సీమలో బాబు, ఉత్తరాంధ్రలో పవన్.. అవే ఆంక్షలు, అదే టెన్షన్!

Publish Date:Aug 10, 2023

Advertisement

ఏపీలో వైసీపీ పరిస్థితి చూస్తుంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉందని స్పష్టంగా తెలిసిపోతుంది. ప్రతిపక్షాలు గుక్క తిప్పుకోకుండా మూకుమ్మడిగా దాడి చేస్తుంటే ఎదుర్కోవడం ఎలాగో తెలియక ప్రభుత్వ సంస్థలను అడ్డం పెట్టుకొని వారిని ఎదుర్కొనే ఎత్తులు వేస్తున్నది. ప్రతిపక్షాలు లేవనెత్తే ఒక్కో అంశం ప్రభుత్వానికి ఊహించని రీతిలో డ్యామేజ్ చేస్తుంటే సమాధానమే లేక మీరే మాకు దిక్కని పోలీసులను ఉసిగొల్పుతున్నట్లు అర్ధం అవుతున్నది. నిన్నటి వరకూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ప్రాజెక్టుల సందర్శన జరిగింది. సీమలో మొదలైన ఈ యాత్ర గోదావరి జిల్లాలలో ముగిసింది. అయితే  మొత్తం చంద్రబాబు యాత్రలో అడుగడుగునా ఆంక్షలే కనిపించాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే ఏ స్థాయిలో ఘర్షణలు జరిగాయో తెలిసిందే. ఒకవైపు పోలీసులు ఆంక్షలు విధించడం.. మరోవైపు వైసీపీ కార్యకర్తలను దాడులకు దిగడం షరా మామూలుగా మారిపోయింది.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా రాయలసీమ జిల్లాలో పర్యటిస్తుండగా పోలీసులు  అడుగడుగునా ఆంక్షలు విధించారు. ఎక్కడిక్కడ టీడీపీ కార్యకర్తలను రాకుండా ఎన్ని చేయాలో అన్నీ చేశారు. కానీ, పోలీసులు, వైసీపీ చర్యలేవీ ఫలించలేదు. సునామీలా దూసుకొచ్చిన  తెలుగుదేశంకార్యకర్తల ముందు ఆ పప్పులేవీ ఉడకలేదు. దీంతో ఎలాగైనా ఈ యాత్రను భగ్నం చేయాలని  పుంగనూరులో రౌడీయిజానికి దిగారు. అయినా వెనుదిరగని టీడీపీ కార్యకర్తలు దీటుగా తిప్పికొట్టారు. మొత్తంగా పుంగనూరు ఘర్షణ అనంతరం నెల్లూరు, ప్రకాశం మీదుగా వెళ్లి గోదావరి జిల్లాలలో ఈ యాత్ర ముగిసింది. చివరికి పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా హైటెన్షన్ వాతావరణం కనిపించింది. చంద్రబాబు వెళ్లే గంట ముందు వరకూ కూడా ప్రభుత్వం నుండి అనుమతి రాలేదు. ఏది ఏమైనా పోలవరం వెళ్లాల్సిందేనని చంద్రబాబు తెగింపుతో ఉండడంతో చివరికి అనుమతి ఇవ్వక తప్పలేదు.

కాగా, చంద్రబాబు సీమ యాత్రలాగానే ఇప్పుడు ఉత్తరాంధ్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా పోలీసులు సవాలక్ష కొర్రీలు పెట్టారు. పవన్ మూడవ విడత వారాహీ యాత్ర గురువారం (ఆగస్టు 10) విశాఖలో మొదలైంది. ఈ  యాత్రకు కూడా పోలీసులు  ఆంక్షలు విధించారు. పవన్ ఈ యాత్రలో భాగంగా ఎక్క‌డా రోడ్ షో చేయ‌డానికి వీల్లేద‌ని పోలీసులు పేర్కొన్నారు. అదే విధంగా అభిమానుల‌తో క‌ర‌చాల‌నాలు, వాహ‌నం (ఓపెన్ టాప్) పైకి ఎక్కి అభివాదాలు లాంటివి కూడా చేయ‌డానికి వీల్లేద‌ని, చివరికి విశాఖ విమానాశ్ర‌యంలోనూ ఎవ‌రినీ క‌లిసేందుకు కానీ, అభివాదాలు, నినాదాలు చేసేందుకు కూడా అనుమ‌తి లేద‌ని పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే విమానాశ్రయంలో దిగి కారు ఎక్కి సభ స్థలం వద్ద కారు దిగడం వరకే అనుమతి ఇచ్చారు.

అంతేకాదు, అది కూడా విశాఖ విమానాశ్ర‌యం నుంచి కేవ‌లం పోర్టు రోడ్డు ద్వారా మాత్ర‌మే ప‌వ‌న్ కాన్వాయ్ వెళ్లాల‌ని, కాన్వాయ్ వెళ్తున్న స‌మ‌యంలో ఈ రోడ్డులో ఎక్కడా ఎలాంటి ఆర్భాటాలు, నినాదాలు, జెండా ఎగ‌రవేత‌లు వంటివి చేయడానికి వీల్లేద‌ని, పవన్ కారు దిగడం కానీ, అభివాదం చేయడానికి కానీ వీలు లేదని.. ఒకవేళ పోలీసుల ఉత్తర్వులను కాదని అలా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఫైనల్ గా పవన్ విమానాశ్ర‌యం నుంచి నేరుగా జ‌గ‌దాంబ సెంట‌ర్‌కు చేరుకుని, అక్క‌డ స‌భ నిర్వ‌హించుకుని, అక్కడ నుండి నేరుగా బస చేసే ప్రాంతానికి వెళ్లిపోవాలని, ఇందుకు మాత్ర‌మే అనుమ‌తి ఇస్తున్న‌ట్టు విశాఖ‌ప‌ట్నం పోలీసు క‌మిష‌న‌ర్ కార్యాల‌యం విస్పష్టంగా పేర్కొంది.

అలాగే  ప‌వ‌న్ స‌భ‌కు వ‌చ్చేవారికి పాస్‌లు మంజూరు చేయాల‌ని ఒక్కో పాస్‌పై కేవ‌లం న‌లుగురిని మాత్ర‌మే అనుమ‌తిస్తామ‌ని, ఆక‌స్మిక త‌నిఖీలు చేసి.. పాస్‌లేని వారిని అదుపులోకి తీసుకునే అధికారం త‌మ‌కు ఉంద‌ని ఆదేశాల్లో పేర్కొంది. వైసీపీ ఏ స్థాయిలో ప్రతిపక్షాలకు భయపడుతున్నదో ఆ ఉత్తర్వులను చూస్తేనే అర్ధమవుతున్నది.  కాదనలేక ఉత్తర్వులు ఇవ్వడం..వైసీపీ నేతల మెప్పు కోసం సవాలక్ష ఆంక్షలు పెట్టడం చూస్తుంటే ఏపీ పోలీసులు ఏ స్థాయిలో ఒత్తిడికి గురవుతున్నారో తెలిసిపోతుంది.

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.