జగన్ 2.o కామెంట్స్: పవన్ 10x కౌంటర్.. మామూలుగా లేదుగా.?
Publish Date:Oct 28, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార తెలుగుదేశం కూటమి, ప్రత్యర్థి పార్టీ వైసీపీల మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. స్థానిక సమరం వేళ జగన్ వ్యాఖ్యలకు జనసేనానిని, ఉపముఖ్యమంత్రి పవన్ ఇచ్చిన కౌంటర్ పొలిటికల్ డిబేట్ కు దారి తీసింది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తాను మళ్లీ అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్ దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది. తెలుగుదేశం కూటమి పార్టీల అగ్రనేతలు మంగళవారం (అక్బోబర్ 27) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఇటీవల పులివెందులలో జగన్ మీడియా సమవేశంలో త్వరలో జగన్ 2.0 లొ తామేంటో నిరూపిస్తామని హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, పవన్ కల్యాణ్ మీరు కేవలం 2.0 చూపిస్తే మే 10X రెట్లు) ప్రతిస్పందన చూపిస్తామని రిటార్డ్ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా గతంలోనూ ఇలా వ్యవహరించినందుకే 2019 ఎన్నికలలో జగన్ కు జనం గుణపాఠం చెప్పారన్నారు బెదిరింపులకు భయపడి వెనకడుగు వేసే వాళ్లెవరూ లేరన్న ఆయన.. బలహీనులే ఇలాంటి బెదిరింపు ధోరణులు ప్రదర్శిస్తారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధంగా వ్యవహరించడం మానుకుని, వైకాపా నాయకులు ఇకనైనా జనజీవన స్రవంతిలోకి రావాలని జనసేనాని పిలుపునిచ్చారు. రానున్న రోజులలో కూటమి పార్టీలూ విడిపోతాయనీ.. రానున్న ఎన్నికల్లో తమకు మళ్లీ అవకాశం దక్కుతుందనే అంచనాలతోనే వైఎస్ జగన్ తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ ఆ ఆశలకు గండి కొట్టేలా పవన్ కల్యాణ్ ఇప్పుడు 10x అన్నారని చెబుతున్నారు. కూటమి పార్టీల మధ్య సంపూర్ణ సమన్వయం ఉందన్న జనసేనాని మరో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు తెలుగుదేశం కూటమి ఐక్యంగా ముందుకు సాగుతుందని 10x వ్యాఖ్యతో కుండబద్దలు కొట్టారు.
[Pawan Kalyan Strong Counter to Jagan, AP Politics, Jagan 2.0 Comments, Janasena Pawan Kalyan, 10x Counter, TeluguOne]
http://www.teluguone.com/news/content/pawan-kalyan-strong-counter--to-jagan-39-235651.html





