ధనవంతులైనా సరే.. ఈ అలవాట్లు మానకపోతే కటిక  పేదవాడిగా మారిపోతాడట.!

Publish Date:Dec 18, 2023

Advertisement

ధనవంతులు, పేదవారు అనే వర్గాలు  ఎప్పుడూ తారుమారవుతూ ఉంటాయి. ఈ రోజు పేదవాడిగా ఉన్నవాడు రేపు ధనవంతుడు కావచ్చు. అలాగే ఈ రోజు ధనవంతుడిగా ఉన్నవాడు రేపు పేదవాడిగా కూడా మారవచ్చు. చిన్న ఉద్యోగాలలో చేరి, వ్యాపారాలు మొదలు పెట్టి ఈ రోజు అపర కుభేరులుగా మారినవారున్నారు. అలాగే ఒకప్పుడు భవంతులలో నివసించి అన్నీ పోగొట్టుకుని పేదలుగా నివసిస్తున్నవారు కూడా ఉన్నారు. అయితే మనిషి తన దగ్గరున్న డబ్బును నిలుపుకోవడం అనేది అతని వ్యక్తిత్వం, అతని అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. ఆచార్య చాణక్యుడి ప్రకారం కింది అలవాట్లున్నవారు ఎంత ధనవంతులైనా సరే పేదవాడిగా మారడం ఖాయమంటున్నారు.

 అపరిశుభ్రంగా ఉండేవారు..

అపరిశుభ్రంగా మురికి బట్టలతోనూ, ఇల్లంచా అస్తవ్యస్తంగానూ ఉండే వారు ఎప్పటికీ పేదరికంతోనే జీవిస్తారట. దీనికి కారణం డబ్బున్నా బయటకు తీయకపోవడం, దాన్ని అలాగే దాచడం, తనూ సుఖపడక, డబ్బును సరైన అవసరాలకు వినియోగించక పేదవాడిగానే ఉండిపోవడం.

చెడుగా మాట్లాడేవారు

మాటతీరు మంచిగా లేని వ్యక్తులు ఎప్పటికీ డబ్బును  నిలుపుకోలేరు. అబద్దాలు చెప్పడం, చెడుగా మాట్లాడటం చేస్తుంటే ఆ వ్యక్తి ఆర్థిక స్థోమత ఎప్పటికి మెరుగుపడదు. లక్ష్మీదేవి కూడా ఇలాంటి వ్యక్తుల వద్ద ఉండటానికి ఇష్టపడదట.

సూర్యాస్తమయం తరువాత నిద్రపోవడం

చాలామంది సాయంత్రం సూర్యుడు అస్తమించగానే నిద్రపోతుంటారు. అయితే ఈ సమయాన్ని లక్ష్మీదేవికి పవిత్రమైనదిగా భావిస్తారు. అలాంటి సమయంలో నిద్రపోవడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదని అంటారు.

సోమరితనం

సోమరితనం ఉన్నవారు ఏ పనులను సరిగా చేయరు. పనులను వాయిదా వేడయం, ఏవో ఒక సాకులు చెప్పడం,  తప్పించుకోవడం చేస్తుంటారు. ఇలాంటి వ్యక్తులు జీవితంలో ఎదగలేరు. తమ దగ్గరున్న డబ్బును మెల్లిగా కరిగించి చివరికి పేదవాడిగా మారిపోతాడు. తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఉంది అని డాంబికాలు పలికేది ఇలాంటి వారే. ఇలాంటి వారు తమ ముందు తరాలను పేదరికంలోకి చాలా సులువుగా నెట్టేస్తారు.

ఖర్చుల విషయంలో జాగ్రత్త లేకుంటే..

డబ్బు సంపాదించడం  ఒక కళ. అయితే ఆ డబ్బును ఎలా ఖర్చుపెట్టాలనేది కూడా కళే. ఆదాయానికి అనుగుణంగా డబ్బు ఖర్చు పెట్టడం, పొదుపుకు కొంత కేటాయించడం, ఎమర్జెన్సీ ఫండ్స్ అరెంజ్ చేసుకోవడం వంటి మనీ మేనేజ్మెంట్ ప్లాన్స్ లేకుండా పేదవాడిగానే ఉండిపోతాడు.

                                       *నిశ్శబ్ద.
 

By
en-us Political News

  
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు...
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది..
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల...
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు...
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో..
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం ..
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా..
ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు విఫలమవుతున్నాయి? నమ్మకం, అవగాహన, స్వేచ్ఛ ప్రాముఖ్యత ఏమిటి? బ్రేకప్‌ల కారణాలు మరియు పరిష్కారాలపై సి. కళ్యాణ్ చెప్పిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి...
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు..
భార్యాభర్తల సంబంధాలలో ప్రేమ, నమ్మకం , సాన్నిహిత్యం చాలా అవసరం. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా కేవలం ఆప్యాయతను వ్యక్తపరచడం వంటివి ఏ వివాహ బంధాన్నైనా బలపరుస్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.