బసవతారకం ఆస్పత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు.. పాల్గొన్న గవర్నర్‌

Publish Date:Jun 22, 2025

Advertisement

 

హైదరాబాద్‌‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో  సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆస్పత్రి ఛైర్మన్‌ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి దామోదర  మాట్లాడారు. సిల్వర్ జూబ్లీ సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, మేనేజ్‌మెంట్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. క్యాన్సర్‌ వ్యాధితో మరణించిన ఎన్‌టీఆర్‌ సతీమణి బసవతారకం పేరు మీద 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ ఆస్పత్రి.. ఇప్పటివరకు లక్షల మంది రోగులకు వైద్య సేవలు‌ అందించిందని గుర్తుచేశారు.ఎన్టీఆర్ ఐకానిక్ లీడరని, లెజెండరీ యాక్టరని మంత్రి కొనియాడారు. ఈ సందర్బంగా ఆస్పత్రి ఛైర్మన్‌ బాలయ్య మాట్లాడుతు తన తల్లి బసవతారకం కోరిక మేరకు ఈ క్యాన్సర్‌ ఆస్పత్రి స్థాపించటం జరిందని అన్నారు. 

క్యాన్సర్‌ పేషెంట్స్‌కు అండగా ఉండటం కోసం ఎంతో మంది దాతలు ఆస్పత్రికి సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనో లేక లాభాలు పొందాలనే ఆశతోనో ఈ ఆస్పత్రిని ప్రారంభించలేదని ఈ సందర్భంగా బాలకృష్ణ చెప్పారు. తనకు దామోదర రాజ నరసింహ పేరుతో ఒక సినిమా చేయాలని ఉందన్నారు. 110 పడకలతో మొదలై.. నేడు దేశంలోనే అత్యున్నత ఆస్పత్రుల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే 1000 పడకలతో అమరావతిలోనూ క్యాన్సర్‌ వైద్యశాల ఏర్పాటు చేస్తాం. మొదటి దశలో 300 పడకలతో ప్రారంభిస్తాం. మాకు అన్నివిధాలుగా సహకారం అందిస్తోన్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు’’ అని బాలయ్య అన్నారు. 


బాలకృష్ణ దాతృత్వం కలిగిన నటుడు, నేత. పేదలకు మంచి వైద్యం అందించాలనేదే బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి లక్ష్యమని గవర్నర్ జిష్ణుదేవ్ అన్నారు . రానున్న కాలంలోనూ పేదలకు మెరుగైన సేవలు అందించాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. తెలంగాణలో ప్రతి ఏటా 50 నుంచి 55 వేల మంది కొత్తగా క్యాన్సర్‌ బారిన పడుతున్నారని మంత్రి రాజనర్సింహ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొబైల్ క్యాన్సర్‌ స్క్రీనింగ్ యూనిట్లను ప్రారంభించబోతున్నామని మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో క్యాన్సర్‌ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. త్వరలోనే వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, క్యాన్సర్‌ స్క్రీనింగ్, డయాగ్నొస్టిక్‌, డే కేర్ కీమోథెరపి, పాలియేటివ్ కేర్ వంటి సేవలన్నీ ఈ సెంటర్లలో‌ అందిస్తామని అన్నారు.


 

By
en-us Political News

  
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.