Publish Date:May 22, 2023
వైయస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి.. తన తల్లీ శ్రీలక్ష్మీకి తీవ్ర అనారోగ్యమంటూ... మే 19వ తేదీన కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అదే ఆసుపత్రిలో తల్లితో పాటే వైయస్ అవినాష్ రెడ్డి కూడా ఉండడంతో.. సదరు ఆసుపత్రి చుట్టు రాజకీయం వేడిక్కెంది. ఇక మే 22వ తేదీ.. తమ విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేసినా... ప్రస్తుతం తన తల్లీ తీవ్ర అనారోగ్యం దృష్ట్యా ... ప్రస్తుతం తాను విచారణకు రాలేనని.. కొద్ది రోజుల తర్వాత హాజరవుతానంటూ సీబీఐకి ఆయన సందేశం పంపించడం.. అందుకు సీబీఐ ససేమీరా అనడమే కాదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ మే 22వ తేదీ అంటే సోమవారం విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.
కానీ ఈ హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పట్ల సందేహం వ్యక్తం చేస్తున్న సీబీఐ.. సోమవారం తెల్లవారుజామున.. కర్నూలు జిల్లా ఎస్పీని కలిసి.. వైయస్ అవినాష్ రెడ్డి లొంగిపోయేలా చూడమని కోరింది. అయితే శాంతి భద్రతల పరిస్థితి అదుపుచేయలేమంటూ ఎస్పీ చేతులెత్తేయడంతో కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలని నిర్ణయించుకుంది.
ఇంకోవైపు.. విశ్వభారతి ఆసుపత్రి వద్దే కాదు.. ఆ పరిసర ప్రాంతాలంతా వైసీపీ శ్రేణులతో నిండిపోయింది. ఇంకాచెప్పాలంటే... ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వారి వారి వర్గాలు ఇప్పటికే అక్కడ భారీగా మోహరించి ఉన్నారు. ఆదివారం రాత్రి ఆ ఆస్పత్రి సమీపంలో ఉన్న మీడియా ప్రతినిధుల అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేశారు.
అలాగే మే 19వ తేదీన హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయలుదేరిన అవినాష్ రెడ్డి.. ఆ తర్వాత సీబీఐ కార్యాలయానికి కాకుండా.. పులివెందులకు పయనమయ్యారు. దీంతో ఆయన వాహనాలను అనుసరించిన కొన్ని మీడియా ఛానెళ్ల వాహనాలతో పాటు జర్నలిస్ట్‌లపై అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేసిన విషయం విదితమే.
ఇక ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసిన.. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డితోపాటు అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డిలను విచారించి.. కీలక విషయాలను రాబట్టిన సీబీఐ ఆ క్రమంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేసుకోవడాన్ని గమనించిన అవినాష్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటితే.. ప్రమాదంలో పడే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయనే భావనతో విశ్వభారతి ఆసుపత్రిలో తల్లిని చేర్చారనిన్న చర్చ సాగుతోంది. అదీకాక.. వైయస్ వివేక దారుణ హత్యను గుండెపోటుగా చిత్రీకరించిన నాటి నుంచి అవినాష్ రెడ్డి తల్లి గుండెపోటు వరకు వరుస సంఘటనలలో అవినాష్ పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటే అందుకు కారణం ఈ అన్ని సందర్భాలలోనూ అవినాష్ వ్యవహరించిన తీరే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/avinash-shelter-in-viswa-bharati-25-155731.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.