కేసీఆర్ సారూ.. తెలంగాణలో బాధితులు లేరా?

Publish Date:Sep 1, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలో బాధితులే లేరన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో అంతా భేషుగ్గా ఉంది. ప్రజలకు సమస్యలే లేవు.. కానీ పాపం ఇతర రాష్ట్రాలలో జనం నానా ఇబ్బందులూ పడుతున్నారు. మిగులు రెవెన్యూ ఉన్న రాష్ట్రాంగా, సమస్యలే లేని రాష్ట్రంగా వారిని ఆదుకోవలసిన బాధ్యత తెలంగాణదే, అంటే తనదే అన్నట్లుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఆయన బీహార్ వెళ్లారు. అక్కడ గాల్వాన్ అమరుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే సికిందరాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన బీహార్ వలస కూలీల కుటుంబాలనూ పరామర్శించి వారికీ నష్టపరిహారం ఇచ్చారు. అదే సమయంలో ఇక్కడ తెలంగాణలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు కన్నుమూస్తే వారి కుటుంబాలను పరామర్శించడానికి మాత్రం కేసీఆర్ కు మనసు రాలేదో లేక తీరిక దొరకలేదో అర్ధంకాదు కానీ ఆయన మాత్రం బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. ఐదు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు. గతంలోనూ ఇలాగే జరిగింది. ఆయన పంజాబ్ వెళ్లారు. అక్కడా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అంద జేశారు.

ఆ సొమ్ములేవీ కేసీఆర్ జేబులోంచో, కుటుంబ ఆస్తులు అమ్మో ఇచ్చిన సొమ్ములు కాదు. తెలంగాణ ప్రజల నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేసిన పన్నుల నుంచి ఇచ్చినవి. ఆ సొమ్ములపై తొలుత అధికారం తెలంగాణలోని బాధిత ప్రజలదే. రాష్ట్రంలో ప్రజలను వారి కష్టాలకు, వారి నష్టాలకూ వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్లి సొమ్ములు పంపిణీ చేసి తన ప్రతిష్టను పెంచుకోవాలని కేసీఆర్ చూస్తున్నారన్న విమక్షాల విమర్శలను జనం కూడా సమర్థిస్తున్నది అందుకే. రాష్ట్రాన్ని గాలికొదిలేసి జాతీయంగా ఓ పెద్ద నాయకుడిగా ఎదగాలన్న కేసీఆర్ ప్రయత్నాన్ని ప్రజలు కూడా హర్షించడం లేదు. ముందు రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దాలని వారు కోరుతున్నారు.

తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని సాక్షాత్తూ రాష్ట్ర పోలీసుల నివేదికలే స్పష్టం చేస్తున్నాయి.  అటువంటిది రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దాల్సింది పోయి.. ఇతర రాష్ట్రాలలో ప్రజలను ఉద్ధరించడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందట సామెతగా అభివర్ణిస్తూ పరిశీలకులు సైతం తప్పుపడుతున్నారు.

గతంలో  కొండగట్టు వద్ద బస్సు బోల్తా పడి పలువురు మరణించిన సందర్భంలో బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి సాయంఅందించలేదు. కేసీఆర్ బాధి కుటుంబాలను పరామర్శించలేదు. ఇప్పుడు కేసీఆర్ బీహార్ పర్యటన సమయంలో ప్రజలు నాటి సంఘటనను గుర్తు చేసుకుని తెలంగాణ ప్రజలు ప్రజలు కారా?  వారి బాధలు బాధలు కావా.. లేక రాష్ట్రంలో బాధితులకు చేసిన సాయం గురించి దేశంలో పెద్దగా మాట్లాడుకోరన్న భావమా అంటూ కేసీఆర్ వైఖరిని తప్పుపడుతున్నారు. జాతీయ స్థాయిలో తనకు గుర్తింపు కోసం ప్రజాధనాన్ని వాదించుకుంటున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదే సందర్భంలో  దేశవ్యాప్తంగా అన్ని పత్రికలలో భాషతో, వాటి సర్క్యలేషన్ తో సంబంధం లేకుండా పేజీలకు పేజీలు ప్రకటనలు ఇవ్వడాన్ని వారీ సందర్భంగా ప్రస్తావించి కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ప్రజా ధనాన్ని దుబారా చేస్తున్నారని విమర్శిస్తున్నారు.  

By
en-us Political News

  
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.