ఏపీలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

Publish Date:Jan 15, 2025

Advertisement

జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక భయంలో బతికారు. జగన్ అరాచక పాలనలో  ఏ వర్గమూ స్వేచ్ఛగా, ప్రశాంతంగా జీవించ లేని పరిస్ధితి ఉంది. ఇష్టారీతిగా దోపిడీ, దౌర్జన్యాల పర్వం సాగింది. గత ఏడాది జరిగిన ఎన్నికలలో  వైసీపీ ఘోర పరాయాన్ని మూటగట్టుకుని గద్దె దిగడం, తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో ప్రగతి పరుగులు పెడుతోంది. ప్రజల ప్రయోజనాలు, సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతున్నది. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లుగా ఏదో నామ్ కే వాస్తే అన్నట్లుగా జరిగిన సంక్రాంతి సంబరాలు ఈ సారి  మిన్నంటాయి.  సంక్రాంతి అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది గంగిరెద్దుల ఆటలు, రంగురంగుల రంగవల్లులతో కళకళలాడే లోగిళ్లు, గొబ్బెమ్మలు. ఇవన్నీ ఈ ఏడాది మరింత కళకళలాడాయి.  పండుగ మూడు రోజులూ  ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల్లో  కోడిపందేలు జోరుగా సాగాయి.  

వీటిని తిలకించడానికి లక్షల సంఖ్యలో అతిధులు వచ్చారు. ఏటా తెలుగు లోగిళ్లలోని సంక్రాంతి సంబురాలు, కోడి పందేలను తిలకించడానికి వేల సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి జనం తరలి వచ్చే వారు. అయితే ఈ ఏడాది ఆ సంఖ్య లక్షల్లో ఉంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పుణె వంటి నగరాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ ఆంధ్రప్రదేశ్ కు పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. అదే విధంగా ఇతర రాష్ట్రాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఈ సారి వారి స్వగ్రామాలకు కుటుంబ సమేతంగా తరలిరావడమే కాకుండా వారితో పాటు వారి స్నేహితులను కూడా తీసుకువచ్చారు.  ఇలా వచ్చే అతిథుల విడిది కోసం స్థానికులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇటువంటి పరిస్థతి ఇదే తొలిసారని చెబుతున్నారు.   

సంక్రాంతి అనగానే కోడి పందేలు వేయడం, పోలీసులు రావడం, పందేలు వేసే వారిని, పై పందేలు కాసే వారిని తరిమి పట్టుకోవడం ఇప్పటి వరకు చూశాము.   ఈ సారి పోలీసులు కోడి పందేల బరుల వద్ద   కనిపించలేదు. పండుగ ముందు కొన్ని ప్రాంతాలలో పోలీసులు ఒకింత హడావుడి చేసినా పండుగ రోజుల్లో మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ సారి గతానికి భిన్నంగా కోడి పందేలను తిలకించేందుకు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో రావడం విశేషం. కొన్ని చోట్ల వారు కూడా పందేలలో పాల్గొన్నారు.     

ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి చెందిన వీర మహిళలు  కోడి పందేల బరుల నిర్వాహకులుగా మారారు. వీరు బరులు ఏర్పాటు చేస్తే మగవారు నిర్వహణ బాధ్యతలు చూశారు.   కోడి పందేల బరులతో పాటు చాలా గ్రామాల్లో  రికార్డింగ్ డ్యాన్స్ లు హోరెత్తాయి. రాయలసీమ ప్రాంతం నుంచి వేల సంఖ్యలో గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలు చేసేందుకు వెళ్లారు. ఉమ్మడి అనంతపురం, వైఎస్ఆర్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి కూడా వేల సంఖ్యలో వెళ్లారు.  

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.