జగన్ ది హిట్ అండ్ రన్ రాజకీయం: వైసీపీ అధినేత ఓ క్రిమినల్ లిటిగెంట్.. చంద్రనిప్పులు.!

Publish Date:Oct 24, 2026

Advertisement

వైసీపీ అధినేత జగన్ పొలిటికల్ పాలసీలను ఏపీ సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు.  స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు, ప్రజాస్వామ్య వ్యవస్థను పక్కనబెట్టి అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా వైసీపీ అధినేత  హిట్ అండ్ రన్ తరహా రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్  బాధ్యతారహితంగా, ఒక క్రిమినల్ లిటిగెంట్‌లా వ్యవహరిస్తున్నారన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు..  గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  

ఈ సందర్భంగా వైసీపీ హయాంలో సాగిన దౌర్జన్యాలు, అబద్ధాలు, అరాచకాలను వివరిస్తూ.. అదే హింస... అవే అబద్ధాలు... అవే అరాచకాలు  అనే శీర్షికతో రూపొందించిన  బుక్‌లెట్  చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకమైన, పవిత్రమైన ఎన్నికల నిర్వహణ ప్రాధాన్యతను   నొక్కిచెప్పిన ఆయన దేశంలో రాజ్యాంగబద్ధంగా స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల వ్యవస్థ పనిచేస్తోందని, కానీ గత ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమం,  సుపరిపాలన ద్వారా మాత్రమే నిజమైన పారదర్శక పాలన సాధ్యమవుతుందని, విపక్షాల అరాచక రాజకీయాలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారనిఅన్నారు.  

గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను పూర్తిగా అపహాస్యం చేశారన్న చంద్రబాబు స్వయంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్  హోదాలో ఉన్న అధికారి కూడా తనకు ప్రాణభయం ఉందంటూ ఫిర్యాదు చేయాల్సిన దుస్థితి అప్పట్లో దాపురించిందని గుర్తుచేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు విపక్షాల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా బెదిరించడం, దాడులు చేయడం, నామినేషన్ పత్రాలను చింపివేయడం వంటి అరాచకాలకు వైసీపీ శ్రేణులు పాల్పడిందని చెప్పారు. 

జగన్ అరాచక పాలనను భరించలేక జనం 2024 ఎన్నికల్లో  తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి చరిత్రాత్మక మద్దతు ఇచ్చారని చంద్రబాబు చెప్పారు.   తమపై ప్రజలు ఉంచిన అపారమైన నమ్మకానికి ఆ విజయం ప్రతీక అన్న ఆయన.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తమ ప్రభుత్వం అనునిత్యం శ్రమిస్తోందని వివరించారు.

ప్రజల మద్దతు కోల్పోయిన వైసీపీ ఇంకా   పాత పద్ధతుల్లోనే వ్యవహరిస్తోందన్న చందరబాబు,  అభివృద్ధిని అడ్డుకోవడం, రాష్ట్రాన్ని అస్థిరపరచడం, అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడం వంటి పద్ధతులనే వారు ఇప్పటికీ నమ్ముకున్నారన్నారు.   స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు తమ ప్రజాస్వామ్య హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఎలాంటి హింసాత్మక ఘటనలనైనా కఠినంగా అణచివేస్తామని హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయాలని చూస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కుండబద్దలు కొట్టారు.   


[CBN Say Jagan Criminal Litigant,   YCP Violence, Local Body Elections, Andhra Pradesh Politics, Telugu One]

By
en-us Political News

  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.