ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్..ఇద్దరు విదేశీయులు మృతి.!

Publish Date:Oct 31, 2026

Advertisement

బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న సమయంలో అనుకోకుండా కరెంట్ ప్రసరించడంతో ఇద్దరు విదేశీ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ హఠాత్ పరిణామంతో పర్యాటక వర్గాలు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

నగరంలోని ప్రముఖ ఐదు నక్షత్రాల హోటల్‌గా పేరున్న ప్రాంగణంలో ఈ విషాద ఘటన వెలుగు చూసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, మృతి చెందిన వారిని జర్మనీ దేశానికి చెందిన అలెగ్జాండర్ మాక్సిమిలియన్ (57), స్లోవేకియా దేశానికి చెందిన జురాజ్ హోర్వాత్ (45)గా గుర్తించారు. వీరిలో ఒకరు విమానయాన సిబ్బందిగా పనిచేస్తుండగా, మరొకరు ప్రాజెక్ట్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  

 


సాయంత్రం సమయంలో హోటల్ మూడో అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్‌కు ఈ ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. ఆ సమయంలో నీటిలో విద్యుత్ లీకై ఉండటంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలింది. వారిద్దరూ నీటిలోనే స్పృహ కోల్పోయి అపస్మారక స్థితికి చేరుకున్నారు.

ఈ ప్రమాదాన్ని గమనించిన మరో అమెరికన్ పర్యాచకుడు  హోటల్ సిబ్బంది అయిన లైఫ్‌గార్డ్ వారిని రక్షించేందుకు సాహసోపేత ప్రయత్నం చేశారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో వారికి కూడా స్వల్పంగా విద్యుత్ షాక్ తగలడంతో పాటు గాయాలపాలయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అయితే, ఆసుపత్రికి చేరుకునేసరికి విదేశీయులు ఇద్దరూ మృతి చెందారని వైద్యులు ధృవీకరించారు. రక్షణ చర్యల్లో గాయపడిన అమెరికా పర్యాచకుడు మరియు పూల్ అటెండర్ ప్రాణాపాయం నుండి బయటపడి ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. హోటల్ యాజమాన్యం మరియు నిర్వహణ సిబ్బంది చేసిన తీవ్ర నిర్లక్ష్యమే ఈ ప్రాణనష్టానికి కారణమనే కోణంలో ఆరా తీస్తున్నారు. విద్యుత్ వైరింగ్ లోపాలు లేదా నీటి మోటార్ల లీకేజీ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.

దేశ ఆర్థిక రాజధానులలో ఒకైన బెంగళూరులోని అంతర్జాతీయ స్థాయి హోటళ్లలో ఇటువంటి భద్రతా లోపాలు వెలుగుచూడటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్యాటకుల భద్రతపై నీలీనీడలు కమ్ముకోవడంతో, హోటల్స్  రిసార్ట్‌ల యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలను కఠినతరం చేయాలని ప్రజల నుండి డిమాండ్లు వస్తున్నాయి.

 

 

 

[ Bengaluru hotel electrocution, Conrad hotel pool accident, foreign nationals die in India, Bangalore news, swimming pool electric shock ]


 

By
en-us Political News

  
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాప్తాడు పాఠశాలలో రక్తచరిత్ర.!
పేదరికం.. కష్టాలు.. రోజువారీ కూలీ పని! ఒకప్పుడు కనీస అవసరాల కోసం పోరాడిన మహిళ.. నేడు ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు కీలక భాగస్వామిగా ఎదిగారు.
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.