అధికారులూ జాగ్రత్త.. నిబంధనలు మీరొద్దు.. చిక్కుల్లో పడొద్దు!

Publish Date:Jun 20, 2022

Advertisement

నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా జగన్ పాలన కోనసాగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పడుతూ కోర్టులు ఎన్ని సార్లు ఆగ్రహం వ్యక్తం చేసినా జగన్ పట్టించుకోవడం లేదు. నా ప్రభుత్వం.. నా ఇష్టం అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. 151 స్థానాలలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టడానికి కోర్టులకు అధికారమేమిటన్నట్లుగా ఆయన పాలనా ధోరణి కనిపిస్తోందని విమర్శకులు అంటున్నారు. కోర్టులు ఎన్ని సార్లు మొట్టికాయలు వేసినా, ఆక్షింతలు జల్లినా, ఐఏఎస్ అధికారులకు శిక్షలు విసినా, జరిమానాలు వేసినా జగన్ సర్కార్ తీరు ఏ మాత్రం మారడం లేదు.
పాలన అంటే కక్ష సాధింపే అన్న చందంగా జగన్ హయాం కొనసాగుతోంది. తాజాగా ఆదివారం తెల్లవారు జామున తెలుగుదేశం సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడి నివాసం కూల్చి వేతకు అధికారులు యత్నించడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఆ వేళలో అంత రాత్రి వేళ కూల్చివేతల అవసరమేమిటని కోర్టు ప్రశ్నించింది. దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నిలదీశారు. అయ్యన్న పాత్రుడికి మద్దతుగా నర్సీపట్నం వెళుతున్న  తెలుగుదేశం నాయకులను హౌస్ అరెస్టులు చేయడం జగన్ పిరికి తనానికి నిదర్శనమని చంద్రబాబు విమర్శించారు. అక్రమ కూల్చివేతలే సరికాదంటుంటే.. ఆ కూల్చివేతలకు నిరసన తెలియజేడయానికి వెళుతున్న వారిని అరెస్టు చేయడమేమిటని పరిశీలకులు సైతం ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతోందని వారు అంటున్నారు. 

నిరసన తెలపడానికి విపక్ష నేతలకు హక్కే లేదన్నట్లుగాఆక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్న జగన్ సర్కార్ నేరస్తులకు మాత్రం రాచమర్యాదలు చేస్తున్నదని విమర్శిస్తున్నారు. అనంతబాబు విషయమే తీసుకుంటే.. విచారణలో తానే స్వయంగా హత్య చేశానని అంగీకరించినా.. పోలీసులు ఇంత వరకూ ఆయనను తమ కస్టడీకి తీసుకోవడానికి కోర్టును కోరలేదన్నారు. రిమాండ్ ఖైదీగా  అనంతబాబుకు జైళ్లో రాచమర్యాదలు జరుగుతున్నాయనీ గుర్తు చేశారు.  కాగా అయ్యన్న పాత్రుడి నివాసం కూల్చివేత విషయానికి వస్తే.. కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి దాటిన తరువాత అధికారులు మందీ మార్బలంతో కూల్చివేతకు బుల్ డోజర్ తో సహా వచ్చారంటే.. ఇందుకు సంబంధించిన ఆదేశాలు ఏ స్థాయి నుంచి వచ్చాయే తేలికగానే అర్ధమౌతుందని అంటున్నారు.

నర్సీపట్నం వెళుతున్న తెలుగుదేశం నాయకులను అరెస్టు చేయడాన్ని జగన్  పిరికి పంద చర్యగా అభివర్ణించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అయ్యన్న పాత్రుడి ఇంటి కూల్చివేత యత్నం జగన్ కక్ష సాధింపు చర్యే అన్న తమ వాదనే నిజమని కోర్టు తన వ్యాఖ్యలద్వారా రుజువు చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను గర్హిస్తూ గట్టిగా గళం వినిపిస్తున్న  తెలుగుదేశం బీసీ నేతలపై కేసులు, అరెస్టులు, ఇళ్లపై దాడులతో జగన్ వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. జగన్ కక్ష సాధింపు చర్యలకు వత్తాసు పలుకుతూ నిబంధనలను తుంగలో తొక్కి వ్యవహరిస్తున్న ప్రతి అధికారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.  ప్రభుత్వ ప్రాపకం కోసం నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించి ఆనక చిక్కుల్లో పడవద్దని అధికారులకు చంద్రబాబు హితవు పలికారు.

అయ్యన్న చేసింది కబ్జా కాదని....ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం 600 ఎకరాల దళితుల భూములు చెరబట్టడమే నిజమైన కబ్జా అని చంద్రబాబు అన్నారు. అయ్యన్న ఇంటిని కూల్చివేసేందుకు వందల మంది పోలీసులతో, ముగ్గురు ఐపిఎస్ లు, సమస్త రెవెన్యూ అధికారులను మోహరించడం జగన్ దిగజారుడు విధానాలకు  పరాకాష్ఠగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభివర్ణించారు.  టిడిపి సభలు విజయవంతం అవ్వడం, ప్రజలనుంచి కూడా తిరుగుబాటు మొదలవ్వడంతో తీవ్ర ఫ్రస్టేషన్ లో పడిన జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారని,  ఉత్తరాంధ్రలో నాడు సబ్బంహరి, పల్లా శ్రీనివాస్ ఇళ్లపై, ఆస్తులపై ప్రభుత్వ చర్యల ముసుగులో దాడి చేయించిన జగన్...ఇప్పుడు అయ్యన్న ఇంటిపై దాడి చేశారని అన్నారు. ఈ దాడులు, కక్ష సాధింపు చర్యలకు టిడిపి నేతలు ఎవరూ భయపడరని చంద్రబాబు అన్నారు.

By
en-us Political News

  
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.
తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని   యశ్‌పాల్ సువర్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బిజీ విద్యార్థులు మరియు ఉద్యోగినుల కోసం ఫ్రెష్ లుక్ బ్యూటీ క్లాసెస్ అందిస్తున్న వీకెండ్ బ్యూటీ కోర్సుల వివరాలు. శని, ఆదివారాల్లో మేకప్, స్కిన్‌కేర్ మరియు హెయిర్‌స్టైలింగ్ నేర్చుకుని ప్రొఫెషనల్ బ్యూటీషియన్‌గా మారే సువర్ణ అవకాశం!
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవకు లబ్ధిదారులుగా ఉన్న అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తూ, పెనమలూరు పర్యటనలో తనకు ధన్యవాదాలు తెలిపేందుకే పెద్ద ఎత్తున తరలివచ్చారని వివరంచారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంతో వాస్తవాలను తేల్చుకున్న పోలీసులు ప్రమాదానికి కరాణమైన సిదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడంతో పాటు.. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, అలాగే ఆధారాలు తారుమారు చేసే యత్నాలు చేశారనీ పేర్కొంటూ సిదిరి అప్పల రాజును కేసులో ఏ3గా చేర్చి ఆయనను కూడా అరెస్టు చేశారు.
మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.