ఈ నెలలోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు: మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ ఆమోదం కోసమేనా.?
Publish Date:Oct 16, 2026
Advertisement
కేంద్రంలోని మోడీ సర్కార్ ఈ నెలలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లలను ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోవాలని భావిస్తోంది. ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. బిల్లులకు అవసరమైన మద్దతు లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం. కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 17న లోక్సభలో మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన ఓటింగ్లో కేంద్రానికి అవసరమైన మద్దతు లభించలేదు. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండోంతుల మెజారిటీ దక్కకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు. దీంతో ఈ బిల్లుతో అనుసంధానమైన ఇతర బిల్లులపై కేంద్రం ముందుకు వెళ్లలేదు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన చర్చలో అసలు సమస్య మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలా వద్దా అన్నదొక్కటే కాదు. ఆ రిజర్వేషన్లను ఏ విధానంలో అమలు చేయాలి? నియోజకవర్గాల సంఖ్యను ఎలా మార్చాలి? రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అన్న ప్రశ్నలు కూడా కీలకంగా మారాయి. అన్నిటికీ మించి మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన చట్టం 2023లోనే ఆమోదం పొందింది. అయితే దాని అమలు జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలతో ముడిపడి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్లో కేంద్రం ప్రతిపాదించిన మార్పులు మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు లోక్సభ స్థానాల సంఖ్యను పెంచే అంశంతో కలిసి ఉంది. అందుకే ఈ వ్యవహారం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈసారి బిల్లులకు మద్దతు కూడగట్టేందుకు కేంద్రం ప్రతిపక్ష పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా డీఎంకేతో చర్చలు సాగుతున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరికొన్ని చిన్న పార్టీల మద్దతును కూడా కూడగట్టేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి.. బిల్లులకు ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో?
అదే వివాదానికీ కారణంగా మారింది. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంపై రాజకీయంగా దాదాపు అన్ని పార్టీలూ మద్దతు ఇస్తున్నప్పటికీ, ఆ రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంటే.. నియోజకవర్గాల పేర్లు, సరిహద్దులు మార్చడం మాత్రమే కాదు.. ఏ రాష్ట్రానికి ఎన్ని లోక్సభ స్థానాలు ఉంటాయి? ఏ ప్రాంతానికి ఎంత రాజకీయ ప్రాతినిధ్యం దక్కుతుంది? వంటి అంశాలపై కూడా ప్రభావం పడుతుంది.
[Special Session Parliament, Womens Reservation Bill, Delimitation Bill, Redrawing Constituencies, Central Government, DMK, Discussions, Telugu One]
http://www.teluguone.com/news/content/special-session--parliament-39-234555.html




