Publish Date:Aug 31, 2022
కోర్టు ధిక్కరణ నేరం రుజువవడంతో హైదరాబాద్‌లోని ఏపీ మహేశ్ బ్యాంకు ఎండీ,సీఈవో సహా 11 మందికి హైకోర్టు జైలు శిక్ష విధించింది. 15 రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ జస్టిస్ పి.నవీన్‌రావు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఏపీ మహేశ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు సొసైటీకి ఎన్నికలు నిర్వహించే విషయంలో సొసైటీకి చెందిన రెండు వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఓటర్ల జాబితా రూపకల్పనలో అక్రమాలు జరిగాయని, ఎన్నికల నిర్వహణను నిలిపేయాలని పలువురు కోర్టును ఆశ్రయించారు.
విచారణ చేపట్టిన హైకోర్టు గత ఏడాది జనవరిలో కామన్ ఆర్డర్ జారీ చేసింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించవచ్చనీ.. అయితే తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు కొత్తగా ఎన్నికైన డైరెక్టర్లు ఎటువంటి విధానపరమైన నిర్ణయాలూ తీసుకోరాదని తెలిపింది. అయితే హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా రూ.100 కోట్ల మేర రుణాలు జారీ చేశారని.. పేర్కొంటూ బ్యాంకు షేర్‌హోల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేసింది. వాదనలు విన్న ధర్మాసనం డైరెక్టర్ల బోర్డు కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు తేలినందున వారికి 15 రోజుల సాధారణ జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.
ఇప్పటి వరకూ వ్యక్తుల ఖాతాలపై దాడి చేసి దోచుకున్న నేరగాళ్లు ఏకంగా బ్యాంక్ సర్వర్‌నే హ్యాక్ చేశారు. మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకు సర్వర్‌ను హ్యాక్ చేసి రూ.12.90 కోట్లు లాగేశారు. బ్యాంకు సాంకేతిక సిబ్బంది స్పందించే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బ్యాంకు మెయిన్ సర్వర్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు దోచుకున్న మొత్తాన్ని 100 వేర్వేరు ఖాతాలకు బదిలీ చేసేశారు. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీులు.. నిధులు కాజేసిన ప్రధాన సూత్రధారిని గుర్తించారు. నైజీరియా నుంచే బ్యాంకు సర్వర్లను హక్ చేసి డబ్బు కొట్టేసినట్లు కనుగొన్నారు. భారత్‌లో ఉండి నైజీరియన్ కి సపోర్ట్ చేసిన కీలక సూత్రధారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సైబర్ నేరగాళ్లు డబ్బుని బదిలీ చేసిన ఖాతాలన్నీ ప్రస్తుతం ఫ్రీజ్ అయి ఉన్నాయి. కోర్టులో కేసు నడుస్తోంది. అయితే కోర్టు అనుమతి లేకుండా బ్యాంకు లావాదేవీలు జరిపినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. దీన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందుకు బ్యాంకు చైర్మన్ తో పాటు 10 మంది డైరెక్టర్లకు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-mahesh-bank-directors-in-prison-39-142998.html
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.