రాహుల్ కుటుంబంపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ అనుచిత వ్యాఖ్యలు.!

Publish Date:Jul 29, 2026

Advertisement

 రాజకీయాల్లో  విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే. అయితే అవి హద్దులు దాటితేనే సమస్య. ఇటీవలి కాలంలో రాజకీయ విమర్శలు అన్ని హద్దులూ దాటేసి, దూషణలు, బెదరింపులు, అనుచిత, అసభ్య వ్యాఖ్యలూ ఎక్కువైపోయాయి.  తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని   యశ్‌పాల్ సువర్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.   ఆయన వ్యాఖ్యలపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.     

విషయమేంటంటే..  యశ్‌పాల్ సువర్ణ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనను  ప్రస్తావించారు. ఆ చారిత్రాత్మక ఘటనను గుర్తుచేస్తూ..  కాంగ్రెస్ పార్టీ,  ఆ పార్టీ నాయకత్వం   తమ వైఖరిని మార్చుకోకుండా ఇలాగే వ్యవహరిస్తూ పోతే, రాహుల్ గాంధీ కుటుంబానికి కూడా 1992లో బాబ్రీ మసీదుకు పట్టిన గతే పడుతుందని వ్యాఖ్యానించారు. ఈ తరహా తీవ్రమైన పదజాలం రాజకీయాల్లో ఎప్పుడూ చూడని రీతిలో ఉండటంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఎమ్మెల్యే మాట్లాడిన ఈ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో  క్షణాల్లోనే సోషల్ మీడియాలో తెగ  వైరల్ అయింది. నెటిజన్లు, రాజకీయ పరిశీలకులూ, సామాన్య జనం కూడా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, బేషరతు క్షమాపణ డిమాండ్ చేస్తున్నారు.  విద్వేషపూరితంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు.  బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే నోటి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యతరకరమంటూ కాంగ్రెస్ ఇటువంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని పేర్కొంది. 

ఈ నేపథ్యంలో ఉడుపి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అశోక్ కుమార్ కొడవూర్   స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణపై  ఫిర్యాదు చేశారు. ప్రజల్లో వైషమ్యాలను, విద్వేషాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారని, ఒక ప్రముఖ నాయకుడి కుటుంబంపై భయాందోళనలు రేకెత్తించే రీతిలో మాట్లాడారనీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.   ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు యశ్‌పాల్ సువర్ణపై బీఎన్ఎస్  సెక్షన్ల కింద  ఎఫ్‌ఐఆర్  నమోదు చేశారు.  

Yashpal Suvarna, Rahul Gandhi, Babri Masjid comments, Karnataka BJP MLA, Udupi Congress FIR, BNS sections case

By
en-us Political News

  
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.