కూటమిపై ప్రజా వ్యతిరేకత... అధ:పాతాళంలోకి వైసీపీ గ్రాఫ్.!.. పయనీర్ స్ట్రాటజీస్ సర్వే వెల్లడి.!

Publish Date:Jul 30, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి రెండేళ్లయ్యింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. స్థనిక ఎన్నికలు వినా ఇప్పట్లో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం లేదు. అయితే రెండేళ్ల   తెలుగుదేశం కూటమి పాలన పట్ల ప్రజా స్పందన ఎలా ఉంది? ప్రతిపక్ష హోదా లేకున్నా రాష్ట్రంలో ఏకైక విపక్షం గా ఉన్న వైసీపీ పట్ల ప్రజాదరణ ఎలా ఉంది అన్న అంశాలపై  ప్రముఖ పొలిటికల్ రీసెర్చ్ సంస్థ పయనీర్  స్ట్రాటజీస్ తాజాగా ఓ  సర్వే నిర్వహించింది.  ఆ సర్వే ఫలితం ఇటు అధికార కూటమిలోనూ, అటు వైసీపీలోనూ కలకలం రేపుతోంది. 

రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..  రెండేళ్ల పాలనలో తెలుగుదేం కూటమి సర్కార్ పట్ల ప్రజలలో వ్యతిరేకత కనిపిస్తున్నప్పటికీ సునాయాసంగా గతం కంటే ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని సర్వే ఫలితం కుండబద్దలు కొట్టింది. అయితే తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే. 

ఇక వైసీపీ విషయానికి వస్తే.. 40 శాతం ఓటు షేర్, ప్రభుత్వ వ్యతిరేకతే తమను 2029 ఎన్నికలలో అధికారంలో కూర్చోబెడతాయని ధీమా వ్యక్తం చేస్తున్న ఆ పార్టీకి ఈ సర్వే ఫలితం ఊహించని షాక్ ఇచ్చింది. తిరిగి అధికారంలోకి రావడం అటుంచి.. ఆ పార్టీ గ్రాఫ్ ఈ రెండేళ్లలో అధ:పాతాళానికి పడిపోయిందని సర్వే తేల్చింది.   గత ఎన్నికల ఘోర పరాజయం నుండి కోలుకుని తిరిగి పుంజుకుంటామని ఆశిస్తున్న వైపీపీకి  పయనీర్ స్ట్రాటజీన్ సర్వే గట్టి షాక్ ఇచ్చింది.  సర్వే ప్రకారం.. ఈ రెండేళ్లలో క్షేత్రస్థాయిలో వైసీపీ ఓటు బ్యాంకు పుంజుకోవడం అటుంచి ఉన్న ఓటు బ్యాంకు కూడా చాలా వరకూ దూరమైంది.  

పయోనీర్ స్ట్రాటజీ విడుదల చేసిన   గణాంకాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా   అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ సర్వేలో కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలలో ఒకింత వ్యతిరేకత కనిపిస్తున్నా.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలతే వ్యక్త మౌతోంది.  కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన   అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పరిశ్రమల రాక, పెట్టుబడుల ప్రవాహం, అమరావతి, పోలవరం పనులలో వేగం వంటివి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను తోసి రాజని సానుకూలతను తీసుకువచ్చాయి.  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం కూటమి గెలుచుకునే సీట్ల సంఖ్య గతం కంటే ఎక్కువగా ఉంటుంది.  గ్రామీణ, పట్టణ, నగరాలు అన్న తేడా లేకుండా..  యువత, మహిళలు  రైతులు   తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికే జై కొడుతున్నారు.   

