160 మద్యం షాపులకు నో అప్లికేషన్‌

Publish Date:Jun 26, 2012

Advertisement

ఇది ఓ గమ్మత్తు అయిన విషయం. రాష్ట్రంలో కోలాహలంగా మద్యం దుకాణాల లక్కీడీప్‌ కేటాయింపుల కోసం పోటీ పడుతున్నారు. అయితే 160 మద్యం దుకాణాలకు మాత్రం ఒక్క అప్లికేషను కూడా దాఖలు కాలేదు. ఇది ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా 6564 దుకాణాలకు 30వేలకు పైచిలుకు ధరఖాస్తులొచ్చాయి. ఈసారి పురుషులతో  సమానంగా మహిళలూ పోటీపడి మరీ ధరఖాస్తు చేశారు. ఇఎండి కింద ఎక్సయిజ్‌ ఖజానాకు 75కోట్ల రూపాయలు చేరింది. గతేడాదితో పోలిస్తే ఇది 50శాతం ఎక్కువ.

గ్రేటర్‌హైదరాబాద్‌లో 379దుకాణాలుంటే వాటికి 470ధరఖాస్తులు వచ్చాయి. వీటిలో 70 షాపులకు మాత్రం ఒక్క ధరఖాస్తు కూడా అందలేదు. ఈ షాపుకు రూ.1.04కోట్లు లైసెన్స్‌ ఫీజు. అలానే గుంటూరు జిల్లాలో 20షాపులకు, కడప జిల్లాలో 70 నుంచి 80షాపులకు కూడా ధరఖాస్తు రాలేదు. అలానే తమ భార్యల చేత్తో ఇఎండి కట్టించటం లక్కు కలిసి వస్తుందని భావించి కొందరు మహిళలను తోడు తీసుకువచ్చారు. చిన్నచిన్న కాంట్రాక్టులు చేసేవారు, కొత్తగా ఈ వ్యాపారంలో దిగాలనుకున్న వారు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో 555 దుకాణాలకు 2178 ధరఖాస్తులు వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 473షాపులకు 3243 ధరఖాస్తులు, విశాఖలో 406షాపులకు రెండువేలు, నల్గొండలో 241షాపులకు 3149, వరంగల్‌ 231షాపులకు 3000, శ్రీకాకుళం 232షాపులకు 1900, విజయనగరం 202షాపులకు 2000, ప్రకాశం 321షాపులకు 3000, ఖమ్మం 151షాపులకు 2371,కర్నూలు 194షాపులకు 620, గుంటూరు జిల్లాలో 342కు 4000, కడప జిల్లాలో 269షాపులకు 1500, నిజామాబాద్‌జిల్లాలో 142 షాపులకు 1500, నెల్లూరు 348షాపులకు 3000, అనంతపురం జిల్లాలో 236షాపులకు 2000, చిత్తూరు జిల్లాలో 458షాపులకు 1500, కృష్ణాజిల్లాలో 335షాపులకు 3000, గ్రేటర్‌హైదరాబాద్‌ 379షాపులకు 470, రంగారెడ్డి జిల్లాలో 390షాపులకు 700, మెదక్‌ 165షాపులకు 1300 ధరఖాస్తులు వచ్చాయి.
 

By
en-us Political News

  
నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో   ప్రతికూల ప్రభావం చూపిందని, దీని ఫలితంగా రాష్ట్రంలో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు సుమారు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయని వెల్లడించిన సీఎస్..  సింగూరు డ్యామ్ దాని పరిసర ప్రాంతాలలో నీటి లభ్యతను, పంటల పరిస్థితిని   క్షేత్రస్థాయిలో పరిశీలించాననీ,  భూగర్భ జలమట్టాలు అత్యంత ఆందోళనకరంగా పడిపోయాయని తెలిపారు.
ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్ ఆరోపణల వెనుక నిజమెంత.?
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు క్షణం తీరిక లేకుండా వారిపై కన్ను వేసి ఉంచడం ఎంత ముఖ్యమో చెప్పడానికి నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఒక హృదయవిదారక ఘటనే నిదర్శనం.
 హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎల్బీనగర్‌ హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన కౌకూర్ ఆర్చిడ్ విల్లాలో ఐదేళ్ల చిన్నారి ఆరిలియా హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి
హైదరాబాద్ నగరంలో క్రిప్టోకరెన్సీ లావాదేవీల నేపథ్యంలో తీవ్ర కలకలం రేపిన భారీ దోపిడీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఐదున్నర ఎకరాల స్థలం తమదేనంటూ ఓ వ్యక్తి, అతని కుమారుడు వచ్చి.. సి. రామచంద్రయ్య నుంచి అడ్వాన్స్ గా పాతిక లక్షలు తీసుకున్నారు. ఆ తరువాత పత్రాలు చూపించకుండా తప్పించుకున్నారు. సి.రామచంద్రయ్య ఫిర్యాదు మేరకు  ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దేశానికి నిజంగా స్వరాజ్యం సిద్ధించిందా? అంటే అనుమానమే అనే సమాధానం వచ్చేలా ఉంది. కొన్ని చోట్ల ఇంకా కొనసాగుతున్న పెత్తందారీ వ్యవస్థ కారణంగా.  పేరుకే ప్రజాస్వామ్యం కానీ   చోట్ల అభివృద్ధి, సామాజిక ఐక్యత పేరుతో  కొన్ని ప్రాంతాలలో అనధికార కమిటీలు ప్రజలపై ఆంక్షలు విధిస్తున్నాయి. 
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో  ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.