బాబులు దారి తప్పారు.. గుజరాత్ దినపత్రిక సంచలన కథనం

Publish Date:Apr 17, 2023

Advertisement

ఐఎఎస్,   అధికారులు ప్రభుత్వ నిర్ణయాలను, విధానాలనూ ప్రభావితం చేస్తారు. అంతేనా ప్రభుత్వ నిర్ణయాలు అమలు కావాలన్నా, కాకుండా ఉండాలన్నా వారిపైనా ఆధారపడి ఉంది. రాజకీయాలలో భవిష్యత్ పరిణామాలు ఏమిటి, ముందు ముందు ఏం జరగబోతోంది అన్నీ పరిశీలకుల కంటే, విశ్లేషకుల కంటే ముందుగానే పసిగట్టేస్థారు. అధికారంలో ఉన్న సర్కార్ మరో సారి గద్దెనెక్కుతుందా? విపక్షానికే పరిమితమౌతుందా.. ప్రజల నాడి ఎలా ఉంది ఇవన్నీ వారికి కరతామలకం. అటువంటి అధికారులు అడ్డదారులు తొక్కాలని నిర్ణయించుకుంటే.. వారిని ఆపడం కాదు కదా అడ్డదారుల్లో వెళుతున్నారని పసిగట్టడం రాజకీయ నేతలకు, దర్యాప్తు సంస్థలకూ అంత తేలిక కాదు.

బాబూస్ పైనా మంత్రులు, ముఖ్యమంత్రులు అధికంగా ఆధారపడతారు. కీలక పదవులలో తమకు అనుకూలురను నియమించుకోవాలని చూస్తారు. ఎందుకంటే.. ఆపత్కాలంలో తమ మేధా సంపత్తితో తమను చిక్కుల నుంచి బైటపడేయగలుగుతారన్న నమ్మకం. ఇక అటువంటి బ్యూరోక్రట్లు రాజకీయ క్షేతంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో ఇట్టే పట్టేస్తారు.  రాజకీయలతో అసలు ఏ సంబంధం లేనట్లుండే అధికారులు రాజకీయ పరదాల చాటున ఏం జరుగుతుందో కళ్ళు మూసుకుని చూసేయగలరు.  అందుకు తగ్గట్టుగా తమను తాము ట్యూన్ చేసుకుంటారు. స్ట్రాటజీలు మార్చుకుంటారు. తమ వరకూ రాదనుకుంటే.. అడ్డగోలు సంపాదనలకూ వెనుకాడరు. అధికార పార్టీ ప్రాపకం కోసం రూల్స్ ను అతిక్రమించేయగలరు, లేదా వాటిని అవసరానికి అనుగుణంగా మార్చేయగలరు. రాజకీయ నాయకులతో బాబూస్ కుమ్మక్కుతో అడ్డగోలుగా ఆస్తులు పెంచేసుకున్న ఐఏఎస్ ల వ్యవహారం ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఆ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వ్యాపారాలు, ఆస్తుల వ్యవహారంపై  విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన పలువురు ఐఏఎస్, అధికారుల పెట్టుబడులపై ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖ దినపత్రిక దివ్య భాస్కర్ ప్రచురించిన కథనం రాష్ట్రంలో దుమారం రేపుతోంది. ఐఏఎస్, ఐపీఎస్ లు స్టాక్ మార్కెట్ లో, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల విలువ 7500 కోట్ల రూపాయలకు పైమాటేనన్నది దివ్యభాస్కర్ దినపత్రిక కథనం. రాష్ట్రంలోని స్టాక్ మార్కెట్ బ్రోకర్ల నుంచి సేకరించిన డేటా ఆధారంగా దివ్యభాస్కర్ అధికారుల బండారాన్ని బయటపెట్టింది.

వీరికి పలువురు మంత్రులు ఎమ్మెల్యేల అండ దండిగా ఉందని కూడా ఆ పత్రిక కథనం పేర్కొంది. రాష్ట్రంలోని 90శాతం మంది ఐఏఎస్, ఐపీఎస్ లు తమతమ బంధువులు, స్నేహితుల పేరు మీద ఓపెట్ చేసిన డీమ్యాట్ ఖాతాల ద్వారా షేర్లలో భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేసినట్లు ఆ పత్రిక కథనం పేర్కొంది.  ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయడానికి వారు పాల్పడిన అవినీతే కారణమన్నది ఆ పత్రిక కథనం సారాంశం.  అయినా ప్రభుత్వంతో, ప్రభుత్వంలోని పెద్దలతో, అధికార పార్టీ కీలక వ్యక్తులతో కుమ్మక్కైతే... దోపిడీకి రాచబాట పరిచినట్లేనని పరిశీలకులు అంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్, రియల్ వ్యాపారంలో బాబుల పెట్టుబడులకు సంబంధించిన వివరాలు వెల్లడైనా చర్యలేవని ప్రశ్నిస్తున్నారు. 

దివ్యభాస్కర్ కథనం ఒక్క గుజరాత్ లోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వరకూ మాత్రమే తన కథనాన్ని పరిమితం చేసింది కానీ.. దేశంలోని పలు రాష్ట్రాలలో ఇదే పరిస్థితి నెలకొని ఉందని పరిశీలకులు సోదాహరణంగా వివరిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలోని పరిస్థితి అన్ని హద్దులనూ దాటేసిందని అంటున్నారు. ఏపీలో ఐఏఎస్, అధికారులు తరచుగా కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితికీ, కోర్టుల చేత అక్షింతలు వేయించుకోవడానికీ ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయాలను ఏవో ప్రయోజనాలను ఆశించి గుడ్డిగా అంగీకరించి అమలు చేసేయడమేనని అంటున్నారు. ఇలా కుమ్మక్కయ్యే క్రమంలో దండిగా ఆర్థిక లబ్ధి కూడా పొందుతున్నారన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో జగన్ రెడ్డి   ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తరువాత.. సీఎస్, డీజీపీలతో సహా అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కోర్టుబోనెక్కిన విషయాన్ని,  చీవాట్లు తిన్న విషయాన్నీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.    

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.