Publish Date:May 28, 2026
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు పై గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామాచేశారు. 2023 మేలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కుదిరిన అంతర్గత ఒప్పందం ప్రకారం ఆయన తన పదవి వదులుకున్నారు. బెంగళూరులోని తన అధికారిక నివాసం కావేరి లో గురువారం (మే 27) ఏర్పాటు అల్పాహార విందు సమావేశంలో ఇదే విషయాన్ని తన క్యాబినెట్ సహచరులకు వెల్లడించారు.
ఈ ప్రకటనతో కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా , ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. సిద్ధరామయ్య తన 3 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో ఈ మార్పు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ అల్పాహార సమావేశం అత్యంత భావోద్వేగభరితంగా సాగింది. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన సిద్ధరామయ్య, రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తున్న సమయంలో ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.
ఇంతకాలం ముఖ్యమంత్రిగా నేను చేసిన పనుల పట్ల, ప్రజలకు అందించిన సేవల పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నానన్నారు. హైకమాండ్ ఆదేశాల మేరకే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం.. ముఖ్యంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇచ్చిన సూచనలకు కట్టుబడి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఈ కీలక సమావేశంలో సీనియర్ మంత్రులు ప్రియాంక్ ఖర్గే, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, హెచ్‌కే పాటిల్‌తో పాటు పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిద్ధరామయ్య రాజీనామా నిర్ణయాన్ని స్వాగతిస్తూ డీకే శివకుమార్ ఆయనను ఆత్మీయంగా అలింగనం చేసుకున్నారు. అనంతరం సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ దృశ్యం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఐక్యతను చాటిచెబుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోను కర్ణాటక కాంగ్రెస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఐక్యతే మా బలం! ప్రజాసేవే మా నిరంతర లక్ష్యం అన్న వ్యాఖ్యను జోడించింది. సిద్ధరామయ్య రాజీనామా వార్త బయటకు రాగానే బెంగళూరులోని డీకే శివకుమార్ నివాసం వద్ద ఆయన మద్దతుదారులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున సంబరాలు ప్రారంభించారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ, బాణసంచా కాలుస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/karnataka-cm-siddaramayya-resign-39-221130.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది