మోడీ బాటలో దీదీ.. పీఎం పీఠంపైనే గురి!

Publish Date:Sep 15, 2021

Advertisement

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. ప్రధానమంత్రి పదవి మీద ఆశలున్నాయి. ఇదేమీ రహస్యం కాదు, ఉండకూడని కోరిక కూడా కాదు. నిజానికి, ఉన్న మెట్టు మీద నుంచి పై మెట్టుకు చేరాలనే కోరిక మమతకు మాత్రమే కాదు, రాజకీయ నాయకులు అందరికీ ఉంటుంది. అయితే అందరి కోరికలు తీరవు. అందుకే రాజకీయ నాయకులలో అసంత్రుప్తులే అధికంగా ఉంటారు. 

మూడు నెలల స్వల్ప వ్యవధిలో గుజరాత్ సహా నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల మార్పు నేపధ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి.. రాజకీయ నాయకుల అసంతృప్తి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజమే ఆయన అన్నట్లుగా రాజకీయ నాయకులు ఎవరూ ఆనందంగా ఉండరు. ఎమ్మెల్యేలకు మంత్రి కావాలనే కోరిక ఉంటుంది, కాలేదనే అసంతృప్తి ఉంటుంది. మంత్రులు అయిన వారికి మంచి శాఖ రావాలనే కోరిక ఉంటుంది. రాలేదనే అసంతృప్తి ఉంటుంది. మంచి శాఖల దక్కిన మంత్రులకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉంటుంది. కాలేదనే అసంతృప్తి ఉంటుంది. ముఖ్యమంత్రులకు కూడా తమ పదవి ఎంతకాలం ఉంటుందో, ఎప్పుడు ఢిల్లీ నుంచి పిలుపు వస్తుందో అన్న  ఆందోళన ఉంటుంద. కాదంటే ఇదిగో ఒక మమతా బెనర్జీ, ఒక నితీష్ కుమార్ లేదా ఇంకొకరిలాగా ప్రధాని కావాలనే కోరిక ఉంటుంది.అసంతృప్తి ఉంటుంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంతటి ఆయనే ప్రధాని పదవి తమ తీరని కోరికగా జీవిత చరిత్రలో రాసుకున్నారు. 

ఇలా రాజకీయాలలో పై మెట్టుకు చేరుకోవాలనే కోరిక ఆదరికీ ఉంటుంది. అందరి విషయం ఎలా ఉన్నా, ప్రస్తుత కాంటెస్ట్ లోమమతా బెనేర్జీకి మాత్రం  పీఎం అయిపోవాలనే కోరిక చాలా బలంగా ఉంది. జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించాలని ఆమె ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితిలో అది సాధ్యమా అంటే, రాజకీయాలలో ఏదైనా సాధ్యమే అని అనుకోవచ్చును. అవసరం అనుకుంటే, మోడీ ముఖ్యమంత్రి పదవి నుంచి ప్రధాని పీఠం చేరుకోలేదా అని సమాధానం కూడా చెప్పుకోవచ్చును. అయితే మమతా, మోడీ  ఒకే స్థాయి నాయకులు అయితే కావచ్చును కానీ, మోడీ వెనక భావజాల (జాతీయ వాదం) బలముంది. దేశం అంతటా విస్తరించిన పార్టీ, సంస్థాగత నిర్మాణం ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కు బెంగాల్ మినహా మరో రాష్ట్రంలో పెద్దగా బలం లేదు. ఉందంటే, ఉందన్నట్లుగా, అక్కడా, ఇక్కడా ఒకటీ ఆరా సీట్లోలో గెలిచినా, జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యాన్మాయం కాలేదు. నిజానికి, ఈరోజు జాతీయ స్థయిలో కాంగ్రెస్ సహా బీజేపీకి ప్రత్యాన్మాయ పార్టీ ఏదీ లేదు.  

