వివేక హత్యకు 3 రోజుల ముహూర్తం!.. కుక్క‌ను కూడా లేపేయాల‌ని కండీష‌న్‌!

Publish Date:Mar 17, 2022

Advertisement

కడప మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు నిందితులు గట్టి ప్రణాళికే వేసినట్లున్నారు. రాజకీయంగా తన ఎదుగుదలకు మోకాలడ్డుతున్న వివేకా అడ్డు తొలగించుకునేందుకు హత్య వెనుక సూత్రధారులు క్షణక్షణానికీ పకడ్బందీగా ప్లాన్ లు సిద్ధం చేసుకున్నట్లే కనిపిస్తోంది. వివేకాను ఈ భూమ్మీద లేకుండా చేసే క్రమంలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరినీ వాడేసుకున్నారని అర్థం అవుతోంది. అది వివేకా మాజీ కారు డ్రైవర్ షేక్ దస్తగిరి కావచ్చు.. వివేకా పర్సనల్ అసిస్టెంట్ కృష్ణారెడ్డి కావచ్చు.. వివేకా అంటే కోపంతో ఉన్న సునీల్ యాదవ్ కావచ్చు, ఎర్ర గంగిరెడ్డి కావచ్చు, ఉమాశంకర్ రెడ్డి అయినా కావచ్చు.. ఇలా ఏ ఒక్కరితో పని పూర్తవుతుందో అలా అందర్నీ వాడేశారని, అందుకు కోట్లకు కోట్లు డబ్బు ఎరవేసినట్లు దస్తగిరి పులివెందుల కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం ద్వారా వెల్లడవుతోందని అంటున్నారు. 2019 మార్చి 13, 14, 15 తేదీల్లోనే వివేకాకు స్పాట్ పెట్టేయాలని బలంగా నిర్ణయించుకున్నారట. ఈ విషయం వివేకా మాజీ డ్రైవర్ షేక్ దస్తగిరి పులివెందుల కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం బయటకు వచ్చింది. దీన్ని బట్టి చూస్తే వివేకా హత్యకు ఎంత పకడ్బందీగా తారీఖులు, సమయాలతో సహా నిందితులు ప్లాన్ చేశారో అర్థం అవుతోంది.

వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి  2022 ఫిబ్రవరి 21న పులివెందుల ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో ఏం ఉందంటే.. వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వద్ద నైట్ వాచ్ మన్ పి.రాజశేఖర్ 2019 మార్చి 13, 14, 15 తేదీల్లో కాణిపాకం వెళ్తున్నట్లు వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ఎర్ర గంగిరెడ్డికి సమాచారం ఇచ్చారట. వివేకానందరెడ్డికి నమ్మిన బంటు అయిన రాజశేఖర్ కానీ, వివేకా పెంపుడు కుక్క జిమ్మి కానీ ఉంటే తాము వేసిన వివేకా మర్డర్ ప్లాన్ అమలు చేయడం సాధ్యం కాదని డిసైడ్ అయ్యారట. అందుకే నైట్ వాచ్ మన్ రాజశేఖర్ కాణిపాకం వెళ్లే ఆ మూడు రోజుల్లోనే వివేకాను అంతం చేయాలని నిందితులకు ఆదేశించారట. దాంతో పాటు పెంపుడు కుక్క జిమ్మీని కూడా చంపేయాలని నిర్ణయించారట. అందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని దస్తగిరితో, సునీల్ యాదవ్ తో, ఉమాశంకర్ రెడ్డితో ఎర్ర గంగిరెడ్డి చెప్పారట.

వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో 2019 ఫిబ్రవరి 10నే ప్లాన్ రూపొందించినట్లు దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొనడం గమనార్హం. అయితే.. వివేకా ఇంట్లోకి వెళ్లాలంటే నైట్ వాచ్ మన్ రాజశేఖర్, కుక్క జిమ్మి ఉంటే సాధ్యం కాదని తాను ఆ సందర్భంగానే ఎర్ర గంగిరెడ్డితో చెప్పినట్లు దస్తగిరి వెల్లడించాడట. అయితే.. వివేకా పీఏ కృష్ణారెడ్డితో మాట్లాడి, వాచ్ మన్ ను స్పాట్ లో లేకుండా చేస్తానని గంగిరెడ్డి దస్తగిరితో చెప్పాడట. ఇక మార్చి 1వ తేదీ నుంచి గంగిరెడ్డి వివేకా వెంటే ఉన్నాడని దస్తగిరి వెల్లడించాడు. వివేకా ఎప్పుడు, ఎక్కడికి వెళ్తున్నారో సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డికి, తనకు గంగిరెడ్డి సమాచారం చెప్పేవాడని తెలిపాడు. అంటే వివేకాను హత్య చేయడానికి చాలా రోజుల ముందు నుంచే ఓ క్రమబద్ధమైన ప్రణాళికతో నిందితులు ముందుకు వెళ్లినట్లు అర్థం అవుతోందంటున్నారు.

