భవానీపూర్ లో మమత రికార్డ్ విజయం.. 

Publish Date:Oct 3, 2021

Advertisement

పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్  అసెంబ్లీ  నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తృణామూల్ కాంగ్రెస్ అభ్యర్థి, ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఘన విజయం సాధించారు.తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ప్రియాంకపై 58,389 ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. భారీ మెజార్టీతో బెంగాల్ లో తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నారు మమతా బెనర్జీ. 2011 శాసన సభ ఎన్నికల్లో వామపక్షాలను మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఓడించింది. 34 ఏళ్ళ వామపక్షాల పాలనకు తెరదించిన ఆ ఎన్నికల్లో ఆమె 49,936 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. తాజాగా భవానీ పూర్ ఉప ఎన్నికలో ఆ రికార్డును ఆమె  తిరగరాశారు. 

2016లో భవానీపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్‌మున్సి భార్య దీపా దాస్‌మున్సీ చేతిలో 25,301 ఓట్ల తేడాతో మమతా బెనర్జీ ఓడిపోయారు. అనంతరం 2011లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం నేత నందిని ముఖర్జీపై 54,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ.. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఆమె నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. 6 నెలల లోపు ఆమె ఎమ్మెల్యే కావాల్సి ఉంది. తాజా విజయంతో  మమత ముఖ్యమంత్రి పదవికి చిక్కులు తొలగిపోయాయి. ముర్షీదాబాద్ జిల్లాలో షంషేర్ గంజ్, జంగీపూర్ శాసన సభ నియోజకవర్గాల్లోనూ టీఎంసీ విజయం సాధించింది. 

తన విజయంపై స్పందించారు మమతా బెనర్జీ. నందిగ్రామ్ కుట్రకు భవానీపూర్ గట్టి సమాధానం చెప్పిందని వ్యాఖ్యానించారు.‘‘దేశంలోని తల్లులకు, సోదరసోదరీమణులకు అందరికీ కృతజ్ణతలు. 2016లో కొన్ని వార్డుల్లో మాకు అనుకూలంగా ఓట్లు వచ్చాయి. భవానీపూర్‌లో 46 శాతం బెంగాల్‌కు చెందని వారే ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు నాకు ఓటు వేశారు. ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి మమ్మత్ని అధికారం నుంచి తప్పించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక కుట్రలకు పాల్పడుతోంది. నా కాలికి కూడా గాయమైంది. మాపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి గర్వంగా ఉంది. ఆరు నెలలలోపు ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల కమిషన్‌కు కృతజ్ణతలు’’ అని మమతా బెనర్జీ అన్నారు.

తన ఓటమిపై బీజేపీ అభ్యర్థి ప్రియాంక స్పందించారు. ఓటమిని హుందాగా స్వీకరిస్తున్నానని అన్నారు. అయితే ఈ ఆటలో తాను ''మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్''గా నిలిచానని చెప్పారు. మమతా బెనర్జీకి గట్టిపట్టు ఉన్న నియోజకవర్గంలో తాను పోటీ చేసి, 25,000కు పైగా ఓట్లు గెలుచుకున్నానని, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచానని అన్నారు. మునుముందు మరింత కష్టపడి పనిచేస్తానని చెప్పారు. 

By
en-us Political News

  
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.