పెట్టుబడుల రాకతో ఏపీ ఆదాయానికి బూస్ట్

Publish Date:Oct 12, 2025

Advertisement

ప్రపంచ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గమ్యస్థానంగా మారిందా అంటే.. పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. అలాగే పరిశ్రమలు, పెట్టుబడులూ ఒకే చోట కేంద్రీకృతం కాకుండా.. రాష్ట్రం నలుమూలలా విస్తరించేలా తెలుగుదేశం కూటమి సర్కార్ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నది. ఆ కారణంగానే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి. డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు, ఎలక్ట్రానికి పరిశ్రమలు.. ఇలా ఒకటనేమిటి.. పలు పరిశ్రమలు ఏపీలో అడుగుపెడుతున్నాయి పెట్టుబడులు, పరిశ్రమల రాకవల్ల రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అందులో సందేహం లేదు.

కానీ ఆ ప్రయోజనం అంతటితో ఆగదు.. పెట్టుబడుల రాకవల్ల రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. పెరుగుతోంది.  ఈ పెట్టుబడుల్లో 30శాతం పన్నుల రూపంలో రాష్ట్ర ఆదాయానికి జమ అవుతుంది.రాష్ట్రంలో వివిధ సంస్థలు ఇప్పుడు కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. దాని వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. విశాఖలో గూగుల్ డేటాసెంటర్ రాకతో ఏపీకి దాదాపుగా పదివేల కోట్ల ఆదాయం వస్తుంది. 

అలాగే ఇతర పరిశ్రమల రాకవల్ల కూడా. అందుకోసమే.. రాష్ట్రంలోకి పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు.. అన్ని రాష్ట్రాలూ కూడా తమ తమరాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టి, పరిశ్రమలు స్థాపించడానికి వచ్చే వారికి ప్రోత్సహకాలు ఇస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే చేస్తున్నది. అయితే రాష్ట్రంలో పెట్టుబడులకే పారిశ్రమిక వేత్తలు ఆసక్తి చూపడానికి కారణమేంటంటే.. ఇక్కడ ప్రభుత్వాధినేతగా ఉన్న చంద్రబాబుపై విశ్వసనీయత, పారిశ్రామిక అబివృద్ధికి దోహదపడటంలో ఆయనకు ఉన్న విశ్వసనీయత కారణంగా చెప్పవచ్చు. 

ఇక పరిశ్రమలు గ్రౌండ్ అయిన తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి నిరంతరంగా ఆదాయం వస్తూనే ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే.. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చిన తరువాత.. మొత్తం తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరు ఆ నగరమే కావడమే. ఇక అనంతపురంలో కియా పరిశ్రమ వల్ల ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం, నిరంతరాయంగా వస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన రాయతీల కంటే ఎన్నో రెట్లు అధికంగా ఆ ఆదాయం ఉంటుంది.  తమ ఉత్తత్తులపై పన్నులు, ఇతర పన్నులు అన్నీ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేవే.  అందుకే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన ట్రాక్ రికార్డ్, గుడ్ విల్ కారణంగా పెట్టుబడిదారులు ఏపీవైపు చూస్తున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
కన్యాకుమారి యూట్యూబర్ ఇంట్లో ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారం, భారీగా నగదు చోరీకి గురయ్యాయి. సోషల్ మీడియాలో రీల్స్ కోసం చూపించిన సంపదే దొంగలను ఆకర్షించిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.