2021నాటి అసెంబ్లీ ఘటనపై నారా భువనేశ్వరి భావోద్వేగం.!

Publish Date:Jul 29, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ సంస్థల అధినేత్రి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో శాసనసభలో తనపై వ్యక్తిగత విమర్శల చేసి, అవమానకరంగా వైపీపీ నేతలు వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ   భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా నాటి అసెంబ్లీ ఘటనను మహాభారతంలోని ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కుప్పం నియోజకవర్గ అభివృద్ధి వ్యవహారాలు, స్థానిక కార్యకర్తల సంక్షేమాన్ని పర్యవేక్షించేందుకు నారా భువనేశ్వరి మూడు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా..  ఓ స్థానిక ఆలయాన్ని దర్శించారు. ఆ ఆలయంలో ద్రౌపది అమ్మవారిని దర్శించుకున్న తరువాత నాటి పరిణామాలను గుర్తుచేసుకుంటూ, ఒక మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడే హక్కు ఏ పురుషుడికీ లేదన్నారు. 

2021 నవంబరులో అసెంబ్లీ వేదికగా అప్పటి అధికార పక్ష నాయకులు ప్రతిపక్ష నేత చంద్రబాబును మానసికంగా దెబ్బతీసేందుకు తన పేరును లేవనెత్తారన్న  భువనేశ్వరి, తన భర్తపై రాజకీయంగా పై చేయి సాధించలేక..  తనను అనవసరంగా రాజకీయ రచ్చలోకి లాగారన్నారు. అసెంబ్లీ వంటి పవిత్రమైన సభలో ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేయడం  దారుణమన్నారు.

మహాభారతంలో ద్రౌపదికి అవమానం జరిగిన సమయంలో శ్రీకృష్ణుడు అండగా నిలిచినట్లే, తమ కుటుంబానికి పరాభవం జరిగిన  సమయంలో రాష్ట్ర ప్రజలే దేవుడి రూపంలో అండగా నిలబడ్డారని భువనేశ్వరి చెప్పారు. ప్రతి మహిళకు తన గౌరవాన్ని కాపాడుకునే శక్తి ఉంటుందని, ఎవరూ వచ్చి రక్షించాల్సిన అవసరం లేదన్నారు. తమకు నిరంతరం మద్దతుగా నిలిచిన ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు. 

సాధారణంగా నారా భువనేశ్వరి వ్యాపార, సామాజిక సేవా కార్యక్రమాలకే పరిమితమవుతుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.  

అయితే ఆలయ సందర్శన వేళ ద్రౌపది విగ్రహాన్ని చూడటంతో భువనేశ్వరి నాడు అసెంబ్లీలో తనపై వైసీపీయులు చేసిన వ్యాఖ్యలను గుర్తుకు వచ్చి భావోద్వేగానికి లోనయ్యారని పరిశీలకలు విశ్లేషిస్తున్నారు.  ప్రత్యక్షంగా ఏ పార్టీ పేరూ ప్రస్తావించకుండానే భువనేశ్వరి  నాటి అధికార పక్ష తీరును తప్పుబడుతూ  చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. గతంలో చంద్రబాబు కూడా నాటి ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురై అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి కన్నీటిపర్యంతమైన సంగతి తెలిసేదే. ఐదేళ్ల క్రితం నాటి ఘటనను నారా భువనేశ్వరి మరల ప్రస్తావించడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మహిళల ఆత్మగౌరవం, అసెంబ్లీలో నైతిక విలువలపై ఈ వ్యాఖ్యలు మరోసారి  చర్చకు దారితీశాయి.   

Nara Bhuvaneswari,  Kuppam Tour,  AP Assembly Incident, Chandrababu Naidu Wife, Andhra Pradesh Politics, TeloguOne

By
en-us Political News

  
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.
తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని   యశ్‌పాల్ సువర్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బిజీ విద్యార్థులు మరియు ఉద్యోగినుల కోసం ఫ్రెష్ లుక్ బ్యూటీ క్లాసెస్ అందిస్తున్న వీకెండ్ బ్యూటీ కోర్సుల వివరాలు. శని, ఆదివారాల్లో మేకప్, స్కిన్‌కేర్ మరియు హెయిర్‌స్టైలింగ్ నేర్చుకుని ప్రొఫెషనల్ బ్యూటీషియన్‌గా మారే సువర్ణ అవకాశం!
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవకు లబ్ధిదారులుగా ఉన్న అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తూ, పెనమలూరు పర్యటనలో తనకు ధన్యవాదాలు తెలిపేందుకే పెద్ద ఎత్తున తరలివచ్చారని వివరంచారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంతో వాస్తవాలను తేల్చుకున్న పోలీసులు ప్రమాదానికి కరాణమైన సిదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడంతో పాటు.. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, అలాగే ఆధారాలు తారుమారు చేసే యత్నాలు చేశారనీ పేర్కొంటూ సిదిరి అప్పల రాజును కేసులో ఏ3గా చేర్చి ఆయనను కూడా అరెస్టు చేశారు.
మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.