ఉదయనిథి స్టాలిన్ అరెస్టు.. ఎందుకంటే?

Publish Date:Aug 4, 2026

Advertisement

తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయ నిథి స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేశారు.  ముఖ్యమంత్రి విజయ్, ప్రముఖ నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ సోమవారం (ఆగస్టు 3) చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు వెలువడిన కేవలం 24 గంటల వ్యవధిలోనే చెన్నై పోలీసులు  ఉదయనిథి స్టాలిన్ ను అదుపులోనికి తీసుకున్నారు. 

అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి  ఉదయనిధి స్టాలిన్‌పై   ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, మంగళవారం (ఆగస్టు 4)ఉదయం ఉదయనిథి స్టాలిన్ ను ఆయన నివాసంలోనే అరెస్టు చేసి తీసుకెళ్లారు.  నివాసం నుంచి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అసలు వివాదం ఏమిటంటే.. సోమవారం (ఆగస్టు 3) తంజావూరులో కావేరి  జలాల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన   బహిరంగ  సభలో ఉదయనిథి స్టాలిన్     ముఖ్యమంత్రి  విజయ్ పాలనపై, ఆయన రాజకీయ విధానాలపై విమర్శలు చేశారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొందరు డీఎంకే  కార్యకర్తలు..   విజయ్ వ్యక్తిగత విషయాలు, సినిమాలను ప్రస్తావిస్తూ..  త్రిష అంటూ నినాదాలు చేశారు. వాటికి స్పందనగా.. ఉదయ నిథి స్టాలిన్  నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు.  ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నించినా.. ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.  సోషల్ మీడియా వేదికగా ఉదయనిథి స్టాలిన్   వ్యాఖ్యల వీడి యోలు  తెగ వైరల్ అవ్వడంతో వివాదం మరింత ముదిరింది. 

ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో తమిళనాడు హోంశాఖ,  చెన్నై పోలీసులు చట్టపరమైన చర్యలకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రీకారం చుట్టారు. 

కాగా ఉదయనిథి స్టాలిన్ అరెస్టును డీఎంకే తీవ్రంగా ఖండించింది.   డీఎంకే లీగల్ సెల్  మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. డీఎంకే తరఫు న్యాయవాదులు మద్రాస్ హైకోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. అదలా ఉంటే..  డీఎంకే నేతలు ఉదయనిథి స్టాలిన్ అరెస్టును రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తుంటే..   ప్రభుత్వం  చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరూ  చట్టానికి అతీతులు కారని అంటోంది.  రాజకీయ పరిశీలకులైతే.. ప్రజా క్షేత్రంలో ఉండే నాయకులు బాధ్యతా యుతంగా మాట్లాడాలనీ, అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు ఇలానే ఉంటాయనీ అంటున్నారు.  

Udayanithi Stalin arrested, Tamilnadu, Former, Deputy CM, Untoward, Comments, Actress, Trisha

By
en-us Political News

  
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న  స్థానిక  ఎన్నికల్లో  బీజేపీకి  ఏ పార్టీతోనూ  పొత్తులు పెట్టుకునే ఆలోచన  లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.