బాబు రావాలి, ఏలాలి... బాలవాక్కు బ్రహ్మవాక్కేనా?!
Publish Date:Sep 10, 2022
Advertisement
పిల్లలు భగవత్ స్వరూపులు. వారు ఏది మాట్లాడినా ముద్దు ముద్దుగా బాగుంటుంది. అంతే నిజం కూడా ఉంటుంది. ఎవరెన్ని అనుకున్నా, ఎన్ని అడ్డంకులు పెట్టినా బాలవాక్కు బ్రహ్మవాక్కుగా పనిచేస్తుందన్న విశ్వాసం జనంలో ఉంది. ఏపీలో చంద్రబాబునాయుడు అధికారంలోకి రావాలని, తెలుగు దేశం మళ్లీ రాజ్యం చేయాలని ఓ చిన్నారి తన ఆకాంక్షను వెలిబుచ్చాడు. చిన్నపిల్లలు ఏం మాట్లాడినా అది జరిగి తీరుతుందన్న విశ్వాసం చాలా కాలంగా జనంలో ఉంది. చాలా సందర్భాల్లో చిన్నారుల వాక్కు బ్రహ్మవాక్కుగా మారి జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయంటారు. ఛాందస్తమనో, మూఢనమ్మకం అని కొట్టి పారేసేవారు కూడా ఉంటారు. ఈ పిల్లవాడు ఎవరోగాని తన మనసులో మాటనే బయటికి అన్నాడు. తన తల్లిదండ్రులో, చుట్టుపక్కల వారో తెలుగుదేశం అధికారంలోకి రావాలని, ఏపి మళ్లీ అభి వృద్ధి పథంలో వేగంగా ముందడుగు వేయాలని అనుకుంటుంటే ఆ బాలుడు వినే ఉంటాడు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగాలు టీవీలలో చూసే ఉంటాడు. ఆ బాలుడికి రాజకీయ అవగాహన లేకపోవచ్చు. కానీ ఊహకందిన మేరకు పిల్లవాడు మనసులో స్థిరంగా ఏర్పడిన అభిప్రాయాన్ని అలా చెప్పాడు. తెలుగు దేశం నేత నారా లోకేష్ చెప్పినంత గట్టిగా ఈ పిల్లవాడు చెప్పడం గమనార్హం. ఎందుకంటే పిల్ల వాడు చిన్న వయసులోనే ఇంతటి నమ్మకాన్ని ప్రచారం చేశాడు. అంబ పలికె, జగదాంబ పలికే, పిల్లాడు పలికె .. ఇక ఎన్నికలే ఆలస్యం. ఆ బాలుడి ప్రసంగం వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నది.
http://www.teluguone.com/news/content/babu-should-come-tp-power-and-rule-ap-says-kid-25-143505.html