ఇక వైసీపీ విషయానికి వస్తే..  గతంలో అధికారాన్ని అనుభవించి, 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలకే పరిమితమయ్యేంతగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైసీపీ పట్ల ఈ రెండేళ్లలో ప్రజలలో ఇసుమంతైనా సానుకూలత కానరావడం లేదని పయనీర్ స్ట్రాటజీస్ సర్వే తేల్చింది. అధికారం కోల్పోయిన తరువాత ఈ రెండేళ్లలో పార్టీ ఇసుమంతైనా పుంజుకోలేదని సర్వే ఫలితం పేర్కొంది. పుంజుకోకపోవడం అటుంచితే.. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే వైసీపీ గత ఎన్నికలలో సాధించిన 11 స్థానాలను నిలుపుకోవడం కూడా కష్టమేనని సర్వే పేర్కొంటున్నది.  అధికారంలో ఉన్న సమయంలో చేసిన పొరపాట్లు, ప్రజావ్యతిరేక నిర్ణయాలు,   నిధుల మళ్లింపు వంటి అంశాలు ఇప్పటికీ ప్రజల జ్ఞాపకాల్లో బలంగా ఉన్నాయని సర్వే పేర్కొంది.   వైసీపీ ఓటు షేర్ మరింత దిగజారిపోవడానికి ఆ పార్టీ వైఖరి, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం, ప్రజా సమస్యలపై  స్పందించకపోవడంతో పాటు.. ఆ పార్టీ అధినేత బెంగళూరు మకాం కూడా కారణం అని సర్వే పేర్కొంది.
 
ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, మరియు రాయలసీమ  ఇలా మూడు ప్రాంతాలలోనూ పయనీర్ స్ట్రాటజీన్ సర్వే చేసింది. ఈ సర్వేలో బయటపడిన మరో విశేషం ఏమిటంటే.. వైసీపీకి పెట్టని కోట వంటి రాయలసీమ ప్రాంతంలో కూడా ఆ పార్టీ ప్రతిష్ట మసకబారింది. సీమ ప్రాంతంలో కూడా తెలుగుదేశం కూటమి వైపు మొగ్గు స్పష్టంగా గోచరిస్తోంది. యువత, నిరుద్యోగులలో ఐటీ ఉద్యోగాల కల్పన, పారిశ్రామిక వేత్తల పెట్టుబడుల పట్ల ఆశావహ దృక్పథం వ్యక్తమవుతుండగా, మహిళలు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం,  ఇతర సంక్షేమ హామీల అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒకప్పుడు వైసీపీకి కొండంత అండగా నిలిచిన గ్రామీణ ఓటర్లు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి నమూనా వైపే మొగ్గు చూపుతున్నారని సర్వే ఫలితం పేర్కొంది.   

ఇక ఈ సర్వే ఓటు శాతం విషయంలో కూడా తెలుగుదేశం కూటమి, వైసీపీల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందని వెల్లడించింది. గత ఎన్నికలలో 40 శాతం ఓటు షేరు మాకుందని చెప్పుకున్న వైసీపీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. 28 శాతం ఓటు షేర్ కు పరిమితమౌతుందని సర్వే తేల్చింది. అదే సమయంలో తెలుగుదేశం కూటమికి 49 శాతం ఓటు షేర్ వస్తుందని పేర్కొంది. కూటమి పాలనపై ఒకింత అసంతృప్తి వ్యక్తమౌతున్నప్పటికీ, వైసీపీపై పెరుగుతున్నవ్యతిరేకత కారణంగా అది లెక్కలోకి రావడం లేదని సర్వే తేల్చింది. 

YCP graph fallen, AP Political Survey, Pioneer Strategy Survey, TDP Alliance Lead, YSRCP Vote Share Drop, AP Politics, TeluguOne

By
en-us Political News

  
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.
తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని   యశ్‌పాల్ సువర్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బిజీ విద్యార్థులు మరియు ఉద్యోగినుల కోసం ఫ్రెష్ లుక్ బ్యూటీ క్లాసెస్ అందిస్తున్న వీకెండ్ బ్యూటీ కోర్సుల వివరాలు. శని, ఆదివారాల్లో మేకప్, స్కిన్‌కేర్ మరియు హెయిర్‌స్టైలింగ్ నేర్చుకుని ప్రొఫెషనల్ బ్యూటీషియన్‌గా మారే సువర్ణ అవకాశం!
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.