ఒక విధంగా చూస్తే కాంగ్రెస్ సహా అన్ని  పార్టీలదీ అదే పరిస్థితి కావడం వల్లనే మమతా బెనర్జీ కానీ, మరొకరు కానీ, ప్రధాని పదవిని ఆశిస్తున్నారు. కాంగ్రెస్ సహా ఎన్డీఎ యేతర పార్టీలకు 2024 ఎన్నికల్లో మెజారిటీలభిస్తే. సంకీర్ణ కల సాకారం అయితే  అప్పుడు మాత్రమే మమత కానీ మరొకరికి కానీ ప్రధాని పదవి దక్కే అవకాశం వస్తుంది. అది ఎంత వరకు సాధ్యం, అప్పుడు ఏమి  జరుగుతుంది? అనేది పక్కన పెడితే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి పోటీచేసి ఓడిపోయిన మమత ముందు ఇప్పుదు మరో సవాలుంది. ఈనెల 30న జరిగే భవానీపుర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగే  ఉప ఎన్నికలో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని నిలుపుకుంటేనే.. ఆమె ఢిల్లీ కలలు సజీవంగా ఉంటాయి. సో, భవానీపూర్ విజయం ఆమె ఢిల్లి యాత్రకు తొలిమెట్టు అవుతుంది.

నిజానికి మమతా బెనర్జీ భవానీపూర్ లో విజయం సాధించడం పెద్ద విషయం కాదు. అసాధ్యం అసలే కాదు. అయితే నందిగ్రామ్ లో అనూహ్యంగా ఓటమి చవిచూసిన నేపధ్యంలో కావచ్చు ‘దెబ్బతిన్న పులి’ని అని చెప్పుకొంటున్న మమత చిన్న పామును అయినా పెద్ద కర్రతో కొట్టాలనే జాగ్రత్తతో అడుగులు వేస్తున్నారు. ఉప ఎన్నికలలో  పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌ కానీ, సీపీఎం అభ్యర్థి శ్రీజీవ్‌ బిశ్వాస్‌ కానీ దీదీకి ఏవిధంగా చూసినా దీటైనవారు ప్రత్యర్ధులు కాదు. బీజేపీ అభ్యర్థి ఇంతవరకు కనీసం కార్పొరేటర్ కూడా గెలవలేదు. అయితే మమత బెనర్జీలోని నిర్భయత్వం, ప్రియాంకలోనూ పుష్కలంగా ఉన్నాయని అంటారు. అదే మే ప్రధాన బలంగా పేర్కొంటారు. మమతా బెనర్జీ సుదీర్ఘ కాలం పాటు కమ్యూస్ట్ కూటమితో పోరాటం చేశారు. భౌతిక దాడులను ఎదుర్కున్నారు. అలాగే, ఇప్పుడు బీజేపీ అభ్యర్ధి ప్రియాంక మమత బెనర్జీ ప్రభుత్వం సాగిస్తున్న హింస కాండను అంతే ధైర్యంగా ఎదుర్కుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండలో బాధితుల పక్షాన ఆమె ఒక లాయరుగా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు వేశారు.అందుకు బెదిరింపులు వస్తున్నా నిర్భయంగా  న్యాయపోరాటం చేస్తున్నారు.

అదలా ఉంటే హస్తం పార్టీ (కాంగ్రెస్) చేతు లెత్తేసింది. పోటీనే చేయడం లేదు. సీపీఎం అభ్యర్థి బిశ్వాస్‌ ఎన్నికలకు కొత్త. 34 ఏళ్లపాటు బెంగాల్‌ను పాలించిన సీపీఎం నేతృత్వంలోని వామపక్ష ఫ్రంట్‌ , కాంగ్రెస్ తో కలిసి పోటీచేసినా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది.ఇక మమత విషయం చెప్పనే అక్కరలేదు. ఆమె ముఖ్యమంత్రిగా బరిలో దిగుతున్నారు. అంతే కాదు, ఆమె భవానీపుర ఆడ బిడ్డ. ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ. ముస్లింల అండతోనే ఆమె  2011, 2016లలో ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. సో, ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలుపు ఖరారైనట్లే అనుకోవచ్చును. అయితే అసలు కథ ఆ తర్వాతనే మొదలవుతుందని అంటున్నారు. ఇప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ విస్తరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వచ్చే సంవత్సరం అరంభంలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతోంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో పోటీకి ఉత్సాహం చూపుతోంది. అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీతో పొత్తుకు మమత ప్రయత్నాలు ప్రారంభించారు. అలాగే ఇతర రాష్ట్రాలలో కూడా ఎన్నికల బరిలో కాలుపెట్టే ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే మమత ఢిల్లీ పీఠం చేరుకుంటారా ... కోల్ కత్తాకే పరిమితం అవుతారా? అనేది తెలియాలంటే, ఇంకొంత కాలం ఆగక తప్పదు. 

By
en-us Political News

  
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.