ఏపీలో పోలింగ్ రోజే ఫలితం వచ్చేసింది!
Publish Date:May 14, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం పోలింగ్ రోజే వెల్లడైపోయింది. ఓటరు ఉత్సాహంలో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను విస్పష్టంగా కనిపించింది. దేశ, విదేశాల నుంచి అనేక వ్యయ ప్రయాసలకోర్చి మరీ వచ్చి తమ ఓటు హక్కను వినియోగించుకున్న ప్రజలు. ప్రలోభాలు కాదు, తమకు రాష్ట్ర ప్రగతి, పురోభివృద్ధి ముఖ్యమని విస్పష్టంగా చాటారు. నిజమే సోమవారం ఆంధ్రప్ర ఎన్నడూ లేని విధంగా విదేశాల నుంచి, దేశంలోని వివిధ రాష్ట్రాలలో స్థిరపడిన ఆంధ్రులు లక్షల సంఖ్యలో సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా ఇరుగు పొరుగు రాష్ట్రాలలో స్థిరపడిన ఆంధ్రులు లక్షల సంఖ్యలో రాష్ట్రానికి వచ్చి తమ స్వస్థలాలలో క్యూలో నిలుచుని మరీ ఓటు వేశారు. సోమవారం మధ్యాహ్నం కూడా రైళ్లలో బస్సుల్లో పొరుగు రాష్ట్రాల నుంచి ఓటు హక్కు వినియోగించుకు తీరాలన్న పట్టుదలతో వస్తున్న జనంలో ఓటింగ్ సమయానికి చేరుకుంటామా లేదా అన్న ఆత్రుత, ఆందోళన కనిపించిందంటే రాష్ట్రంలో మార్పు కోసం, రాష్ట్రం ప్రగతి కోసం వారెంతగా తహతహలాడుతున్నారో అర్ధమౌతున్నది. గత ఐదేళ్లుగా వైసీపి పాలనలో నరకం చూసిన జనం ఈ ఎన్నికల కోసమే చకోర పక్షుల్లా ఎదురు చూశారు. ‘ఎన్నికల కోసం ఓటరు ఎదురు చూపు’ అనే శీర్షికన తెలుగువన్ గత ఏడాది సెప్టెంబర్ లోనే చెప్పింది. చివరకు అదే జరిగింది. ఎన్నికల రోజు జనం ఓటెత్తారు. సోమవారం (మే13) తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి క్యూలలో నిలుచున్నారు. రాత్రి పొద్దు పోయిన తరువాత కూడా వేల మంది పోలింగ్ బూత్ ల వద్ద తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలలో నిలుచుని ఉండటం కనిపించింది. రాత్రి 11 గంటల వరకూ కూడా దాదాపు 3500 పోలింగ్ బూత్ ల వద్ద ప్రజలు క్యూలైన్ లో ఉండటం కనిపించింది. ఈవీఎంలు మొరాయించినా జనం విసిగి వెళ్లిపోలేదు. గంటల తరబడి పోలింగ్ బూత్ ల వద్దే క్యూలైన్ లో నిలబడి ఓటు వేశారు. ఎన్నికల సంఘం ఈ సారి 80శాతానికి మించి పోలింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఇక అనంతపురం, అన్నమయ్య, పల్నాడు జిల్లాలలో వైసీపీ అరాచకత్వం పరాకాష్టకు చేరినా జనం మాత్రం అదరలేదు, బెదరలేదు. కసితో ఓట్లు వేయడానికి వచ్చిన్నట్లు వచ్చి ఓట్లు వేస్తూనే ఉన్నారు. అల్లర్లు, దాడులకు టిడిపి, వైసీపిలు పరస్పరం ఆరోపించుకున్నాయి. ఈ అల్లర్లు, విధ్వంసం వైసీపి ఓటమిని సూచిస్తుంటే, పెరిగిన పోలింగ్ శాతం టిడిపి, జనసేన, బీజేపీల విజయాన్ని సూచిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ap-result-came-on-poling-day-itself-39-175916.html