ఏపీ పంచాయతీ ఎన్నికలు: కూటమి సీట్ల సర్దుబాటు కొలిక్కి.!
Publish Date:Oct 16, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతకొద్ది రోజులుగా ఉత్కంఠ రేపుతున్న కూటమి సీట్ల పంచాయితీకి ఎట్టకేలకు తెరపడింది. ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు మూడు పార్టీలు ఎక్కడెక్కc ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయాలో స్పష్టత వస్తూ అధికారిక ప్రకటన వెలువడింది. తాజా లెక్కల ప్రకారం, జనసేన పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా 4 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలను కేటాయించారు. అలాగే మిత్రపక్షమైన బీజేపీకి 2 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో తమ ప్రాబల్యాన్ని బట్టి కనీసం 40 శాతం సీట్లు ఇవ్వాలని జనసేన పట్టుబ ట్టినప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఆ పార్టీ అధినేతతో చర్చించి జనసేనను. 20 శాతం లోపు సీట్లకే పరిమితం కావడానికి ఒప్పించారు. మరోవైపు బీజేపీ పెద్దగా పట్టుబట్టకపోయినా, రాజమండ్రి, అనంతపురం కార్పొరేషన్లతో పాటు 7 మున్సిపాలిటీలను కేటాయించడం గమనార్హం. రాజమండ్రిలో లోక్సభ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అక్కడ ఆ సీటు ఇవ్వడం సహజమే అయినప్పటికీ, అనంతపురం కార్పొరేషన్ను కూడా కేటాయించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చంద్రబాబు తన వ్యూహాత్మక రాజకీయాలతో జనసేనను ఆ పార్టీ కోరినన్ని స్థానాల కోసం పట్టుబట్టకుండా ఒప్పించగలిగారని పరిశీలకులు అంటున్నారు. చంద్రబాబు తనదైన శైలిలో కూటమిలో సీట్ల సర్దుబాటును పూర్తి చేసి తన రాజకీయ పరిణతిని చాటుకున్నారు. [Ap Localbody Elections, Telugudesham Kutami Seat Sharing, Janasena TDP BJP AP Politics Telugu One]
http://www.teluguone.com/news/content/ap-localbody-elections-25-234534.html




