పంచ్ ప్రభాకర్ పై చర్యలేవి.. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
Publish Date:Oct 29, 2021
Advertisement
జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏపీ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణలో భాగంగా విశాఖ సీబీఐ ఎస్పీ ఇవాళ హైకోర్టు ఎదుట హాజరయ్యారు. పంచ్ ప్రభాకర్ వీడియోలపై యూట్యూబ్‌కు లేఖ రాశామని ఆయన చెప్పడంతో.. తమకు ఎలాంటి లేఖ రాలేదని యూట్యూబ్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పంచ్ ప్రభాకర్‌ను ఎవరో నడిపిస్తున్నారని హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ సందేహం వ్యక్తం చేసింది. ఆయనపై తీసుకున్న చర్యలేంటో చెప్పాలని.. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్లు పెట్టిన కేసుపై హైకోర్టులో గురువారం కూడా విచారణ జరిగింది. ఈ కేసులో సీబీఐ విచారణ జరుగుతున్న తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరీ ముఖ్యంగా, పంచ్ ప్రభాకర్ వ్యవహారంపై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రభాకర్ దెబ్బ తీస్తున్నాడని, అతనిని ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని సీబీఐని గట్టిగా నిలదీసింది హైకోర్టు. తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సీబీఐ పట్టించుకోలేదంటూ.. స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది అశ్విని కుమార్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. పంచ్ ప్రభాకర్‌కి కనీసం ఒక్క నోటీసు కూడ ఇవ్వలేక పోయారని చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లకు నోటీసులు ఇవ్వాలని.. ప్రభాకర్ వీడియోలు తొలగించేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది కోరారు. దీంతో హైకోర్టు నుంచి సీబీఐకి లేఖ రాయాలని ధర్మాసనం ఆదేశించింది.
http://www.teluguone.com/news/content/ap-high-court-serious-on-jagan-govt-over-punch-prabhaker-case-39-125455.html





