Publish Date:Jun 19, 2022
చదువుకునే పిల్లలకు కావలసినవి సమకూర్చనపుడు ప్రభుత్వాలెందుకు? ఇప్పుడు అంతటా వినపడుతోన్న ప్రశ్న ఇదే.
బాసర ట్రిపుల్ఐటిలో అనేక సమస్యల పరిష్కారం గురించి విద్యార్ధులు అనేక రోజులుగా గోడు పెడుతున్నారు. వైస్ ఛాన్సలర్ లేకపోవడం, లైబ్రరీలో పుస్తకాలు లేకపోవడం .. ఇలా అనేకం. వాటికి తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి కావలసినవి సమకూర్చడంలో విఫలమయింది.
తెలంగాణాలో విద్యార్ధిలోకం కూడా పూనుకుంటేనే రాష్ట్రం ఏర్పడిందన్నది టిఆర్ ఎస్ ప్రభుత్వం ఎప్పుడో మర్చిపోయింది. కాకున్నా, విద్యర్దులు కాకమ్మ కోరికలేమీ కోరడం లేదు. మౌలిక సదుపాయాల గురించి తలెత్తిన సమస్యలు పరిష్కరించమనే గోడు పెడుతున్నారు. వాటని అవేమీ పెద్ద అంశాలు కానట్టు, అసలు వారి గోలను పెద్దగా పట్టించుకోన వసరం లేనట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అందుకే తీవ్రస్థాయిలో విద్యార్ధులు మండి పడి భారీ నినాదాలతో ముఖ్యమంత్రికి, విద్యా శాఖ మంత్రికి బాసర ట్రిపుల్ ఐటిలో పరిస్థితులు బాగా తెలిసేలా బాగా వినిపించేలా ఉద్యమి స్తున్నారు. కానీ విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డిగారికి వారి పరిస్థితులు, సమస్యలు చాలా చిన్నవిగా కనపడటమే విడ్డూరం.
ముఖ్యమంత్రితో సంప్రదించి వెంటనే వారి సమస్యలు పరిష్కరించాల్సిందిబోయి అవి చిన్న సమస్యలే, వాటి గురించి ఆందోళనకు దిగడం మంచిది కాదు, ప్రభుత్వం ప్రతిష్టకు భంగం కలిగేలా చేయరాదని మంత్రిగారు ఒక లేఖలో విద్యార్ధులను కోరడంలో అర్ధ మేమిటో మంత్రి గారే సెలవియ్యాలి. అంతే కాకుండా బాసర ట్రిపుల్ఐటీ అన్న విషయమే విద్యామంత్రి సబిత గారికి తెలియదు. అందుకే కాబోలు బాసర ఐఐటి అని ప్రస్తావించారు. బాసరలో వున్నది ఐఐటి కాదు త్రిబుల్ ఐటి! ఈ విషయాన్ని కూడా విస్మరించారు. మొన్నటివరకూ ఎంతో ప్రతిష్టాత్మకమయినది,
ప్రభుత్వానికి రాష్ట్రానికి ఎంతో పేరు తెస్తున్న సంస్థ అంటూ పొగిడినవారే విద్యా ర్ధుల మౌలిక వస తుల గురించి పట్టించుకొనకుండా కేవలం రాజకీయ ప్రసంగాలతో మభ్యపెట్టే ప్రయత్నాలు చేయడంలో అర్ధమే మిటని విద్యార్ధి లోకం ప్రశ్నిస్తోంది. ఐఐఐటికి శాశ్వత వైస్ ఛాన్సలర్‌ను నియమించడానికి మీనమేషాలు లెక్కించడాన్ని రాజకీయ దురుద్దేశం గానే తీసుకోవాలా? ఎందుకు ఇంత నిర్లక్ష్యమని అడుగుతున్నారు. తల్లిలా తాను చెబుతున్న మాటలు విద్యా ర్ధులు చెవికెక్కిం చుకోని ఉద్యమించడం ఆపేయాలని అడుగుతున్న మంత్రి మరి ఇన్ని రోజులు తన బిడ్డలవంటి విద్యార్ధుల గోడు వినడానికి సమయం ఇవ్వకపోవడమేమిటి? విద్యార్ధుల భవిష్యత్తుతో ఆడుకున్న ప్రభుత్వాలు కలకాలం నిలవవు అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఇప్పటికైనా తెలంగాణా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కూడా ఈ విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటారనే ఆశిద్దాం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/basara-tripleit-not-iit-25-137973.html
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.