తులసి రెడ్డికి పీసీసీ పగ్గాలు?

Publish Date:Dec 21, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్  పీసీసీ అధ్యక్షుని మార్పుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ఆ దిశగా కసరత్తు ప్రారంభించిందా? అందుకేనా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ఉమెన్ చాందీ విజయవాడ చేరుకుంది? రేపో మాపో ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు శైలజా నాథ్ స్థానంలో కొత్త పీసీసీ చీఫ్ రావదం,ఖాయేమేనా?అంటే అవుననే అంటున్నారు పార్టీ ఇన్సైడర్స్. 

నిజానికి, రాష్ట్ర విభజన నాటి నుంచి నవ్యాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉండీ లేనట్లుగానే ఉంది. వరసగా 2014,2019 సార్వత్రిక ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేదు.  నవ్యాంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ఇంతవకు కాంగ్రెస్ పార్టీ కాలు పెట్టలేదు. రెండు ఎన్నికలలోనూ హస్తం పార్టీకి రెండు శాతం కంటే తక్కువగానే ఓట్లు పోలయ్యాయి. అయినా గతవైభవ చిహ్నంగా పార్టీ మనుగడసాగిస్తూనే వుంది. రాష్ట్ర విభజన నేపధ్యంగా పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన మాజీ మంత్రి రఘువీరా రెడ్డి పరిస్థితులు అనుకులించక పోయినా, ఐదారేళ్ళు చురుగ్గానే పనిచేశారు. రఘువీరా రెడ్డి క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత,మరో మాజీ మంత్రి  శైలజానాథ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అయితే, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుని ముందుకు సాగడంలో ఆయన అంతగా విజయం సాదించలేక  పోయారు. మరో వంక ఆయన వ్యవహర సరళికి సంబంధించి పార్టీ అధిష్టానానికి గత కొంత కాలంగా ఫిర్యాదులు అందుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపధ్యంలోనే పార్టీ అధిష్టానం ఆయన స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. 

పీసీసీ అధ్యక్షుని మార్పు విషయం చర్చించేందుకే విజయవాడ చేరుకున్న ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ఉమెన్ చాందీ రెండు రోజుల పాటు విజయవాడలో బస చేయనున్నారు. ఈరోజు ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకులతో సమావేశం అవుతారు. రేపు (బుధవారం) పీసీసీ సమావేశంలో పాల్గొంటారు. అలాగే, బుధవారం మరోమారు  పార్టీ ముఖ్య నాయకులతో ఉమెన్ చాందీ సమావేశం అవుతారని, ఈ మొత్తం ఎక్సర్సైజ్, కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక  కోసమే అని పార్టీ వర్గాల సమాచారం. ఆగష్టులో  రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో రాహుల్ గాంధీ సమావేసమైనప్పుడే  పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందని వార్తలొచ్చాయి. అప్పట్లో రాజ్య సభ మాజీ సభ్యుడు  కేవీపీ రామ చంద్రరావు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటుగా కేంద్ర మాజీమంత్రులు పల్లంరాజు, జేడీ శీలం, ఎంపీలు కేవీపీ, హర్ష కుమార్, చింతా మోహన్ మరికొందరు  నాయకులు  రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా, కేవీపీ, కిరణ్ కుమార్ రెడ్డి, పల్లంరాజు, పేర్లు పీసీసీ అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. 

అయితే  ఇప్పుడు  పీసీసీ రేసులో మరో రెండు మూడు పేర్లు షికారు చేస్తున్నా, ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్    ఎన్. తులసి రెడ్డివైపే రాహుల్ గాంధీ మొగ్గుచుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏపీలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై రాహుల్ గాంధీ ఏపీ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జ్ ఉమెన్ చాందీతో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నివిధాలా విఫలమైన నేపధ్యంలో పార్టీ పునర్జీవనానికి ఇదే సరైన సమయమని ఉమెన్ చాందీ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆయన రాహుల్  గాంధీకి ఒక నివేదికను కూడా ఇచ్చారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగానే రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారనే ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే తులసి రెడ్డి ఎంపిక నిర్ణయం జరిగిందని, ఇక ప్రకటన మాత్రమే మిగిలుందని అంటున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.