ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి.... పోస్ట్ కార్డు ఉద్యమానికి మద్దతు తెలిపిన తెలంగాణ మంత్రి
Publish Date:May 1, 2024
Advertisement
తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించిన తర్వాత మరో డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్య మంత్రి సీనియర్ ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాల్సిందే అని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘు రాం రెడ్డి తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రత్న ఇవ్వాలని చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమానికి పొంగులేటి మద్దతు తెలిపారు. రఘు రాం రెడ్డి, పొంగులేటి కలిసి కార్డులపై సంతకాలు చేసి..పోస్టు చేశారు. అనంతరం పార్టీ నేతలు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, కేత్తినేని హరీష్ లతో కలిసి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లో అనేక సంస్కరణలు తెచ్చారని అన్నారు.ఆ ఫలితంగానే.. కొత్త వారు రాజకీయాల్లో రాణించగలుగుతున్నారు అని ప్రశంసించారు. ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులు గా అనేకమందికి ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, విద్యా, మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, సీనియర్ నాయకురాలు మద్దినేని స్వర్ణ కుమారి, నాయకులు ఎండీ.ముస్తఫా, కొప్పుల చంద్రశేఖర్ రావు, బాణోతు ఉత్తేజ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ప్రదాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం రావడంపై సినీ, రాజకీయ సహా అన్ని రంగాల ప్రముఖులు స్పందిస్తున్నారు. తెలుగు జాతి ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తికి కారణమైన పీవీ లాంటి వాళ్లకు నిజంగా దక్కాల్సిన గౌరవంగా అభివర్ణిస్తున్నారు. అదే టైంలో తెలుగు జాతీ ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్కి కూడా భారత రత్న ఇచ్చి ఉంటే తెలుగు నేల పులకించిపోయేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/bharat-ratna-should-be-given-to-ntr-telangana-minister-who-expressed-support-for-the-postcard-movement-25-174925.html