National Doctors Day..  డాక్టర్లు తప్పకుండా పాటించే ఆరోగ్య అలవాట్లు ఇవి!

Publish Date:Jul 1, 2026

Advertisement


ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు వాడమని చెబుతారు.  అయితే.. తన దగ్గరకు వచ్చిన రోగులకు జాగ్రత్తలు  చెప్పడానికి ముందు వైద్యులు కూడా చాలా జాగ్రత్తలు, మంచి అలవాట్లు ఫాలో అవ్వాలి. అలా అయినప్పుడే వారి మానసిక, శారీరక ఆరోగ్యం దృఢంగా ఉంటుంది. మంచి ఆరోగ్యం అనేది తొందరగా లభించేది కాదు.. అది రోజువారీ మంచి అలవాట్ల ద్వారా నిదానంగా సొంతమవుతుంది.  వైద్యులు తమ రోజువారీ జీవితంలో పాటించే కొన్ని ఆరోగ్య అలవాట్లు ఉన్నాయి.  వీటిని అందరూ పాటించవచ్చు.  ఇందులో వచ్చే నష్టం ఏమీ ఉండదు. దీని వల్ల వైద్యుల లాగే ఓర్పు, సహనం వంటివి పెరుగుతాయి. ప్రతి ఏడాది డాక్టర్స్ దినోత్సవాన్ని జూలై 1 వ తేదీన జరుపుకుంటారు.  ఈ సందర్బంగా వైద్యులు పాటించే కొన్ని ఆరోగ్య అలవాట్ల గురించి తెలుసుకుంటే..

నిద్ర..

ప్రతిఒక్కరికి కనీసం ఎనిమిది గంటల నాణ్యమైన నిద్ర అవసరం. "సమయానికి నిద్రపోవడం ద్వారా శరీరానికి, మనసుకు తగినంత విశ్రాంతి లభిస్తుంది.  దీని వల్ల ఒత్తిడి  తగ్గుతుంది,  రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.  మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతారు.  

బ్లూ లైట్..

నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి పడుకోవడానికి ఒక గంట ముందు ఫోన్‌లు, కంప్యూటర్‌లు , ఇతర ఎలక్ట్రానిక్స్ స్క్రీన్‌ల నుండి వెలువడే నీలి కాంతిని నివారించాలి.

ఆహారం..

 కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్ వనరులు, ఆరోగ్యకరమైన కొవ్వులు , అధిక ఫైబర్ ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా తక్కువ కార్బోహైడ్రేట్లు, అధిక ప్రోటీన్ల ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తగ్గించడం ద్వారా రోజంతా స్థిరమైన శక్తిని నిలుపుకోవడానికి ఇది సహాయపడుతుంది.

డిన్నర్ టైం..

రాత్రి భోజనాన్ని త్వరగా తినడం ఎంతో మంచిది.  రాత్రి 7 గంటల లోపు భోజనం ముగించడం వల్ల శరీరానికి రాత్రంతా విశ్రాంతి లభిస్తుంది. దీని వల్ల  జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ప్రాసెస్ ఆహారాలు..

ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెరతో నిండిన డెజర్ట్‌ల విషయంలో చాలా మంది కంట్రోల్ గా ఉండలేరు. కానీ వాటిని నివారించడానికి  తీపి తినాలని అనిపించినప్పుడు, చక్కెరతో నిండిన ప్రాసెస్ చేసిన డెజర్ట్‌ల వైపు వెళ్లకుండా ఆయా కాలాల్లో లభించే తాజా పండ్లు తినడం, ఖర్జూరం,  డ్రై ప్రూట్స్ వంటి తినడం వల్ల తీపి తిన్న ఫీల్ వస్తుంది. ఆరోగ్యానికి పోషకాలు కూడా అందుతాయి.

భోజనం ట్రిక్..

భోజనం తినే ముందు  కూరగాయలతో తయారు చేసిన సలాడ్‌ తినడం వల్ల, ఎక్కువ ఆహారం తినకుండానే కడుపు నిండుతుంది.  దీనివల్ల ఆహారం అతిగా తినడం నివారించవచ్చు.  భోజనానికి కనీసం 20 నిమిషాల ముందు సలాడ్‌ తినడం చాలా మంచిది.