వివేకానందరెడ్డిని చంపేయాలని ఎర్ర గంగిరెడ్డి చెప్పిన రెండు మూడు రోజుల తర్వాత సునీల్ యాదవ్ తనకు కోటి రూపాయలు ఇచ్చాడని దస్తగిరి వాంగ్మూలంలో చెప్పడం గమనార్హం. అంటే కోట్లాది రూపాయలు ఈ కేసులో చేతులు మారాయన్నది సుస్పష్టం అవుతోంది కదా. అంత డబ్బు ఎవరు ఇచ్చారని తాను సునీల్ యాదవ్ ను అడిగితే.. ఎర్ర గంగిరెడ్డికి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇస్తే .. తనకు గంగిరెడ్డి ఇచ్చినట్లు చెప్పాడని తెలిపాడు. ఆ తర్వాత వివేకాను చంపాలా? వద్దా అని నిర్ధారించుకునేందుకు తాను సునీల్ యాదవ్ ను సంప్రదించానన్నాడు. ఆ తర్వాత తనను ఎర్ర గంగిరెడ్డి ఇంటికి సునీల్ యాదవ్ తీసుకెళ్లి, శివశంకర్ రెడ్డికి ఫోన్ చేశాడట. శివశంకర్ రెడ్డి తనతో ఫోన్లో మాట్లాడుతూ.. ‘ఎర్ర గంగిరెడ్డి ఎలా చెబితే అలా చేయండి.. మేం ఉన్నామని చెప్పాం కదా.. మళ్లీ అనుమానం ఎందుకు?’ అని ప్రశ్నించినట్లు చెప్పినట్లు దస్తగిరి చెప్పడాన్ని చూస్తే వివేకా హత్యలో ఒక్కొక్కరి ప్రమేయం ఎంతలా ఉందో చెప్పకనే చెబుతోందని అంటున్నారు.

సీబీఐ చేతికి కేసు దర్యాప్తు వెళ్లింది. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి,తాను ఈశ్వరయ్యతోటలో వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని కలిశామన్నాడు దస్తగిరి. తమ పరిస్థితి ఏంటని అడిగామన్నాడు. ‘మేం చూసుకుంటాంలే.. ఇబ్బంది లేదు డబ్బులు ఏమైనా కావాలా?’ అని వారు అడిగారని చెప్పడం చూస్తుంటే.. కోటి రూపాయలు సునీల్ యాదవ్ తో పంపడమే కాకుండా ఇంకా ఎంత డబ్బయినా వెదజల్లేందుకు వారు రెడీ అయ్యారనే విషయం తేటతెల్లం అవుతోంది. సీబీఐ ఇచ్చిన నోటీసు తీసుకుని బయపురెడ్డి ఇంట్లో శివశంకర్ రెడ్డిని దస్తగిరి కలిశాడట. ‘సీబీఐ వాళ్లు ఎంత కొట్టినా తమ పేర్లు బయటపెట్టొద్దు. కావాల్సినంత డబ్బిస్తాం. జీవితం సెటిల్ చేస్తాం’ అని చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలంలో తెలిపాడు.

ఢిల్లీలో సీబీఐ వారికి తాను నిజం చెప్పలేదని, అక్కడి నుంచి వచ్చిన తర్వాత సీబీఐ అధికారుల విచారణలో చెప్పానని దస్తగిరి తన వాంగ్మూలంలో వెల్లడించడం గమనార్హం. తర్వాత భరత్ యాదవ్, శివశంకర్ రెడ్డి దస్తగిరిని కలిసి వాంగ్మూలంలో ఏం చెప్పావని ఆరా తీశారట. ప్రాణభయంతో తాను వారికి నిజం చెప్పలేదన్నాడు. ఆ తర్వాత ఓ రోజు అవినాష్ రెడ్డి తోట వద్దకు రమ్మంటూ తనను భరత్ యాదవ్ పిలిచినట్లు చెప్పాడు. భరత్ యాదవ్, పులివెందులకు చెందని లాయర్ ఓబుల్ రెడ్డి తనను హెలిప్యాడ్ దగ్గరకు రమ్మని పిలవడంతో తాను వెళ్లానని దస్తగిరి తెలిపాడు. ‘నువ్వు జడ్జి ఎదుట ఇచ్చిన వాంగ్మూలం యధాతథంగా నాతో  చెప్పు’ అని ఓబుల్ రెడ్డి అడిగినట్లు చెప్పాడు. ఆ తర్వాత జాగ్రత్తగా మసులుకో.. అనవసరపు మాటలు మాట్లాడొద్దని ఓబుల్ రెడ్డి హెచ్చరించాడట. అంటే హత్య కుట్ర వెనుక ఉన్న పెద్దలెవరి విషయం బయటకు పొక్కినా దస్తగిరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయనే వార్నింగ్ లాయర్ ఓబుల్ రెడ్డి మాటల్లో ఉండడం గమనించదగ్గ విషయం. తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని పులివెందులలో సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి తరఫు లాయర్లు బహిర్గతం చేశారట. దీంతో భరత్ తన ఇంటికి వచ్చి మరీ.. ‘నువ్వు వాళ్ల మీద చెప్పి చాలా పెద్ద తప్పు చేశావు.. వాళ్లు నిన్ను వదలరు. చంపేస్తారు.. చెప్పిందంతా అబద్ధమని ప్రెస్ మీట్ పెట్టి చెప్పా’లని హెచ్చరించాడట. అంటే వివేకా హత్య కేసులో నిందితులు ఎంత పకడ్బందీగా పావులో కదిపారో చెప్పకనే చెబుతోంది.

వివేకా హత్య కేసు కథ, స్క్రీన్ ప్లే మొత్తం కుట్ర వెనుక ఉన్న పెద్దల ప్రోద్బలంతోనే నడిచినట్లు అర్థం అవుతోందని అంటున్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ తుది దశకు తీసుకొచ్చిందని తెలుస్తోంది. ఈ హత్య కేసులో పాత్రధారులు తెలిసినా.. సూత్రధారులు, కథ మొత్తం నడిపించిన వారెవరన్నదే తెలియాల్సి ఉంది. తెర వెనుక ఇంత కథ నడిపించిన వారెవరో సీబీఐ తేల్చేస్తుందా? అసలైన నిందితులపై చర్యలు ఉంటాయా? అనేది వేచి చూడాల్సి ఉంది.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.