తెరాసకు భూసంతర్పణ.. కాక రేపుతున్న జీవో 47.. గవర్నర్ రద్దు చేస్తారా?

Publish Date:May 24, 2022

Advertisement

తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని అనకూడదేమో కానీ, రాజ్ భవన్’తో రాష్ట్ర ప్రభుత్వానికి సత్సంబంధాలు లేవనేది మాత్రం నూటికి నూరు పాళ్ళు నిజం. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం తీరు బాగాలేదని గవర్నర్ స్వయంగా ఆరోపించారు. మరో వంక ప్రభుత్వ వర్గాలు, అధికార పార్టీ నాయకులు. మంత్రులు  గవర్నర్ బీజపీ నాయకురలిలాగా వ్యవహరిస్తున్నారని బహిరంగంగానే ఆరోపణలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు, పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ చేయడం విషయంలో, గవర్నర్, సర్కార్ మధ్య మొదలైన విబేధాలు, డైలీ సీరియల్  లా  గత ఐదారు నెలలుగా అలా సాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్లు గవర్నర్’ ప్రోటోకాల్ విషయంలో ఉల్లంఘనకు పాల్పడింది. చివరకు, గణతంత్ర దినోత్సవం వేడుకల్లో కూడా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలున్నాయి. అంతే కాదు, శాసన సభ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే, సమావేశాలు మొదలయ్యాయి. రాజ భవన్, ప్రగతి భవన్ (ముఖ్యమంత్రి కార్యాలయం) మధ్య వివాదం ఢిల్లీకి చేరింది. గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ స్వయం ఢిల్లీ వెళ్లి , ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రిని అమిత్ షాను కలిసి విషయం వివరించారు.

ప్రభుత్వ పని తీరు మీద ఫిర్యాదు చేశారు.  అదే సందర్భంలో గవర్నర్ తమిళిసై కేసీఆర్ సర్కార్ తీరుపై బహిరంగంగా, మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. తన తల్లి రాజ్‌ భవన్‌ లో చనిపోతే సీఎం చూసేందుకు కూడా రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, వివిధ సందర్బాలలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు తనను ఎలా బాధించింది వివరించారు. భావోద్రేకానికి గురయ్యారు, ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకునే అధికారం ఉన్నప్పటికీ, అలా చేయనని స్పష్టం చేశారు. రాజ్యాంగ బద్ధంగానే తమ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం  చేశారు. 

అయితే ఇప్పుడు, తెరాస ప్రభుత్వం తెరాస పార్టీ హైదరాబాద్ జిల్లా కార్యాలయానికి, హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో కోట్ల రూపాయల విలువచేసే, 4935 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయిస్తూ జారీ చేసిన జీవో ఎం ఎస్ నెంబర్ 47 విషయంలో వివాదం రాజు కుంది. ఇప్పటికే, తెరాస రాష్ట్ర పార్టీ కార్యాలయానికి, అదే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో 2004లోనే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1440 చదరపు గజాల స్థలాన్ని కేటాయించినందున, ఇప్పుడు జీవో ఎం ఎస్ నెంబర్ 47 ద్వారా చేసిన భూకేటాయింపును రద్దు చేయాలని కోరుతూ, అఖిల భారత షెడ్యూలు కులాలు /తెగల సమాఖ్య గవర్నర్’కు విజ్ఞాపన పత్రం సమర్పించింది. ఈ విజ్ఞాపన పత్రంలో సమాఖ్య ఇతర విషయాలతో పాటు. అసలు ఈ జీవోకు గవర్నర్ ఆమోదం ఉన్నదా,లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలనీ కోరింది. జీవోను. తెలంగాణ గవర్నర్ పేరున, గవర్నర్ ఆదేశాల మేరకు జారీ చేసినట్లు’ పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ,సమాఖ్య సదరు భూమిని తెరాస పార్టీకి కేటాయిస్తూ గవర్నర్ లిఖిత పూర్వకంగా, లేదా ఇతరత్రా ఉతర్వులు ఇచ్చరా,అనే విషయాన్ని తెలియ చేయాలని కోరారు. 

ఈ భూమీ కేటాయింపు పై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్త  పరుస్తున్నాయి. పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించేందుకు స్థలం లేదని అంటున్నా ప్రభుత్వం, రూ.100 కోట్ల విలువచేసే భూమిని తెరాస పార్టీకి ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు.  దీంతో ఇప్పుడు ఈ భూ వివాదం గవర్నర్ కోర్టుకు చేరింది. ప్రభుత్వం జారీ చేసే జీవోలు అన్నీ సహజంగా, గవర్నర్ పేరునే జారీ అవుతాయి. అయితే, అన్ని జీవోలు గవర్నర్ దృష్టికి వస్తాయా, రావా అనేది  స్పష్టం కావలసి ఉంది.

అయితే, సాంకేతికంగా గవర్నర్ అనుమతి, ఆదేశాలతోనే  జీవో జారీ అయినా తర్వాత కూడా సదరు జీవో వెనక్కు తీసుకునే అధికారం గవర్నర్ కు ఉంటుందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పడు గవర్నర్  ఏమి చేస్తారు? ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుంది? ఈవివాదం చిలికి చిలికి గాలి వానగా మారుతుందా? రాజకీయ, రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందా, అనేది చూడవలసి వుంది.

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.