గ్రూప్ వన్ మూల్యాంకన తప్పుల తడక.. కోర్టుకు నివేదిక సమర్పించిన సిట్.!

Publish Date:Aug 12, 2026

Advertisement

ఏపీలో  వైకాపా   హయాంలో నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో  అక్రమాలు,   నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ప్రత్యేక దర్యాప్తు బృందం  సిట్  తేల్చింది. ఈ   వ్యవహారంపై దర్యాప్తు జరిపిన సిట్  తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు   నివేదిక  సమర్పించింది. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో  దర్యాప్తు బృందం, మూల్యాంకన ప్రక్రియలో చోటుచేసుకున్న  నిబంధనల ఉల్లంఘనలను, సాంకేతిక,  ఫోరెన్సిక్ ఆధారాలతో సహా ధర్మాసనం ముందుంచింది. 

సిట్ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, ఏపీపీఎస్సీ ప్రాథమిక నియమావళికి  విరుద్ధంగా ఒకే జవాబు పత్రాలను  మూడు విడతలుగా మూల్యాంకనం చేసినట్లు అధికారులు శాస్త్రీయంగా నిర్ధారించారు. డిజిటల్ విధానం, హైలాండ్ రిసార్ట్, అలాగే  విజయవాడ కేంద్రంగా మూడు వేర్వేరు దశల్లో ఈ మూల్యాంకన   సాగిందని నివేదిక పేర్కొంది.

ముఖ్యంగా గ్రూప్ వన్  ఉద్యోగాలకు ఎంపికైన మొత్తం 165 మంది అభ్యర్థులలో   160 మంది జవాబు పత్రాలలో మార్కులకు సంబంధించి మార్పులు, చేర్పులు జరిగాయని సిట్ తేల్చింది. అలాగే ఎంపిక కాని 161 మందికి సంబంధించి 153 మంది పేపర్లలోనూ, న్యాయస్థానాన్ని ఆశ్రయించిన 405 మంది రిట్ పిటిషనర్ల జవాబు పత్రాలలోనూ  వ్యత్యాసాలు చోటుచేసుకున్నట్లు సిట్  దర్యాప్తులో తేల్చింది. 

ఫోరెన్సిక్ తనిఖీలలో చీఫ్ ఎగ్జామినర్లు నేరుగా మార్కులను దిద్దడం, మార్పులు చేయడం వంటి చర్యలకు పాల్పడినట్లు రాతపూర్వక ఆధారాలు లభించాయని సిట్ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. దర్యాప్తు సమయంలో 61 జవాబు పత్రాల స్లిప్పులపై వైట్ కరెక్షన్ ఫ్లూయిడ్  ఉపయోగించినట్లు ఫోరెన్సిక్ నిపుణులు  గుర్తించారు. దీనికి తోడు  భద్రంగా ఉంచాల్సిన పరీక్ష పత్రాలను 84 రోజుల పాటు విజయవాడ సమీపంలోని ఒక రిసార్ట్‌లో ఉంచినట్లు దర్యాప్తులో తేలింది. నిబంధనల ప్రకారం మూల్యాంకనం కోసం అందుబాటులో ఉంచాల్సిన 452 మంది అర్హులైన నిపుణుల ప్యానెల్‌ను పూర్తిగా పక్కనబెట్టి,  66 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ల సహాయంతోనే ఈ మూల్యాంకన ప్రక్రియను నడిపించారని సిట్ పేర్కొంది. 

 మూడోసారి అనధికారికంగా మూల్యాంకనం జరిపేందుకు కొత్తగా   బార్‌కోడ్ షీట్లను ప్రత్యేకంగా ముద్రించినట్లు సిట్ తన నివేదికలో  పేర్కొంది. నిబంధనల ప్రకారం ఒకసారి మూల్యాంకనం పూర్తయిన తర్వాత ఇలా మళ్లీ మళ్లీ పేపర్లను దిద్దడం చట్టవిరుద్ధమని సిట్ కోర్టుకు తెలిపింది. ఈ వ్యవహారంలో పారదర్శకత   లోపించిందని, ఫోరెన్సిక్ ఆధారాలతో సహా దాదాపు 173 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి హైకోర్టుకు అందజేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. సుమారు 736 మంది అభ్యర్థుల జవాబు పత్రాలకు సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయిందని, మిగిలిన కొద్దిమంది నివేదికలను   త్వరలోనే అందజేస్తామని సిట్ పేర్కొంది.  కాగా అభ్యర్థుల తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు సిట్ సమర్పించిన   నివేదిక ప్రతులను తమకు అందించాలని కోర్టును కోరారు. దానికి అంగీకరించిన హైకోర్టు బెంచ్, నివేదిక ప్రతులను అందుబాటులో ఉంచాలని రిజిస్ట్రార్‌ను ఆదేశిస్తూ కేసు విచారణను వాయిదా వేసింది.   

APPSC Group 1 Evaluation Irregularities, AP High Court Group1,  SIT Report, AP High Court, Andhra Pradesh SIT Report, TeluguOne 

By
en-us Political News

  
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.