పని తీరే ప్రామాణికం.. గెలుపు గుర్రాలకే టికెట్టు.. చంద్రబాబు స్పష్టీకరణ

Publish Date:Aug 20, 2022

Advertisement

పార్టీ అధినేత‌తో నాలుగు మాట‌లు మాటాడినంత మాత్రాన ఆయ‌న దృష్టిలో గొప్ప నాయ‌కుడు అయిపోరు, నాలుగు ఫోటోలు తీసుకున్నంత మాత్రాన జ‌నాల్లో ప‌ర‌ప‌తి పెరిగిపోతుంద‌నుకోవ‌డ‌మూ పొర‌పాటే. రాజ‌కీయాల్లో పైకి రావాలంటే   పార్టీ కోసం పాటుప‌డాలి. పార్టీ విజ‌యం కోసం కృషి చేయాలి. ఎన్నిక‌లు ఏవ‌యినా స‌రే పార్టీకి త‌న వం తు కృషి చేయ‌డ‌మే పార్టీ అధినేత‌ను గౌర‌వించ‌డంతో స‌మానం. ఏపీలో మారుతున్న రాజ‌కీయ‌ ప‌రిణామాల దృష్ట్యా తెలుగు దేశం పార్టీకి అధికారంలోకి రావ‌డానికే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయన్న పరిశీలకుల విశ్లేషణల నేపథ్యంలో ఇంత కాలం పార్టీని పట్టించుకోకుండా మొహం చాటేసిన నేతలంతా మేమే తోపులం అంటూ ముందుకు వస్తున్నారు.  చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో పాల్గొని తమకే టికెట్ ఖరారైపోయిందంటూ లీకులిచ్చుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు.

దీంతో చంద్రబాబు ఈ విషయంలో పార్టీ నాయకులకు, క్యాడర్ కు క్లారిటీ ఇచ్చారు. తాను ఎవరికీ టికెట్ కన్ ఫర్మ్ చేయలేదని విస్పష్టంగా చెప్పారు. నియోజకవర్గ సమీక్షకు హాజరైనంత మాత్రాన టికెట్ కన్ ఫర్మ్ అయినట్లు కాదని, పార్టీ టికెట్ దక్కాలంటే పనితీరే ప్రామాణికమని తేల్చేశారు.  జ‌గ‌న్ ప్ర‌భుత్వ  తీరు ప‌ట్ల ప్ర‌జ లు విసుగెత్తారు. జగన్ పథకాలు, ప్ర‌కటనలు ఒట్టి డొల్ల అన్న గ్రహింపునకు జనం వచ్చేశారు. రాష్ట్రంలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే తెలుగుదేశం దూకుడు పెంచింది. ప్ర‌తీ ప్రాంతంలోనూ చిన్న‌, పెద్ద నాయ‌కుల‌ను స‌మ‌ర స్పూర్తితో ముంద‌డుగు వేయా ల‌ని ఆ పార్టీ అధినే చంద్ర‌బాబునాయుడు పార్టీ నేతలకు, క్యాడర్ కు దిశా నిర్దేశం చేశారు.

నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్ చార్జీలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిగో ఈ సమీక్షలను ఆసరాగా చేసుకునే కొందరు తమకు పార్టీ టికెట్ అధినేత ఖరారు చేసుకున్నారంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వదంతులు వ్యాపింప చేస్తున్నారు. వీటికి పార్టీ అధినేత చంద్రబాబు గట్టిగా చెక్ పెట్టారు.  వదంతులు నమ్మొద్దనీ, ఎవరికీ తాను పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేయలేదనీ విస్పష్టంగా చెప్పారు. ఈ సారి గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్ ఇస్తానని ప్రకటించారు.   పార్టీలో సీనియారిటీ, సమీకరణాల పేర్లతో టిక్కెట్లు వస్తాయనుకోవడం భ్రమేనని తేల్చేశారు. అవనిగడ్డ, పెనమలూరు, మార్కాపురం, సంతనూతల పాడు, గుంటూరు ఈస్ట్, పార్టీ ఇన్చార్జులతో   భేటీ అయ్యారు. గత మూడు రోజుల్లో 14 అసెంబ్లీ నియోజకవర్గ ఇన్​ఛార్జ్​లతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించి.. వారి పనితీరును సమీక్షించారు.

ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని..పార్టీ నేతలు, నియోజకవర్గ ఇంచార్జ్ లు మరింత దూకుడు పెంచాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ లతో..సమీక్షలు నిర్వహిస్తున్న ఆయన.. మొదటి రోజు అవనిగడ్డ, పెనమలూరు, మార్కాపురం,సంతనూతలపాడు నియోజకవర్గాల ఇంచార్జ్ లతో భేటీ అయ్యారు. ఆయా ఇంఛార్జ్ లతో ప్రత్యేకంగా జరిగిన ముఖాముఖిలో...పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు, బాదుడే బాదుడు కార్యక్రమం, ఓటర్ల జాబితా పరిశీలన, పార్టీ కార్యక్రమాల నిర్వహణ...నేతల పనితీరుపై చర్చించారు. నియోజవకర్గ స్థాయిలో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్థేశం చేశారు. ఆయా నియోజకవర్గాలపై తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా ఇంచార్జ్ లతో మాట్లాడి...సూచనలు చేశారు. రానున్న ఏడాది కాలమే అత్యంత కీలక మని అలస త్వం వీడి ప్రణాళికతో పని చేయాలన్నారు. పార్టీ పిలుపునిచ్చే పలు కార్యక్రమాల్లో నేతలు, కార్యకర్తలు పాల్గొన డంతో పాటు స్థానిక సమస్యలపైనా పోరాటం చేయాలని సూచించారు. ప్రజా సమస్యలతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి పైనా స్థాని కంగా కార్యక్రమాలు రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

 నేతల పనితీరును దృష్టిలో పెట్టుకునే వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు జరుగుతుందని పార్టీ నేతలకు అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు తేల్చిచెప్పారు.ఫలానా వారికి పార్టీ టికెట్ ఖరారైంది అంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని స్పష్టం చేశారు. నియోజకవర్గ సమీక్షలకు వచ్చిన వారందరికీ టికెట్ ఖాయమంటూ జరుగుతున్న ప్రచారాన్ని విశ్వసించొద్దని విస్పష్టంగా తేల్చేశారు. ఈ సారి తాను గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లిస్తానని స్పష్టం చేశారు. నేతల పని తీరుపై ప్రతి మూడు నెలలకు ఒక సారి సమీక్ష నిర్వహిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ టికెట్ విషయంలో పని తీరే ప్రామాణికమని, గెలిచే వారికే టికెట్లని చంద్రబాబు విస్పష్టంగా చెప్పారు. రానున్న రోజులలో నియోజవకర్గాల ఇన్ చార్జిలతో ఇదే తరహా సమీక్షలు చేపట్టనున్నట్లు చెప్పారు. 

By
en-us Political News

  
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.