సొంత సెక్యూరిటీ పెట్టుకోండి కాటసానీ.. సుప్రీం కోర్టు

Publish Date:Feb 25, 2026

Advertisement

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సెక్యూరిటీ తొలగింపు వ్యవహారంలో సుప్రీంకోర్టులో ఆసక్తికరమైన చర్చ జరిగింది. డబ్బున్న వారికి పోలీసు సెక్యూరిటీ ఎందుకు? మీ డబ్బు శక్తి వాడండంటూ, పోలీసు భద్రత ఇప్పుడు హోదా గా మారిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.   నాలిక కోస్తా అనడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిందన్న పేర్కొన్న సుప్రీం కోర్టు..   ఆ మాటలను పట్టుకుని అదే నిజమని నమ్మి సెక్యూరిటీ కోరడం తగదని సూచించింది. గతంలో మీ కుటుంబంలో  ఆరుగురి హత్య జరిగిందని ఇప్పుడు సెక్యూరిటీ కోరడం కూడా సరైనది కాదని పేర్కొంది. 

ఇక గతంలోకన్నా ప్రస్తుతం పోలీసులకన్నా మిన్నగా ప్రైవేట్ సెక్యూరిటీ పని చేస్తోంది. కాబట్టి మీరు మీ సొంత సెక్యూరిటీ పెట్టుకోమని సుప్రీం కోర్టు కాటసాని న్యాయవాదులకు సూచించింది. అయితే కాటసాని రాంభూపాల్ రెడ్డి కి డబ్బు శక్తి ఉందని అనడం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆయనకు వెయ్యి కోట్ల ఆస్తులున్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే అది నిజం కాదని అంటారాయన. ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం సుమారు వంద కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడా ఉండవు.

అయితే కాటసానిది ఫ్యాక్షన్ కుటుంబం. మే 27, 1979న జరిగిన ఒక దారుణమైన ఘటనలో కాటసాని రాంభూపాల్ రెడ్డి తండ్రి, ఆయన ఆరుగురు దాయాదులు ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత 1986లో ఆయన సోదరుడు కూడా హత్యకు గురయ్యారు. వీటి ఆధారంగా ఇప్పుడు ముప్పు ఉందనడమేంట సుప్రీం కోర్టు పేర్కొంది. ఒక వేళ మీకు ప్రాణహాని ఉంటే, లోకల్ పోలీసులకు తెలియక పోదు. వారు కూడా ఒక శాస్త్రీయమైన అంచనాకు వచ్చినపుడు ఆటోమేటిగ్గా మీకు భద్రత కల్పిస్తారని సుప్రీం కోర్టు పేర్కొంది. అంతేగానీ మీరు ప్రతిపక్ష నేత కాబట్టి  సెక్యూరీటీ కావాలంటే కుదరదని పేర్కొంటూ,  మీరు ఎమ్మెల్యేగా గెలిచినా ఆ సెక్యూరిటీ ఉండేది. అది కూడా లేక పోవడంతోనే 2ప్లస్2 భద్రత తొలగించారు. ఇవాళ,రేపు ఏదో ఒక పార్టీల్లో చేరడం చాలా చాలా సులువు. అలాంటిది మేం ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం.. సెక్యూరిటీ కలిపించమని అందరూ వచ్చి అడిగితే.. ఉన్న పోలీసు వ్యవస్థ చాలదని సుప్రీం కోర్టు కామెంట్ చేసింది. 

By
en-us Political News

  
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం జరగనుంది.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
విజయ్ ప్రస్తుతం చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్) లోని నీలాంకరి నివాసంలో ఉంటున్నారు. అక్కడి నుంచి ఆయన సచివాలయం ఉన్న రాజాజీ రోడ్డుకు రోజువారీ ప్రయాణం చేస్తున్నారు.
భౌగోళికంగా, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోయినా, భాష, సంస్కృతి పరంగా తెలుగు ప్రజల మధ్య బంధం విడదీయరానిదని అన్నారు. తెలుగు సినిమా రంగానికి ప్రజలను ఏకం చేసే అద్భుతమైన శక్తి ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు.
తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ నేతల సమావేశం ఉద్రిక్తంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి.
తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.
సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
తెలంగాణ షాబాద్ లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ కు, సొంత బాబాయిపై గొడ్డలి వేటు, సొంత తల్లీ, చెల్లిని గెంటేసిన జగన్ కూ మనస్తత్వ పరంగా పోలీకలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరిశ్రమల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఇలా కారుచౌకగా కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, భూములు పొందిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశ్రమ పెట్టకపోగా, ఈ ప్రభుత్వ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపు 350 కోట్ల రూపాయల మేర రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
ముందస్తు ఎన్నికల ప్రచారాలపైనా సీఎం స్పష్టత ఇచ్చారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరో ఏదో అనుకున్నారని తాము ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.