుకుని ఓట్లు దండుకునేందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల శ్రీవారి సొమ్మును తిరుపతి అభివృద్ధి కోసం మళ్లించే నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయినా గతంలో  తాను నాస్తికుడినని బాహాటంగా చెప్పి.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని నల్లరాయి అన్న  భూమన   కరుణాకర్ రెడ్డికి టీటీడీ బోర్డ్ చైర్మన్ గా నియమించిన నాడే.. జగన్ పై విరమ్శలు వెల్లువెత్తాయి.

వినాశకాలే విపరీత బుద్ధీ అంటూ నాడే నెటిజన్లు ఓ రేంజ్ లో జగన్ పై విమర్శలు గుప్పించారు.    పద్దతికే అసలు సిసలు బ్రాండ్ అంబాసిడర్‌లాగా నిలువు బొట్టు పెట్టి.. తనకు మాత్రమే సాధ్యమైన అభినయంతో మాట్లాడుతూ.. తాను గతంలో అన్న మాటలు జనం మరిచిపోయారన్న భ్రమలో  పరమ భక్తుడిలాగా బిల్డప్ ఇచ్చుకునే భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు టీటీడీ బడ్జెట్ నుంచి తిరుపతి అభివృద్ధికి నిధుల మళ్లింపు నిర్ణయంతో తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం.. ఓ ధార్మిక కేంద్రం అన్న సంగతిని ఈ ప్రభుత్వం ఎప్పుడో మరిచిపోయిందని.. ఇది ఓ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందని.. అదీకాక   టీటీడీని జగన్ సర్కార్ కామధేనువుగా భావించి ఇష్టారీతిన పద్ధతులు పాటించకుండా దోపిడీయే లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు అన్ని వర్గాల నుంచీ వస్తున్నాయి. ఇందుకు  తార్కానంగా ప్రభుత్వం ఇటీవల నియమించిన టీటీడీ బోర్డు సభ్యులను ఉదహరిస్తున్నారు.  అయినా కరుణాకర్ రెడ్డి తన కుమారుడి  విజయం కోసం దేవుడు సొమ్మును ఇలా వాడుకొవడం చూస్తుంటే.. ఆయన ఓ రాజకీయ ఘనపాటి అని వారు సెటైరికల్‌గా అభివర్ణిస్తున్నారు. 

అదీకాక ఇప్పటికే టీటీడీ అంశంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై భక్తులు, విపక్షాలు మండిపడుతుండగా.. తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

By
en-us Political News

  
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.