న్యూయర్ రాష్ట్రానికి ఘనమైన ఆరంభం : సీఎం చంద్రబాబు
Publish Date:Jan 3, 2026
Advertisement
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ధిక నివేదికలో వెల్లడించింది. దీనిపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజలకు శుభావార్త అని, కొత్త సంవత్సరానికి ఘనమైన ఆరంభమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ముందు చూపుతో కూడిన విధాన సంస్కరణల వల్లే ఇది సాధ్యమైందని వెల్లడించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినేస్ కార్యక్రమాల ప్రభావాన్ని ఇది ప్రతిబింబిస్తుందన్నారు. 2026 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలానికి (ఏప్రిల్-డిసెంబర్ 2025) దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల్లో ఏపీ ఏకంగా 25.3 శాతం వాటాను దక్కించుకుంది. ఈ విషయాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా తన తాజా ఆర్థిక నివేదికలో వెల్లడించింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ మేరకు ఫోర్బ్స్ బిజినెస్ మేగజైన్ ఓ కథనం వెలువరించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం, ఈ తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా మొత్తం రూ.26.6 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ తర్వాత ఒడిశా (13.1 శాతం), మహారాష్ట్ర (12.8 శాతం) రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ మూడు రాష్ట్రాలు కలిపి దేశంలోని మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల్లో 51.2 శాతం వాటాను ఆకర్షించడం గమనార్హం.
http://www.teluguone.com/news/content/ap-investments-36-211959.html





