జైలుకెళతారా.. సీఎంగా ఉంటారా! కేసీఆర్ పై క్లారిటీ తప్పిన సంజయ్  

Publish Date:Jan 6, 2021

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ సెంటర్ గా మారిపోయారు.. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంగనర్ ఎంపీ బండి సంజయ్.  ఆవేశపూరిత ప్రసంగాలు, పంచ్ డైలాగులతో ఆయన రాజకీయ కాక పుట్టిస్తున్నారు.  పార్టీ పగ్గాలు చేపట్టిన కొన్ని నెలల్లోనే అద్భుత ఫలితాలు సాధించారు బండి సంజయ్. సీఎం కేసీఆర్ సొంత గడ్డ సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలో పార్టీకి సంచలన విజయం సాధించి పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ అధికార పార్టీకి చెమటలు పట్టించారు. అందుకే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బండి వంద స్పీడులో పరుగులు పెడుతోంది. అయితే బండి పరుగులు పెట్టడంతో పాటు కొంత గందరగోళంలో పయనిస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. సంజయ్  చేస్తున్న ప్రసంగాలు, ప్రకటనల్లో  క్లారిటీ మిస్ అవుతుండటమే ఇందుకు కారణమవుతోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి టార్గెట్ గానే దూకుడుగా వెళుతున్నారు బండి సంజయ్. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ..  వ్యక్తిగతంగానూ విమర్శలు చేస్తున్నారు. వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని పదేపదే ప్రకటిస్తున్నారు బండి సంజయ్.  టీఆర్ఎస్ సర్కార్ త్వరలోనే కూలిపోతుందని కూడా చెబుతున్నారు. కేసీఆర్ అవినీతి చిట్టా మొత్తం కేంద్రం దగ్గర ఉందన్నారు బండి. సీఎం పదవి లేకున్నా సరేకానీ.. తనను, తన కుటుంబాన్ని జైలుకు పంపవద్దని ఢిల్లీ వచ్చి సీఎం కేసీఆర్‌ పొర్లు దండాలు పెట్టుకున్నారని ఆరోపించారు.. పొర్లు దండాలు పెట్టినా ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబాన్ని క్షమించే ప్రసక్తే లేదని సంజయ్‌ స్పష్టం చేశారు. అంతేకాదు కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలన్నింటి పై కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలను, అవినీతిని బయటపెడతామని హెచ్చరించారు. 
 

కేసీఆర్ కు జైలుకు వెళతారని చెప్పడమే కాదు.. 30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పారు బండి సంజయ్. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందన్నారు. తాము తల్చుకుంటే కేసీఆర్ సర్కార్  ఏ క్షణమైనా కూలిపోతుందన్నారు. బండి సంజయ్ పదేపదే కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ అధ్యక్షుడు చెబుతుండటంతో ... తెలంగాణలో కీలక మార్పులు ఉంటాయనే చర్చ కూడా జరుగుతోంది. కేసీఆర్ జైలుకు వెళితే కేటీఆర్ సీఎం అవుతారని కూడా మాట్లాడుకుంటున్నారు. కేంద్రం కేసులు పెట్టకముందే కేసీఆరే సీఎం కుర్చి నుంచి దిగి.. తనయుడు  కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేస్తారన్న చర్చ కూడా కొన్ని వర్గాల్లో జరుగుతోంది.  కాని కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని కొన్ని రోజులుగా బల్లగుద్ది మరీ చెప్పిన బండి సంజయ్ సడెన్ గా మాట మార్చారు. ఇదే ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.  

మంగళవారం వరంగల్ లో పర్యటించిన బండి సంజయ్.. తెలంగాణకు మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆరే కొన‌సాగుతార‌ని చెప్పారు.  కేటీఆర్‌ను సీఎం చేసే ఆలోచ‌న కేసీఆర్‌కు లేద‌న్నారు. తెలంగాణ ప్రభుత్వంలో మార్పులు కూడా ఉండకపోవచ్చన్నారు. బండి చేసిన ఈ వ్యాఖ్యల వల్లే ఆయన గమనం గందరగోళంగా ఉందనే చర్చకు కారణమైంది. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చెబుతున్న సంజయ్.. ఇప్పుడు కేసీఆరే మరో మూడేళ్లు సీఎంగా ఉంటారని ఎలా చెబుతారని కొందరు ప్రశ్నిస్తున్నారు. సంజయ్ చెప్పినట్లు కేసీఆర్ జైలుకు పోతే.. ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కేసీఆరే మూడేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారంటే.. మరో మూడేళ్ల వరకు కేసీఆర్ జైలుకు వెళ్లడని సంజయ్ క్లారిటీ ఇస్తున్నారా అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ జైలుకు వెళతారో.. మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారో బండి సంజయ్  క్లారిటీ ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో  దోస్తీ చేస్తూ .. రాజకీయ ప్రయోజనాల కోసమే  టీఆర్ఎస్, బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ముసుగు వీడి అసలు నిజాలు జనాలకు చెబితే మంచిదని సూచిస్తున్నారు.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.