ఏపీ పెట్టుబడులు తమిళనాడుకు.. జగన్ వద్దంటే స్టాలిన్ కావాలంటున్నారు..

Publish Date:Mar 29, 2022

Advertisement

దుబాయ్‌కి చెందిన ప్రముఖ లులూ గ్రూపు సంస్థ తమిళనాడులో మూడు ప్రాజెక్టులను చేపట్టే దిశగా రూ.3500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో రూ.2500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే రెండు మాల్స్, రూ.1000 కోట్ల పెట్టుబాడితో ఏర్పాటు చేసే ఫుడ్ ప్రాసెసింగ్  యూనిట్, ఉన్నాయని, తమిళనాడు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. 

తమిళనాడు ప్రభుత్వం లులూ గ్రూపుతో చేసుకున్న ఒప్పందం వలన పెట్టుబడులతో  పాటుగా పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని, అందుకు సమబందించిన వివరాలను తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, నిజానికి ప్రాజెక్ట్, ఈ పెట్టుబడులు ఏపీకి వచ్చి, వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వలన వెనక్కి వెళ్ళాయి. అదీ బాధాక‌రం. 

వివరాలోకి వెళితే,  అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం లులూ గ్రూపుతో  2017-18లోనే ఇంచు మించుగా ఇదే మొత్తంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జరిపిన చర్చల ఫలితంగా లులూ గ్రూపు విశాఖలో భారీ వాణిజ్య సముదాయం, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ముందుకొచ్చింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సీతమ్మధార ప్రాంతంలో 13.38 ఎకరాల భూమిని కేటయించింది. అయితే పనులు ప్రారంభమయ్యేలోపు ఎన్నికలు రావడం, వైసీపీ అధికారంలోకి రావడం జరిగి పోయాయి. ఇక ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది చరిత్ర. 

జ‌గ‌న్‌ ప్రభుత్వం కొలువు తీరింది మొదలు, భూ దందాకు తలుపులు తీసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందు చూపుతో, లులూ గ్రూపుకు కేటాయించిన భూమిని, వైసీపీ ప్రభుత్వం కుంటిసాకులు చూపించి వెనక్కి తీసుకుంది. దీంతో లులూ గ్రూపు, మీకో దండం, మీ ప్రభుత్వానికో దండం అని చెప్పి, ఇక ఎప్పటికీ ఏపీలో పెట్టుబడులు పెట్టేది లేదని, చెప్పి వెనక్కి వెళ్ళిపోయింది. నిజానికి అప్పట్లో, ఈ విషయంగా చాలా పెద్ద దుమారమే చెలరేగింది. అయితే ప్రభుత్వం, లులూ ప్రాజెక్ట్ అటకెక్కటానికి భూవివాదం, పర్యావరణ సమస్యలు కారణమని పేర్కొంది. కానీ, అవి కుంటి సాకులు మాత్రమే అని, లులూ గ్రూప్  అప్పుడే ఆధారాలతో సహా స్పష్టం చేసింది. ఆలాగే, వైసీపీ ప్రభుత్వం పెట్టుబడులకు,  లులూ గ్రూప్’కు వ్యతిరేకం కాదని, గత తెలుగు దేశం ప్రభుత్వం భూమి కేటాయింపుకు అనుసరించిన విధానాలకు మాత్రమే వ్యతిరేకమని, అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి గౌతం రెడ్డి, లులూ గ్రూప్ కి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, రూ 2,200-కోట్ల ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేసిన లులూ గ్రూప్’ యాజమాన్యం తెలుగుదేశం ప్రభుత్వం చాలా చక్కగా, పారదర్శకంగా ఒప్పందం కుదుర్చుకుందని స్పష్టం చేసింది. 

అదలా ఉంటే వైసేపీ ప్రభుత్వం, లులూ గ్రూపు ఒప్పందానికి ఏ నిబంధనలు అయితే, అడ్డుగా పేర్కొందో, ఆ నిబంధనలు అన్నిటినీ  తుంగలో తొక్కి, అదే 13.38ఎ కరాల భూమిని, నివాస/వాణిజ్య నిర్మాణాలకు అనువుగా అభివృద్ధి చేసి, బిల్డ్ ఏపీ మిషన్ పేరిట, వాణిజ్య సదుపాయాల నిర్మానానికి  విక్రయించాలని నిర్ణయించింది. అసలు ఈ గోల్ మాల్ కోసమే, వైసీపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి లులూ గ్రూప్’ ను రాష్ట్రం  నుంచి తరిమి వేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిజానికి వైసేపీ ప్రభుత్వం నిర్వాకం వలన రాష్ట్రం నుంచి వెళ్లి పోయింది ఒక్క లులూ పెట్టుబడులు మాత్రమే కాదు, చెప్పుకుంటే కొండవీటి చెంతాడంత చిట్టా బయటకు వస్తుందని నిపుణులు అంటున్నారు.

By
en-us Political News

  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.