చురుగ్గా ఉండాలి..

లైఫ్ స్టైల్ చురుగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.  క్రమం తప్పకుండా కార్డియోవాస్కులర్ వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.  అలాగే వ్యాయామం వల్ల ఓర్పు కూడా పెరుగుతుంది.  

స్ట్రెంత్ ట్రైనింగ్..

క్రమం తప్పకుండా శరీరాన్ని బలంగా మార్చుకోవడం చాలా ముఖ్యం. ఫుషప్స్,  బైసెప్స్ తో పాటు ఇతర స్ట్రెంట వ్యాయామాలు కూడా శరీరం బలంగా మారడానికి సహాయపడుతుంది.  ఇవి కండరాలు బలంగా మారడానికి సహాయపడతాయి.

మానసిక ఆరోగ్యం..

వైద్యులకు మానసిక ఆరోగ్యం ఎంతో అవసరం. శారీరక దృఢత్వం మానసిక ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. ప్రతిరోజూ యోగా, ధ్యానం,యోగాసనాలు, శ్వాస వ్యాయామాలు, ప్రాణాయామం వంటివి చేస్తారు.  

రిలేషన్స్..

వైద్యులు కేవలం సమాజం కోసం మాత్రమే కాదు.. తమ కోసం తాము కూడా బ్రతకాలి.  వారికి ఒక కుటుంబం ఉంటుంది. కుటుంబంతో సమయం గడపడం,  సంబంధాలను మెరుగ్గా ఉంచుకోవడం వంటివి వారు వృత్తిలో రాణించడానికి సహాయపడతాయి. కనీసం రోజుకు గంట సేపు అయినా కుటుంబంతో సంతోషంగా గడపడం చాలా ముఖ్యం.

పైన చెప్పుకున్నవన్న ఎంతో మందివైద్యులు తప్పకుండా తమ జీవితంలో రోజూ పాటించే అలవాట్లు. ఇవి సాధారణ వ్యక్తులు కూడా పాటించవచ్చు. దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు, కుటుంబ బంధాలు కూడా బలంగా ఉంటాయి. అప్పుడే వారు వృత్తికి సరైన న్యాయం చేయగలరు.

                                      *రూపశ్రీ.

By
en-us Political News

  
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది..
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల...
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు...
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో..
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం ..
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా..
ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు విఫలమవుతున్నాయి? నమ్మకం, అవగాహన, స్వేచ్ఛ ప్రాముఖ్యత ఏమిటి? బ్రేకప్‌ల కారణాలు మరియు పరిష్కారాలపై సి. కళ్యాణ్ చెప్పిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి...
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు..
భార్యాభర్తల సంబంధాలలో ప్రేమ, నమ్మకం , సాన్నిహిత్యం చాలా అవసరం. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా కేవలం ఆప్యాయతను వ్యక్తపరచడం వంటివి ఏ వివాహ బంధాన్నైనా బలపరుస్తాయి.
ఎండలు భగభగ మండుతూ ప్రజలను బాగా ఇబ్బంది పెట్టిన తర్వాత రుతుపవనాలు వస్తాయి.  ఈ రుతుపవనాలు ప్రజలకు ఎంతో ఊరట ఇస్తాయి. చాలా ఎండల తర్వాత వర్షం కురవడం,  వాతావరణం చల్లబడటం..
తల్లిదండ్రులు తమ పిల్లలను చక్కగా పెంచడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు, కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులకు ఉండే  కొన్ని అలవాట్లు తెలియకుండానే పిల్లల మీద ప్రబావం చూపిస్తాయి.ఇంకొక విచిత్రమైన విషయం...
పిల్లలను పెంచడం అంటే కేవలం వారికి మంచి విద్య,  ఆహారం,  కనీస అవసరాలు  అందించడం కాదు. వారికి అవసరమైన జీవిత నైపుణ్యాలు, విలువలను కూడా నేర్పించాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. తరచుగా చాలామంది తల్లిదండ్రులు...
సినిమాలు, సోషల్ మీడియా , సొసైటీ  తరచుగా వివాహాన్ని ఒక అందమైన చిత్రంగా చూపిస్తాయి. కానీ వాస్తవం అంతకంటే చాలా సంక్లిష్టమైనది. వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.