ఆర్థిక వ్యవస్థ పై బాబు అరెస్ట్ ప్రభావం!

Publish Date:Sep 12, 2023

Advertisement

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్, రాష్ట్ర, రాజకీయాలను, రాజకీయ సమీకరణలను ప్రభావితం చేస్తుంది. అందులో సందేహం లేదు. అయితే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ రాజకీయలను మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఎంతగానో ప్రభావితం చేస్తుందని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.నిజానికి, చంద్రబాబు నాయుడు అరెస్ట్, రాజకీయాలను ఎంతగా ప్రభావితం చేస్తుంది అనేది ఇప్పటికే కళ్ళ ముందు కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్ట్’కు నిరసనగా తెలుగు దేశం పార్టీ ఇచ్చిన బంద్ పిలుపుకు ప్రజలు స్వచ్చందంగా స్పందించిన తీరు గమనిస్తే, చంద్రబాబు నాయుడు అరెస్ట్’ను ప్రజలు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో అర్థమవుతుంది.

జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను ప్రజలను చీదరించుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం తెలుగు దేశం పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు చివరకు సాధారణ కార్యకర్తలను సైతం గృహ నిర్బంధంలో కట్టి పడేసినా, రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసినా, ప్రజలు స్వచ్చందంగా బంద్’ ను సక్సెస్ చేశారంటే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ రాష్ట్ర రాజకీయాలపై, రేపటి ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేరే చెప్పనక్కర లేదు. 

చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి ప్రతిపక్ష నాయకుడే కావచ్చును, కానీ, దేశ విదేశాల్లో ఇప్పటికే ఆయన సంస్కరణలకు, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్’గా గుర్తింపు, గౌరం పొందారు.   ఆవిధంగా ఆయనకు,జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న  గుర్తింపు, గౌరవం గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఒక్క రాజకీయ రంగంమనే కాదు,అన్ని రంగాల ప్రముఖులు అనేక మంది చంద్రబాబు నాయుడు, అంటే ఒక విజనరీ, ఒక విశ్వాసం అని పేర్కొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అన్నిటినీ మించి నాలుగు పదులకు పైగా ప్రజా జీవితంలో ఉన్న ఆయన సంపాదించుకున్న, విస్వసనీయత ఇంతా కాదు. ఆ విజనరీ దృక్పధం, ఆ విశ్వసనీయతల ఆధారంగానే, చంద్రబాబు నాయుడు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్’ నగరాన్ని, విశ్వనగరంగా, ఐటీ హబ్’ గా అభివృద్ధి చేశారు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాటిన ఐటీ విత్తనాలే ఈరోజు మహా వృక్షాలుగా ఎదిగాయి. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఐటీ హబ్’ నిలబెడుతున్నాయి.  

రాష్ట్ర విభజన తర్వాత,  నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా అనేక సవాళ్ళను ఎదుర్కుంటూ కూడా చంద్రబాబు నాయుడు, తమ అనుభవం, విజ్ఞత, వివేచన.. ఈ అన్నిటినీ మించిన విస్వసనీయతలను కలగలిపి, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించారు. కియా వంటి అనేక మేజర్ కంపెనీలు కొత్త రాష్ట్రం, అని చూడకుండా, చంద్రబాబు ఎక్కడుంటే అభివృద్ధి అక్కడ ఉంటుందన్నవిశ్వాసంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందు కొచ్చాయి. అయితే, దురదృష్ట వశాత్తు 2019 ఎన్నికల్లో అధికారం చేతులు మరి, అరాచక శక్తుల చేతుల్లోకి పోవడంతో, పెట్టుబడులకు బ్రేకులు పడ్డాయి. దీంతో, ప్రస్తుత వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే, అప్పులు, తిప్పలు, ఆర్థిక అరాచకం తప్ప మరో మాట వినిపించని పరిస్తితిలో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే అద్వాన్న స్థితికి చేరింది. ఒక విధంగా చెప్పాలంటే, జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి పెట్టు బడులు కాదు, కనీసం అప్పులు కుడా పుట్టని పరిస్థితి నెలకొంది, అంటే, పరిస్థితి ఏమిటో వేరే వివరించవలసిన అవసరం లేదు. .

ఇప్పడు దీనికి తోడు జగన్ రెడ్డి ప్రభుత్వం, కక్షపూరితంగా విస్వసనీయతకు మారు పేరుగా నిలిచిన చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం, అక్రమ నిర్భందంలో ఉంచడంతో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆ ప్రభావం ప్రబలంగా ఉంటుందని, ఆర్థిక నిపుణులు అంటున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.