రాజకీయాల్లో గెలవడం, ఓడడం కంటే లోపాయికారి ఒప్పందాలు, ఒకరికొకరు తోడ్పడడాలు చాలా చిత్రంగా జరిగిపోతూంటాయి. తమకు గెలిచే అవకాశాలు మెండుగా వున్నప్పటికీ భారీ మెజారిటీ కోసం భారీ జాగ్రత్తలు తీసుకోవడం కొంచెం ఓవరాక్షన్‌లానే అనిపిస్తుంది. ఆత్మకూరు విషయంలో వైసీపీ సంగతి అలానే వుందం టున్నారు రాజకీయ విశ్లేషకులు.
గౌతం రెడ్డి చనిపోవడంతో ఆత్మకూరు సీటుకి ఉప ఎన్నిక జరుగ నుంది. మంచి నేత, మంత్రి చనిపోయిన పుడు ఆయన కుటుంబీకులకో, సమీపబంధువులకో ఆ స్థానంలో పోటీకి ఛాన్స్ ఇవ్వడం, వారు గెలిచేలా మద్దతు నీయడం దాదాపు అన్ని పార్టీలవారూ అందుకు ఆమోద ముద్రవేయడం సర్వ సాధారణం. ఆత్మకూరులో పరిస్థితీ అంతే. ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీ ఎలాగూ గెలుస్తుందనేది అందరూ అనుకుంటున్నదే. దీనికి పెద్దగా పోటీచేయాల్సిన పనిలేదనే అనుకున్నారు. కానీ హఠాత్తుగా బిజెపీ తన అభ్యర్ధిని పోటీకి దింపేందుకు సిద్ధ పడింది. అంటే వైసీపీకి వీలయితే ఆ భారీ మెజారిటీ అందించాలని బిజెపీ కూడా తలుస్తున్నదనే అనుకో వాలి.
గత ఎన్నికల కంటే ఈ ఉప ఎన్నికల్లో పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నది వైసీపీ లక్ష్యం. అందుకు శాయశక్తులా లోకల్ నాయకులు, పార్టీ వర్గాలవారు కృషిచేయాలని జగన్ ఆదేశం. సానుభూతి ఓటుతో గెల వడం కంటే అందరి కృషితో భారీ మెజారిటీ సాధించి గెలవడం పార్టీ ప్రతిష్టను పెంచుతుం దని జగన్ అభి ప్రాయం కావచ్చు.
ఇప్పటికే మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, రోజాలకు ఆ బాధ్యత అప్పగించారు. వీరేగాదు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పంచాయితీ స్థాయి వారిని రంగంలోకి దింపేరు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి పెద్ద మెజారిటీ వచ్చేలా ఓటర్లను పట్టేసుకోమని అధినేత హెచ్చరిక. ఈ సంగతి తెలిసిన ప్రాంతీయులు తెగ నవ్వుకుంటున్నారు. గెలిచే అవకాశాలు ఉన్న చోట ఇంత ఓవరాక్షన్ అవ సరమా అనుకుంటున్నారు. చెట్ల కింద సరదా కబుర్లకు కూడా ఇదో కంటెంట్‌గా మారిపోయింది.
అందరికీ సరదా కాలక్షేపం కధే. కానీ వైసీపీ వారికి మాత్రం ఎక్కడ వోటర్లు ఇంట్లోనే వుండిపోతారోనన్న భయాందోళ నతో మంత్రులను రంగంలోకి దింపడం తప్పనిసరి అయిందేమో! ఓట్లు పెంచుకోవడానికి ఇంత కట్టడి అవసరమా జగన్నాధా!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/atmakur-by-poll-ycp-aims-huge-majority-25-137211.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.