Publish Date:Nov 16, 2024
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేకు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పూర్తిగా సహకరించారు. మొత్తం 8 పేజీల్లో 75 ప్రశ్నలతో కూడిన ఫామ్ ను ఆమె ఎంతో ఓపికగా నింపారు. కులగణను బిఆర్ఎస్ మొదట్నుంచి వ్యతిరేకిస్తుంది.
Publish Date:Nov 16, 2024
మావోయిస్టులు మరణించారు. భద్రతా బలగాలలో ఇద్దరు గాయపడ్డారు కంకేర్ నారాయణపూర్ జిల్లా సరిహద్దులోని మాద్ ప్రాంతంలో నక్సల్స్ భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Publish Date:Nov 16, 2024
మహరాష్ట్ర ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహరాష్ట్రలో ఈ నెల 20న పోలింగ్ ఉంది. ఈ నెల 23న ఓట్ల లెక్కింపు ఉంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి అదే రోజు కౌంటింగ్ జరగనుంది
Publish Date:Nov 16, 2024
మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. డబ్బు ప్రవాహాన్ని ఆపడానికి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అనుమానం వస్తే తనిఖీల విషయంలో ఎటువంటి మొహమాటానికీ తావివ్వడం లేదు.
Publish Date:Nov 16, 2024
నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో హస్తిన పర్యటనకు వెళ్లారంటే.. కచ్చితంగా ఆయన కేంద్రం నుంచీ రాష్ట్రానికి ఏదో ఒక ప్రయోజనం సాధించుకు వస్తారు. ఇది ఆయన ప్రత్యర్థులు కూడా అంగీకరించే వాస్తవం.
Publish Date:Nov 16, 2024
అమృత్ పథకంలో కుంభకోణంపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశానంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు చేసిందంతా ఒట్టుట్టి హడావుడేనా? ఆయనకు అసలు కేంద్ర మంత్రి అప్పాయింట్ మెంటే దక్కలేదా? అంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఔననే అంటున్నారు. ఒక్క కాంగ్రెస్ నేతలే కాదు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా అదే చెబుతున్నారు.
Publish Date:Nov 16, 2024
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో రాజకీయ నాయకుడికి నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు జైపాల్ యాదవ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.
Publish Date:Nov 16, 2024
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తినాయుడు కన్నుమూశారు. దీర్ఘకాల అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం ఆయన పరిస్థితి విషమించి కార్డియాక్ అరెస్ట్‌తో తుది శ్వాస విడిచారు.
Publish Date:Nov 16, 2024
కడన ఎంపీ, వైఎస్ అవినాష్ రెడ్డి పీకల్లోతు చిక్కుల్లో ఇరుక్కున్నారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల విషయంలో యమా సీరియస్ గా ఉన్న పోలీసులు ఆ అసభ్య పోస్టులు పెట్టిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు.
Publish Date:Nov 16, 2024
ఎపిలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ల అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు టిడిపి నేతలే టార్గెట్ గా వైసీపీ సోషల్ మీడియా చెలరేగిపోయింది
Publish Date:Nov 16, 2024
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలో యమా బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్ర అవసరాలు ఆకాంక్షలను తెలియజేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.
Publish Date:Nov 15, 2024
అసెంబ్లీలో తెలుగుదేశం కూటమి సర్కార్ అవాస్తవాలు చెబుతోందనీ, తప్పుడు ప్రచారం చేస్తోందనీ జగన్ మీడియా సమావేశంలో చెప్పుకున్నారు. అయితే చంద్రబాబు అలాంటి అనుమానాలేమైనా ఉంటే అసెంబ్లీకి వస్తే రికార్డులతో సహా వివరిస్తామని ప్రతి సవాల్ విసిరారు.
Publish Date:Nov 15, 2024
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెలలో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. విశాఖ జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన కోసం ఆయన ఆంధ్రప్రదేశ్ రానున్నారు.