జగన్ సర్కార్ కు ఎదురు గాలి.. ఒక్క ఛాన్స్ కథ కంచికే 

Publish Date:Dec 11, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయా? ఇంతకాలం ఒక లెక్క ఇప్పుడు ఇంకొక లెక్క అన్నట్లుగా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలు తెర మీదకు వస్తున్నాయా, జనంతో జగన్ సర్కార్ర్ హనీమూన్ ముగిసినట్లేనా, అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గడచిన రెండున్నర సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా ప్రజలు చాలా వరకు చూసి చూడనట్లు వదిలేశారు. అంతగా పట్టించుకోలేదు. 

మరో వంక సంక్షేమ పధకాల మాటున ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తూ వచ్చింది. రాజకీయ ప్రత్యర్ధులపై దాడులు చేస్తూ అణచివేత విధానాలతో ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా రాజ్యాంగ విలువలను దోసి రాజని నియంత పాలన సాగిస్తోంది. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ప్రజలు జగన్ ప్రభుత్వం నిజరూపాన్ని కొంచెం ఆలస్యంగానే అయినా గుర్తించారు. మరో వంక ఆర్థిక  క్రమ శిక్షణను పూర్తిగా గాలికి వదిలేసి, రాష్ట్రాన్ని దేశానికే అప్పుల రాజదానిగా చేసిన ప్రభుత్వం, ఖాళీ ఖజానాను నింపుకునేందుకు జనం మీద మోయలేని భారం మోపుతోంది. ఒక చేత్తో ఇచ్చినట్లే ఇచ్చి రెండు చేతులతో జనం జేబులు ఖాళీ చేస్తోందనే అభిప్రాయం రోజు రోజుకు పెరిగి పోతోంది. 

నిజానికి జగన్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచి కూడా చేస్తున్నది అదే, అయితే,ఇంతకాలం  దొరికిన కాడికి అప్పులు చేసి  ప్రజలకు నొప్పి తెలియకుండా అప్పుల భారం నెత్తికి ఎత్తింది. అలాగే ఆస్తులు అమ్మి, కుదువ పెట్టి, అప్పులు చేసింది. ఈ రెండున్నర ఏళ్లలో జగన్ రెడ్డి మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది.ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి ఒక్కని నెత్తిన రూ. 5 లక్షలకు పైగానే అప్పు ఉందని అంచనా. మరో వంక సుమారు, రూ.70 వేల కోట్లకు పైబడిన ప్రభుత్వ ఆస్తులను కుదవ పెట్టి మరీ అప్పులు తెచ్చిందని అధికార వర్గాల సమాచారం. అలాగని పన్నుల భారం తక్కువ అని కాదు. ప్రస్తుత 2021-22 వార్షిక బడ్జెట్’ లో గతసంవత్సరం కంటే  రూ. 27 వేల 900 కోట్లు అదనపు పన్నులు కలిపి మొత్తం రూ.85,280.53కోట్ల పన్నులను ప్రతిపాదించారు. అదిగాక, ఇప్పుడు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో కోట్ల రూపాయల భారం  ప్రజల నెత్తిన మోపుతున్నారు. 

ఒక్క ఛాన్స్ అని వేడుకుంటూ ఆధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, ఇపుడు వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీపీ) ఒకే ఒక్క దెబ్బతో పేదల నడ్డి విరిచేందుకు సిద్ధమయ్యారు. అదే విధంగా బస్సు చార్జీలు, విద్యుత్ చార్జీలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రభుత్వం అదనపు ఆదాయం సమకూర్చు కుంటోంది. ఇలా ప్రభుత్వం పట్ల ప్రజల్లో మొదలైనవయారి వ్యతిరేకత ఇంతై ఇంతింతై అన్నట్లుగా పెరుగుతోంది. మరో వంక ఇదే సమయంలో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రాధాన కార్యదర్శి లోకేష్  వివిద కార్యక్రమల ద్వారా జనంలోకి దూసుకు పోతున్నారు. తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తల్లో జోష్ పెరిగింది. 

అదలా ఉంటే జనసేన మళ్ళీ మరోమారు తెలుగుదేశంతో దగ్గరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ, విశాఖ ఉక్కు విక్రయాన్ని జనసేన వ్యతిరేకిస్తోది. అంతేకాదు, డిసెంబర్ 12న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులకు మద్దతుగా జనసేనాని పవన్ కల్యాణ్ అమరావతిలో సంఘీభావ దీక్ష చేపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే బీజేపీ దూరంగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలో జనసేనతో పాటుగా  వామపక్ష పార్టీలు కూడా తెలుగు దేశంతో జట్టుకట్టే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. ఏమైనా ఏపీ రాజకీయాల్లోవస్తున్న మార్పులు వైసీపీ ... ఒక్క ఛాన్స్ సర్కార్’ కథ కంచికి  చేరడం ఖాయమని సూచిస్తున్నాయి. 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.