భోగాపురం ఎయిర్ పోర్టు.. వైసీపీ విమర్శలను పట్టించుకోని విశాఖ జనం.!

Publish Date:Aug 3, 2026

Advertisement

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సాకారమైన తరుణంలో..  విశాఖపట్నానికి   భోగాపురం విమానాశ్రయం చాలా దూరంలో ఉందంటూ వైసీపీ చేస్తున్న విమర్శలను  విశాఖ జనమే ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. అసలు భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది. అసలు భోగాపురం ప్రాధాన్యత, పౌర సేవలు ఇక్కడికి మార్చడం వెనుక ఉన్న వ్యూహాలు, క్షేత్రస్థాయి సానుకూలతల విషయానికి వస్తే.. 

విశాఖ నుంచి  45 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని వైసీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతికూల అంశంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేస్తోంది.  ఈ సందర్భంగా వైసీపీ విమర్శలను పరిశీలకులు తోసిపుచ్చుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ లో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చినప్పుడు కూడా సరిగ్గా ఇటువంటి సందేహాలూ, విమర్శలూ  వ్యక్తమయ్యాయి. అప్పట్లో నగర నడిబొడ్డున ఉన్న బేగంపేట విమానాశ్రయాన్ని మూసివేసి..  నగరం బయట ఉన్న శంషాబాద్‌కు విమాన సేవలను తరలిస్తున్న సమయంలో ప్రజల నుంచి దూరం, ప్రయాణ సమయం, చివరి మైలు కనెక్టివిటీపై   వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే.. ఇప్పుడు  శంషాబాద్ విమానాశ్రయం దేశంలోనే అత్యుత్తమ,  అలాగే  ప్రపంచ స్థాయి ఎయిర్‌పోర్ట్‌లలో ఒకటిగా నిలవడమే కాకుండా, శరవేగంగా విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ అవసరాలను ఎంతో సమర్థవంతంగా తీరుస్తోంది. ఇప్పుడు ఎవరి నోటీ దూరం మాట వినిపించడం లేదు. అదే తరహాలో భోగాపురం కూడా రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర రూపురేకలను మార్చివేస్తుందని పరిశీలకులు చెప్పడం కాదు.. ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. 

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక విమానాశ్రయాలను నగరాలకు దూరంగా నిర్మించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే.   ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో కూడా ఎయిర్‌పోర్ట్‌లు నగర నడిబొడ్డున లేవు. నగరాల పరిధిలో భూముల ధరలు అత్యంత భారీగా ఉండటం..  విస్తరణకు కావలసిన  భూమి లభించకపోవడం  ఒక కారణమైతే..  నగరం నడిబొడ్డున విమానాశ్రయం ఉంటే..  ఎయిర్ పోర్టుకు  వచ్చే వాహనాల వల్ల   ట్రాఫిక్ సమస్యలు తలెత్తి జనం ఇబ్బందులకు ఎదుర్కోవలసి ఉంటుంది. బేగంపేటలో పౌర విమాన సేవలు కొనసాగిన సమయంలో తరచూ ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యేదన్న సంగతి విదితమే. వేగంగా విస్తరిస్తున్న విశాఖ వంటి పారిశ్రామిక నగరంలో, నగర పరిధిలోనే అంతర్జాతీయ స్థాయి రన్‌వేలు, టెర్మినళ్లు, కార్గో కాంప్లెక్స్‌లను విస్తరించడం దాదాపు సాధ్యం కాదు. ఈ విషయాన్ని నిపుణులే చెప్పారు. 

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రభుత్వప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి)లో జీఎమ్‌ఆర్    భారీ పెట్టుబడులతో నిర్మించింది. దీని నిర్వహణ కూడా జీఎంఆర్ సంస్థే చేపట్టింది.  ఇంతటి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే సమీపంలో మరో పోటీ విమానాశ్రయం ఉంటే ఇబ్బంది. అందుకే హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన వెంటనే బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ను పౌర విమాన సర్వీసులకు మూసివేశారు. ఇప్పుుడు కూడా అలాగే..  విశాఖలోని పాత విమానాశ్రయం నుంచి  పౌర సేవలకు క్రమంగా  స్వస్తి చెప్పి.. ఆ విమానాశ్రయాన్ని  ఇండియన్ నేవీ ఆపరేషన్లకు అప్పగిస్తారు. ఇకపై షెడ్యూల్డ్ వాణిజ్య విమానాలన్నీ భోగాపురం నుంచే రాకపోకలు సాగిస్తాయి.

విశాఖపట్నంవాసులు ఈ దూర భారాన్నీ, భయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడానికి మరో కారణమేంటంటే..  విమాన ప్రయాణం అనేది ఆర్టీసీ బస్సు స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ మాదిరిగా ప్రతిరోజూ సాధారణ ప్రజలు ఉపయోగించేది కాదు. విశాఖపట్నం మొత్తం జనాభాలో 70 శాతానికి పైగా ప్రజలు నిత్యం విమానాశ్రయాన్ని సందర్శించరు. కేవలం కొద్ది శాతంగా ఉండే వ్యాపారులు, పర్యాటకులు, ఐటీ నిపుణులు, అత్యవసర ప్రయాణికులు మాత్రమే తరచూ విమానాలను ఆశ్రయిస్తారు. పైగా.. ప్రస్తుతం ఉన్న విశాఖ విమానాశ్రయం  నేవీ ఆధీనంలో ఉండటంతో పాటు, చుట్టూ కొండలు, విస్తరించిన జనావాసాలు ఉండటంతో రాత్రివేళల్లో ల్యాండింగ్‌లు, పెద్ద బోయింగ్ విమానాల రాకపోకలకు   పరిమితులు ఉన్నాయి. అంతర్జాతీయంగా నేరుగా కనెక్టివిటీ సాధించాలంటే భోగాపురం వంటి ఆధునిక గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఒక్కటే శరణ్యం.

అలాగే..  విశాఖపట్నం  భౌగోళికంగా ఉత్తరం వైపున భోగాపురం, ఆనందపురం, భీమిలి దిశగా వేగంగా విస్తరిస్తోంది. రాబోయే పది,  పదిహేనేళ్లలో విశాఖ మహానగరం భోగాపురం వరకు విస్తరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ జోన్లు, ఐటీ పార్కులు, ఏరోసిటీ, విద్యా,  వైద్య సంస్థలు, లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతుండటంతో ఆ ప్రాంతమంతా కొత్త ఆర్థిక హబ్‌గా మారబోతోంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రావడం వల్ల కేవలం విశాఖపట్నానికే కాకుండా సమీపంలో ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు కూడా విమాన ప్రయాణం  సులభతరం అవుతోంది. ఇది ఉత్తరాంధ్ర ప్రాంతీయ అసమానతలను తొలగించి, రవాణా, పర్యాటక, పారిశ్రామిక రంగాలలో గుణాత్మక మార్పులు తీసుకురానుంది.

విశాఖ  నుంచి భోగాపురం వెళ్లే ప్రయాణికులకు దూరభారం లేదా సమయభారం అనిపించకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ  ఎన్ హెచ్ఏఐ పలు  రహదారి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నాయి. ప్రస్తుత జాతీయ రహదారి 16 విస్తరణ, విస్తృతమైన సర్వీస్ రోడ్ల నిర్మాణంతో పాటు, విశాఖ పోర్ట్ నుంచి నేరుగా భోగాపురం వరకు 6 వరుసల బీచ్ కారిడార్ కోస్టల్ హైవే నిర్మాణంలో ఉంది. సవరవిల్లి వద్ద నిర్మిస్తున్న ప్రత్యేక ట్రంపెట్ ఇంటర్‌చేంజ్, అనకాపల్లి, ఆనందపురం బైపాస్ రహదారులు సిటీ ట్రాఫిక్ చిక్కులు లేకుండా నేరుగా ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ చేరుకునేందుకే దోహదపడతాయి. ఈ రహదారులన్నీ పూర్తయితే విశాఖ నగర కేంద్రం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 35 నుంచి 40 నిమిషాల్లో సునాయాసంగా చేరుకోవచ్చు. 

ప్రయాణికుల సౌకర్యార్థం భవిష్యత్తులో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించే సమగ్ర ప్రణాళికలను కూడా ప్రభుత్వం రూపొందిస్తోంది. దీనికి తోడు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ ఏసీ బస్సులు, విద్యుత్ ఆధారిత ఫీడర్ బస్సు సేవలు నిరంతరం అందుబాటులో ఉంటే నగరవాసులకు కనెక్టివిటీ పరంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు.  

Bhogapuram International Airport, Visakhapatnam Airport Connectivity,  (Bhogapuram Expressway Beach Corridor, Vizag Metro Rail Project,  North Andhra Infrastructure Development 

By
en-us Political News

  
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో  అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.